నాన్న...(మినీ కథ) & రసికుడు...(మినీ కథ)

 

                                                                           నాన్న                                                                                                                                                                    (మినీ కథ)

నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు సృష్టిలో. నాన్న ఎప్పుడూ కఠిన స్వభావం ఉన్నవాడే , అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో. కని,పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది,నాన్నబాధ్యత  ఏమీ లేనట్టు అనిపిస్తుంది.

కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది? పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.

సేవచేయటం అమ్మవంతు,సరిచేయటం నాన్నతంతు.అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాతూ దోషాలుకూడా కనబడుతాయి.

ప్రేమించటం అమ్మవంతు అయితే,దీవించటం నాన్నవంతు.ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,ఆశలుతీర్చటం నాన్నవంతు.అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది, నాన్నదీవెన, ప్రేమ ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది........అలాంటి నాన్న గురించే కథ.

***********************************************************************************************

అమ్మా...పెద్దాయన ఎక్కడ...?”

రేయ్...ఏమిట్రా మర్యాద లేకుండా...నాన్న ఎక్కడ?’ అని అడగలేవా?
...ఆయన బ్యాంకుకు వెళ్ళారు....

...పెన్షన్ తీసుకోవటానికా? హూ...చదువుకున్న నాకు ఉద్యోగం దొరకలేదు...రిటైర్ అయిన తరువాత కూడా ఈయనకు డబ్బు దొరుకుతోంది...

డబ్బులేరా మన కుటుంబాన్ని మోస్తోంది... అదీ లేకపోతే అడుక్కుతినే వాళ్లం.  నీ చేతి ఖర్చుకు డబ్బులిచ్చి వెళ్ళారు...ఇదిగో...

హూ...రోజూ యాభై రూపాయలేనా...కొంచం కూడా ఎక్కువగా ఇవ్వరా?”

భార్గవ్ నువ్వు సంపాదించి ఆయనకు ఇవ్వాలిరా...కానీ వయసులో ఆయన దగ్గర నుండి నువ్వు ఇంకా ఎదురు చూస్తున్నావే...

"ఇది కన్నవారు పిల్లలకు ఉన్న అప్పమ్మా...నేనూ ఖాలీగానా ఉన్నాను...ఉద్యోగం వెతుక్కుంటూ తిరుగుతున్నా కదా...

మేమేమీ కాదనటం లేదే. నిన్ను అగౌరవంగా చూడటం లేదే. కానీ, నువ్వే పెద్దలు, కన్నవారు అన్న మర్యదే లేకుండా మాట్లాడుతున్నావు

తిరిగి ఏమీ మాట్లాడకుండా తల్లి అందించిన డబ్బును తీసుకుని అతను బయటకు వెళ్ళిపోయాడు.

తండ్రి ప్రేమ, అభిమానం ఉన్న ఆయనే. అయితే కాస్త స్ట్రిక్టుగా ఉంటారు. అందుకని ఆయనతో తిన్నగా మాట్లాడటం అవాయిడ్ చేస్తాడు భార్గవ్. ఆయన కూడా కొడుకుతో డైరెక్టుగా మాట్లాడకుండా తన భార్య ద్వారానే మాట్లాడతారు. 

దీపక్ ఇంటికి వెళ్ళాడు భార్గవ్. అతను భార్గవ్ కాలేజీ ఫ్రెండ్. అన్ని  సబ్జెక్టులలోనూ ఫస్ట్ మార్క్ తెచ్చుకునే అతను, భార్గవ్ కు పాఠాలలో వచ్చే అన్ని సందేహాలనూ తీర్చినతను. భార్గవ్ ను అన్ని విధాలుగా తయారు చేస్తూనే ఉంటాడు. కాలేజీ చదువు ముగిసిన వెంటనే దీపక్ కి ఉద్యోగం దొరికింది. భార్గవ్ కు కూడా ఒక మంచి ఉద్యోగం ఇప్పించాలని దీపక్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు.

దీపక్ ఇంట్లో ఉన్నాడా...?”

ఎవరు, భార్గవా...రా బాబూ. దీపక్ ఉన్నాడు. లోపలకు వచ్చి కూర్చో... -- నవ్వు మొహంతో భార్గవ్ ను స్వాగతించింది దీపక్ తల్లి.

ఈమె కూడా మన తల్లిలాగానే స్నేహంగా ఉన్నారు...! అని అనుకున్నాడు.

భార్గవ్, లోపల హాలులోకి వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు.

అప్పుడు పక్క గదిలో దీపక్ అతని తండ్రితో మాట్లాడుతున్నాడు. వారిద్దరి సంభాషణ భార్గవ్ క్లియర్ గా వినగలిగాడు.  

నాన్నా...బయలుదేరేరా...ఇదిగో ఇది ఉంచండి...

ఇంటి ఖర్చుల కోసం అమ్మ దగ్గర డబ్బులిచ్చావు కదా...నాకెందుకురా ప్రత్యేకంగా నెల నెలా డబ్బు...నేను పెన్షన్ తీసుకోబోతాను కదా...

అది తక్కువగానే కదా ఉంటుంది...ఇది కూడా ఉంచండి...ఈరోజు పెన్షన్ తీసుకునే చోట మీ స్నేహితులు వస్తారు కాదా...

అవునురా...మురళీ, నీలకంఠం, బాలగురు, స్వామినాధన్, వేదవల్లి అందరినీ అక్కడ రోజు చూడొచ్చు...

మరి...వాళ్ళను కలుసుకోవటమే కదా మీకు సంతోషం...వాళ్ళను హోటలుకు పిలుచుకు వెళ్ళండి... డబ్బుతో వాళ్లకు టీ-కాఫీ కొనివ్వండి. వాళ్ళల్లో ఎవరికైనా పుట్టిన రోజు వస్తే, పెళ్ళి రోజు వస్తే, అది సెలబ్రేట్ చేయండి...మీ వయసు వాళ్ళకు అదేకదా ఉత్సాహం, బలంగా ఉంటుంది...

సరేరా...వెళ్ళొస్తాను...

నాన్నా...ఒక్క నిమిషం...నన్ను ఆశీర్వాదం చేయండి...

బాగుండరా...ఇంకా చిన్న పిల్లాడిలాగా ఉన్నావు. లే... అన్నారు.

దీపక్ తండ్రి హాలులోకి వచ్చినప్పుడు, భార్గవ్ తన కుర్చీలో నుండి లేచాడు.

బాగున్నావా భార్గవ్...?” కొడుకుతో పాటూ పలకరించి బయటకు వెళ్ళారు.

దీపక్ వచ్చి భార్గవ్ ఎదురుగా కూర్చున్నాడు.

దీపక్...నీకు నాన్న అంటే చాలా ఇష్టమా...?”

మరి...తల్లి ప్రేమ, అభిమానం బట్టబయలుగా తెలుస్తుంది...నాన్న బయటకు కనబడుకుండా కరుగుతారు. మనం నిద్రపోయిన వెంటనే, మన తలమీద చెయ్యి వేసి నిమురుతారు...మనం విత్తనం అయితే, అయన వేరు. ఇంట్లో నాన్న ఉంటే దైవమే ఉన్నట్లు...

అతనితో కొంతసేపు మాట్లాడేసి భార్గవ్ సెలవు తీసుకున్నాడు.

అతనికీ తన నాన్నను చూడాలని అనిపించింది. అతని కాళ్ళు బ్యాంకు వైపుకు వెళ్ళినై.

************************************************సమాప్తం******************************************* 

                                                                                       రసికుడు                                                                                                                                                                (మినీ కథ)

నిజమైన అందం రంగులో కాదు మనసు లోతులో ఉంటుంది నిజం తెలిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.............దీన్ని వివరించే కథే  మినీ కథ 'రసికుడు'.

*************************************************************************************************

పెళ్ళి చూపులకు వెళ్ళొచ్చారుఅమ్మాయి చామనిఛాయ రంగుతో ఉన్నదికొడుకుకు నచ్చుంటుందాలేదాఅనే ఆందోళనలో పడింది తల్లిఏది ఏమైనా అబ్బాయి అభిప్రాయం తెలుసుకునే తీరాలి విషయాన్ని ఆలస్యం చేయకుండా అమ్మాయి వాళ్ళింటికి తెలపాలిహాలులో ఉన్న సోఫాలో కూర్చున్న తరువాత...

ఏరా అమ్మాయి నచ్చిందా?” తల్లి అడిగింది.

చాలా మిడిల్ క్లాస్ ఫ్యామలీవయసైన తల్లితండ్రిగోడలన్నిటికీ పూర్తిగా డిస్టెంపర్...! గోడలపైన ఒక గీతరాతలు లేవు కళ్యాణ్ రామ్ అనే కళ్యాణ్ మాట్లాడాడు.

రేయ్ అమ్మాయి ఎలా ఉంది అని అడిగాను?”

నేల మీద ఒక చెత్త కూడా లేదుమురికి లేదుకాఫీ గ్లాసు కొత్తదిలాగా మెరుస్తోందిప్లేటు కూడా అదేలాగా ఉందిదిండుదుప్పట్లు అన్నీ అందంగా మడతపెట్టబడి ఉన్నాయి

తరువాత...

తిరుగుతున్న ఫ్యానుపై కొంచం కూడా దుమ్ము లేదుక్యాలండర్ లో కరెక్టైన తారీఖు చింపుందిదేవుని ఫోటో అందంగా కళతో ముఖం చూపిస్తూ నవ్వగా...దైవీకం నాట్యమాడుతోంది ఎక్కడో చూసి మాట్లాడుతున్నాడు.

రేయ్ అమ్మాయి పాటపాడిందేనచ్చిందా...పాటాఅమ్మాయినూ?”

కిటికీ కర్టన్లు అన్నీ ఉతికి కొత్తగా ఉన్నాయికాళ్ళు తుడుచుకునే పట్టాలో కూడా మురికి లేకుండా ఉన్నది...

ఏమిట్రా చెబుతున్నావు?”

అమ్మా ఇంత అందంగా...రసజ్ఞతతో ఇంటిని అందంగాశుభ్రంగా పెట్టుకున్న అమ్మాయిమన కొత్త ఇంటినీనిన్నూనన్నూ బాగా చూసుకుంటుందీ అనే నమ్మకం ఉందిఅమ్మాయి యొక్క క్యారక్టర్ఆమె అభిరుచి నాకు చాలా బాగా నచ్చింది అన్నాడు కళ్యాణ్.

అరె...అమ్మాయిని చూడటానికి వెళితే నువ్వు ఎన్నో వివరాలు గమనించావునీ మనసు చాలా గొప్పదిరా అని పొగడిన తల్లి, “ముహూర్త తారీఖు ఫిక్స్ చేస్తాను... అన్నది సంతోషంగా 

 ****************************************************సమాప్తం****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)

ఏల్నాటి శని...(కథ)