స్వర్గం-నరకం...(కథ)
స్వర్గం-నరకం (కథ) సింధుజాకి పట్టు శాలువా వేసి సత్కరించి అవార్డు ఇచ్చిన వెంటనే ఆ శభలో ఉత్సాహంతో చప్పట్లు మారుమోగినై . మొదటి వరుసలో కూర్చోనున్న లక్ష్మీప్రసాద్ మొహంలో మాత్రం ఎటువంటి సంతోషమూ లేదు. అందరూ చప్పట్లు కొడుతున్నారు కాబట్టి ఇష్టంలేకపోయినా శబ్ధం రాకుండా అతనూ చప్పట్లు కొట్టాడు. " సింధుజా ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ నటిగా ఎన్నుకోబడి , అవార్డు తీసుకున్నట్లే , రాబోవు సంవత్సరాలలో కూడా సాధించి , తన కళా సేవను దేశానికి అంకితం చేయాలని ఆమెను దీవిస్తున్నాను " అంటూ కత్తిలాగా మాట్లాడి తప్పుకున్నాడు మంత్రి . తరువాత దర్శకుడు చక్రవర్తి మాట్లాడటానికి లేచాడు . లక్ష్మీప్రసాద్ తన సీటు నుండి మెల్లగా లేచి , బయటకు నడిచాడు . వేదికపై కూర్చున్న సింధుజా అది గమనించింది . అప్పుడు ఆమె మనసులో ఏర్పడిన భారం ఆమె మ