పోస్ట్‌లు

జులై 11, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

గెలుపులో పాఠం…(కథ)

                                                                    గెలుపులో   పాఠం                                                                                                                                                                                 (కథ) " రాయ్ ... రెడ్డప్పా ... అసలు నువ్వు నా కొడుకువేనా ?... నిన్ను ఒకడు కొడితే , చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని వచ్చేస్తావా ? వెళ్ళు ... వెళ్ళి వాడికి నాలుగు తగిలించిరా ... వీలైతే వాడిని చితక బాదిరా ... అప్పుడే నువ్వు నా కొడుకువనిపించు కుంటావు " మీసాలు మెలేస్తూ చెప్పాడు తండ్రి వెంకటాచలం . " ఏమండీ ... చిన్న పిల్లవాడికి ఇలాగేనా చెప్పిచ్చేది ! వాళ్లు చిన్న పిల్లలండి ... ఈ రోజు కొట్టుకుంటారు ... రేపు కలిసిపోతారు . వెతుక్కుని వెళ్ళి దెబ్బలాడోస్తే పగ పెరుగుతుందే తప్ప ... ఇంకేమొస్తుంది చెప్పండి ?" పక్కనే నిలబడున్న రెడ్డప్ప తల్లి , భర్తతో చెప్పింది . " వసంతా " భార్యను చూసి గట్టిగా అరిచిన రెడ్డప్ప తండ్రి వెంకటాచలం " ఆపుతావా నీ పిరికిమాటలను . వాడు న