పోస్ట్‌లు

జూన్ 5, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రేమించుకోవచ్చు!...(కథ)

                                                                            ప్రేమించుకోవచ్చు!                                                                                                                                                                  (కథ) రోజంతా పనిచేసిన అలసటతో ,   ఆఫీసుల నుండి ఇంటికి తిరిగి వెళ్ళటానికి ఆ బస్ స్టాపింగ్ లో గుంపుగా నిలబడున్నారు కొందరు . ఆ గుంపుకు ఎడమ పక్కగా స్వప్నతో కలిసి నిలబడున్న కౌసల్య తన చేతి గడియారం లో టైము చూసింది . 5.50. ఆమె ఇంటికి వెళ్ళాల్సిన బస్సు ఈ పాటికి వచ్చుండాలి . కానీ , ఎందుకో ఈ రోజు ఇంకా రాలేదు . " ఏయ్ ... అటు చూశావా ?" అంటూ కౌసల్య భుజాన్ని తట్టింది స్వప్న . స్వప్న చూపిన వైపుగా చూసింది కౌసల్య . ఈ రోజు కూడా అతను వాళ్ళు నిలబడున్న వైపుకే వస్తున్నాడు . " అతను మనల్ని వెంబడించి రావడం ఇది నాలుగో రోజు ... రాస్కల్ " అంటూ తిట్టింది కౌసల్య . " మనల్ని కాదు ... నిన్ను . నిన్నే వెంబడిస్తున్నాడు !" చెప్పింది స్వప్న . " మొహం వాచేటట్లు నాలుగ