పోస్ట్‌లు

ఆగస్టు 13, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

నాన్న...(మినీ కథ) & రసికుడు...(మినీ కథ)

                                                                             నాన్న                                                                                                                                                                      ( మినీ కథ ) నాన్న ఎప్పుడూ ఒంటరివాడే , అమ్మా , పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో . నాన్న ఎప్పుడూ కఠిన స్వభావం ఉన్నవాడే , అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది , పిల్లల దృష్టిలో . కని , పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది , నాన్నబాధ్యత  ఏమీ లేనట్టు అనిపిస్తుంది . కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది ? పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని , కొంతమంది పిల్లలకే బోధపడుతుంది . సేవచేయటం అమ్మవంతు , సరిచేయటం నాన్నతంతు . అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి , నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాతూ దోషాలుకూడా కనబడుతాయి . ప్రేమించటం అమ్మవంతు అయితే , దీవించటం నాన్నవంతు . ఆకలితీర్చటం అమ్మవంతు అయితే , ఆశలుతీర్చటం నాన్నవంతు . అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌ