నాకూ నొప్పి పుడుతుంది...(కథ)

 

                                                            నాకూ నొప్పి పుడుతుంది                                                                                                                                                     (కథ)

"ఆదర్శ వివాహం" కోల్పోవడం అనేది మరణం ద్వారా జీవిత భాగస్వామిని కోల్పోయే సంక్షోభం. ఒంటరిగా, ప్రేమించబడలేదని మరియు తిరస్కరించబడినట్లు అనిపించవచ్చు. విడాకుల కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తీవ్ర నొప్పిని అనుభవించవచ్చు. విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది

***************************************************************************************************

విండో సైడు సీటులో కూర్చుని మెల్లగా చూపులను బయటకు పంపాను.

చల్లని గాలి మొహానికి తగిలి విసుగ్గా ఉన్న నా మనసును చల్ల బరిచింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు, ఒక గంటన్నర సేపు తరువాతి బస్సు కొసం కాచుకోవలసి వచ్చింది.

రాత్రి ఏడు గంటలు. బస్సు బయలుదేరింది. గాలి ఇంకా వేగంగా వీచింది. మొహాన పడుతున్న తల వెంట్రుకలను వెనక్కి తోసుకుంది.

మొబైల్ మోగటం వినిపించ, హ్యాండ్ బ్యాగులోని మొబైల్ తీసాను.

కొడుకే ఫోన్ చేసింది.

అమ్మా...నేను ఇంటికి వచ్చాసాను అన్నాడు.

సరేరా...మామూలుగా ఎప్పుడూ ఎక్కే బస్సు మిస్ చేశాను. తరువాతి బస్సు ఇప్పుడే వచ్చింది. ఎక్కేశాను. రావటానికి కొంచం ఆలస్యం అవుతుంది. నువ్వు కాఫీ పెట్టుకుని తాగేయి...సరేనా?”

సరేమ్మా...అది అదొచ్చి...మనింటికి... అంటూ లాగాడు.

ఏమిట్రా...లాగుతున్నావు...ఏమిటి విషయం?”

అమ్మా...మనింటికి వీళ్ళు వచ్చారు

వీళ్ళంటే...ఎవరు?”

సరోజినీ పెద్దమ్మ, పెద్దనాన్న తరువాత ప్రతాప్ అందరూ వచ్చారు...

ప్రతాప్అన్న పేరు వింటూనే మనసులో ఏదో మంటలు ఎగిసిపడి నిప్పు శ్వాసగా బయటకు వెళ్లటం అనుభవించాను.

కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాను. దేన్నో జ్ఞాపకానికి తీసుకు వచ్చి కళ్లను ఆర్పనివ్వకుండా చేసింది.

నా పెళ్ళి జరిపించిన రెండు కుటుంబాల పెళ్ళి బ్రోకర్, వరసకు అక్కయ్య అవుతుంది సరోజినీ.

పెళ్ళికి ముందు ఆమెతో బాగా మాట్లాడి మంచి స్నేహితులుగా ఉండే వాళ్ళం. పెళ్ళి తరువాత ఆమెను 'అక్కయ్యా' అని వరుస పెట్టి  పిలిచిందే లేదు.

కారణం ఆమె నాతో చెప్పిందంతా అబద్దం. ఆమె చెప్పిన అబద్దాలలో అతిపెద్ద అబద్దం ఏమిటంటే అమ్మాయినీ ప్రతాప్ కళ్లెత్తి చూసింది లేదు. అమ్మాయిలతో పరిచయమో, మాట్లాడటమో ప్రతాప్ కు అలవాటు లేదు...అనేదే.

నా జీవితాన్ని నాశనం చేసిన ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చుంటుంది? ఆమెతో పాటూ అతన్ని ఎందుకు తీసుకు వచ్చింది?’

పది సంవత్సరాలుగా ముంబైలో ఎవత్తితోనో కుటుంబం నడుపుతున్నాడు అని వచ్చిన వార్తను, తట్టుకుని, నేను నా కొడుకుతో జీవిస్తూ వస్తున్నా. ప్రతాప్  మమ్మల్ని దుస్థితిలో వదిలి వెళ్ళేటప్పుడు నా కొడుక్కు వయసు పదకుండు. ఆరో క్లాసు చదువుతున్నాడు. ఒక సంవత్సరం అయిన తరువాతే వాడికి నిజం చెప్పాను.

అంతకు ముందు వరకు ముంబై నుండి ఏదో ఒక రోజు నాన్న వస్తారని వాడు నమ్మకంతో ఉన్నాడు.

ఒక రోజు నాన్నను వెతుక్కుంటూ వాడి ఏడ్చిన రోజు నిజాన్ని వాడికి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇకమీదట పసి మనసును వేచి ఉండమని చెప్పి మోస పుచ్చటానికి మనసురాక విషయాన్ని వాడికి చెప్పాను.

ఏవత్తో ఒకత్తితో మీ నాన్న పారిపోయారురా...ఇక అతన్ని వేతక్కు అని నేను ఏడుస్తూ చెప్పటాన్ని కదలకుండా వింటూ ఉన్నాడు.

కొద్దిసేపట్లో వాడు యధార్ధ పరిస్థితికి వచ్చాడు. నా కన్నీరును తుడుస్తూనే నన్ను కావలించుకున్నాడు. రోజు నుండి వాడికోసమే జీవిస్తున్నాను.

మమ్మల్నిద్దరినీ వద్దని చెప్పి పారిపోయిన అతను ఇప్పుడెందుకు తిరిగి వచ్చాడు.

సీటులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను. తరిమి కొట్టి నన్ను చంపి పూడ్చిపెట్టిన ఘోరమైన జ్ఞాపకాలన్నీ ప్రాణం తెచ్చుకుని నా కళ్ల ముందు వచ్చి వచ్చి వెళ్తున్నాయి.

పది సంవత్సరాలు వాడితో గడిపిన నరక జీవితం చివరికి పది నిమిషాల దృష్యాలుగా నా మనసును దాటి వెళ్ళినై.

బస్సులో నుండి దిగి స్కూటీ తీసుకుని ఇంటికి బయలుదేరాను.

ఏడు నిమిషాల ప్రయాణమే. కానీ, మనసు బరువెక్కి, ఘోర జ్ఞాపకాలు ఒకటి తరువాత ఒకటి వస్తుంటే, ఇంటికి వచ్చి చేరటానికి పదిహేను నిమిషాలు అయ్యింది. స్కూటీను కాంపౌండ్ బయటే ఉంచాను. నా కొడుకు వచ్చి గేటు తెరిచి బండిని లోపలకు తీసుకు వచ్చేలోపు నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. నా మొబైల్ మోగింది.

అవును...ఇప్పుడే వచ్చి దిగాను రాని నవ్వును కష్టపడి తెచ్చుకుని, దానిని పెదాలపైన అతికించినట్టు సోఫాలో కూర్చున్నాను.

ఎదురుగా కూర్చున్న వాళ్ళను పట్టించుకోకుండా ఫోనులో మాటలు కంటిన్యూ చేశాను.

మీరు ఇంకా ఇంటికి వెళ్లలేదా...?” యధార్ధంగా కూల్ గా అడిగాను.

సరే...సరే...కాసేపు అయిన తరువాత మాట్లాడుతాను

....................................”

లేదు...లేదు...బాగానే ఉన్నాను...అని విషయాలూ తరువాత చెబుతాను అని చెప్పి మొబైల్ ఆఫ్ చేసి ఎటువంటి చలనమూ లేకుండా సరోజినీనూ, ఆమె భర్తను చూశాను.

ఏమిటి...ఎలా ఉన్నావు కవితా?” అన్నది.

బాగా ఉన్నాము. ఏమిటి హఠాత్ విజయం?”

టైములో నా కొడుకు నేను కూర్చోనున్న సొఫాలో వచ్చి కూర్చుని నా మీద ఆనుకున్నాడు. అది నాకు పెద్ద ఓదార్పుగానూ, పెద్ద గౌరవంగానూ అనిపించింది.

చెప్పండి...ఏమిటి విషయం?” అన్నాను. చేతిలో ఫోను వైపు చూస్తూ.

ఏమీలేదు...ఇంతవరకు జరిగినదంతా మర్చిపోయి మీ ఇద్దరూ ఒకటిగా కలిసి జీవించండి కవితా... అన్నది సరోజినీ, చిన్నటి స్వరంతో.

ఏటువంటి సమాధానమూ చెప్పకుండా అలాగే కూర్చున్నాను. కొన్ని క్షణాలు గడిచినై. మళ్ళీ ఆమే మాట్లాడింది.

అతను అన్ని తప్పులనూ తెలుసుకుని...అన్నీ వదిలేసి వచ్చాడు... అన్నది.

వదిలేసింది ఇతనా...లేక ఆమెనా?’ మనసులో అడిగింది.

ఆమెను వదిలేసి రావటానికి ఇంకో ఎవత్తితోనో వెళ్ళుంటాడు దరిద్రుడు. అందువల్ల ఆమె వీడిని తరిమికొట్టుంటుందీ దీన్ని కూడా మనసులోనే మాట్లాడుకుంది.

కోపాన్ని బయటకు చూపి నా విరక్తి కొలతను వాళ్ళు లెక్క వేయకూడదని చాలా జాగ్రత్తగా ఉన్నాను. నా కాళ్ళు తానుగా ఊగి నా ఎమోషన్స్ ను అమోదించినై.

కవితా...నీకోసం కాదు... నీ కొడుకు కోసం అన్నీ మర్చిపో. తండ్రి లేకుండా ఇన్ని  రోజులు వాడు జీవించాడు. ఇకమీదట అయినా... అని ఆమె మాటలాగ...అనుచుకోలేక నవ్వాశాను. నవ్వులో నటన లేదు.

లోపు నువ్వేదైనా చెప్పూ అనేలాగా ప్రతాప్ ను చూసి సరోజినీ కనుసైగ  చేసింది.

ఇక మీ ఇద్దర్నీ వదిలి ఎక్కడికీ వెళ్ళను. నన్ను నమ్ము కవితా...అన్నాడు అతను.

నా ఫోను మళ్ళీ మోగింది. కట్ చేశాను.

అదంతా సరే. కానీ, నా వల్ల ఆమోదించటం కుదరదే... అన్నాను నిదానంగా.

వెంటనే నిన్ను అంగీకరించమని చెప్పటంలేదు....ఎప్పుడు ఆమోదించాలని అనిపిస్తుందో అప్పుడు చెప్పు...మనిద్దరం కలిసి జీవిద్దాం. అంతవరకు కాచుకోనుంటాను అని చెప్పి తనని హీరోగా చూపించుకున్నాడు.

దానికి ఇది సరైన సమయం కాదే...ఎందుకంటే నా మనసులో ఇంకొకరికి  చోటిచ్చాశాను. నా బాధలో, దుఃఖంలో, ఒంటరితనంలో నాకు ప్రేమ ఇచ్చి, ఆదరించిన నా స్నేహితుడికి నా మనసులో పూర్తిగా చోటిచ్చేశాను. ఇక నేనుగా ఆయన్ని వదలలేను. ఒకవేల ఏదైనా పరిస్థితిలో నన్ను వదిలి ఆయన వెళ్ళటం జరిగితే...మార్పు చూడొచ్చు. ఎవరికోసమూ మనసును నేను ఆవగింజంత కూడా గాయపరచటం నేను ఇష్టపడటం లేదు అంటూనే నా కొడుకును చూశాను.

వరున్...అమ్మకి ఆకలేస్తొందిరా. ఒక కాఫీ... అన్నాను.

సరేమ్మా... అన్నవాడు వంటగదిలోకి వెళ్ల...వచ్చిన ముగ్గురూ లేచాసారు.

మళ్ళీ మోగిన ఫోనును ఆన్ చేసి మాట్లాడటం మొదలు పెట్టాను.

ఎవరితో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను అనేది తెలుసుకోవటానికి ఇష్టంలేక కోపంతో మొదటి మనిషిగా ప్రతాప్ బయటకు వెళ్లాడు!

****************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

హక్కు...(కథ)