పోస్ట్‌లు

జూన్ 16, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మాతృత్వం...(కథ)

                                                                         మాతృత్వం                                                                                                                                                       (కథ) ఆ రోజు ఆ కోర్టులో జడ్జిమెంట్ డే . ఆ జడ్జిమెంట్ వినడానికి పత్రికా విలేఖరులతో సహా మామూలు జనం కూడా పోగయ్యేరు . ఆ కోర్టు హాలు ఇంతకుముందెప్పుడూ అంతమంది జనంతో నిండలేదు . ఆ రోజు ఆ కోర్టులో ప్రముఖ రాజకీయ నాయకుడిదో లేక ప్రముఖ సెలెబ్రెటీ కి చెందిన కేసులోనో జడ్జిమెంట్ ఇవ్వటంలేదు . మరి అక్కడ అంతమంది జనం ఎందుకు గుమికూడున్నారో నన్న ప్రశ్న మీకనిపించవచ్చు . దానికో ముఖ్య కారణం ఉన్నది . ఆ కోర్టులో ఆ రోజు అత్యంత విన్నూతమైన , కొత్తరకం కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వబడుతోంది . జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవలన్న ఆత్రుత , ఇంట్రస్టే అక్కడ అంతమంది జనం పోగవడానికి అసలు కారణం . " జరగండి ... జరగండి " ... ఇద్దరు పోలీసులు గుంపును పక్కకు జరుపుతుంటే నిండు గర్భిణి అర్చన ఒక చేతిని నడుం మీద మ