పోస్ట్‌లు

సెప్టెంబర్ 18, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

రైల్లో వచ్చిన అమ్మాయి…(కథ)

                                                             రైల్లో వచ్చిన అమ్మాయి                                                                                                                                              (కథ) తలమీద వులన్ టోపీ తగిలించుకుని , వులన్ సాలూవాతో రెండు సార్లు శరీరాన్ని చుట్టుకోనున్నా , కమాండర్ కపూర్ కి కలకత్తా యొక్క ఆ మాఘమాస చలి కొంచం కఠినంగానే ఉన్నట్టు అనిపించింది.. కార్గిల్ యుద్దంలో పాకిస్తాన్ సైనికులతో పోరాడుతున్నప్పుడు కురిసిన మంచు , చలి కంటే ఇదేమంత కఠినం కాదు అని చెప్పేంత చలిగాలి ఇక్కడ లేదని కపూర్ కి బాగా తెలుసు. అయినాకానీ ఆ రోజు ఆయన బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఆ చలి కఠినంగా అనిపించలేదు. ఈ రోజు ఆయనకు ఏ బాధ్యతా లేదు. రిటైర్ అయిపోయారు. తన ఇంటికి తిరిగి వెళుతున్నారు. స్టీం ఇంజెన్ బండి బయలుదేరటానికి గంట మోగింది. గార్డు యొక్క విజిల్ శబ్ధం వినబడిన వెంటనే బండి బయలుదేరింది. ఆ ఫస్ట్ క్లాస్ పెట్టెలో ఆయన తప్ప ఇంకెవరూ లేరు. చలి కాలం కాబట్టి సెకండ్ క్లాసులో కూడా ప్రయాణీకులు తక్కువగా ఉన్నారు. అందరు ప్రయణీకులూ కాళ్ళు జాపుకుని హాయిగా కూర్చున్నారు. కమాండర్ కపూర్ గ