పోస్ట్‌లు

మే 29, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మాటే మంత్రము…(కథ)

                                                                               మాటే మంత్ర ము                                                                                                                                                                   (కథ) సరొజ చెంప చెల్లు మన్నది ...! మంచి నీళ్ళు తీసుకురావటానికని బిందె తీసుకుని సరొజ బయలుదేరుతున్నప్పుడు ఆమె చెంప మీద కొట్టాడు చలపతి . ఎదురు చూడని ఆ చెంప దెబ్బ వలన సరొజ బుగ్గలు , చెవులు కందిపోయినై . కళ్ళల్లో నుండి బొటబొటా కన్నీరు దొర్లింది . " నీకు నేను ఎన్ని సార్లు చెప్పాను ! మంచి నీళ్ళు తీసుకురావటానికి నువ్వు వెళ్ళద్దు అని . నేను వెల్తాను అంటే వినవేమిటి ?” చెంపను రుద్దు కుంటూ చిరాకు పడింది సరొజ . " నువ్వు కాలుజారి క్రింద పడితే .... కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయితే ... ?" అతను సరొజ   దగ్గరున్న బిందెను లాక్కుని నడిచాడు . అప్పుడు సరొజ ఎనిమిది నెలల గర్భిణి . ' ఈయనకు నేనంటే ముఖ్యం కాదు . ఏప్పుడు చూడు బిడ్డ ... బిడ్డ ... బిడ్డ ...! గర్భం దాల్చిన దగ