పోస్ట్‌లు

సెప్టెంబర్ 14, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

సరి భాగం...(కథ)

                                                                            సరి భాగం                                                                                                                                                                         ( కథ ) ముగ్గురు కూతుర్లున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాజమౌలికి ముగ్గురు కుమార్తెలు . కష్టపడే సంసారాన్ని ఈదుకు వస్తున్నాడు . పెద్ద కూతుర్లిదరూ పెద్దగా చదువుకోలేదు . అంత కష్టంలోనూ   మూడవది , చివరిది అయిన కూతుర్ను డిగ్రీ చదివిస్తున్నాడు . ఉద్యోగం లో ఉన్నప్పుడు పెద్ద కూతురికీ , రిటైర్ అయిన తరువాత రెండో కూతురికీ కష్టలు పడి , అప్పు చేసే పెళ్ళిల్లు చేసేడు . వాళ్ళిద్దరికీ తాను చేయగలిగినంత వరకు మాత్రమే కట్నకానులు ఇచ్చి పెళ్ళి చేశాడు . అప్పులు తీరెంతవరకూ , మూడో కూతురు చదువు పూర్తి అయ్యేంతవరకు , రెండూ మరో రెండేళ్ళల్లో పూర్తి అయిపోతాయి కనుక ఆ తరువాత ఆమె పెళ్ళి గురించి ఆలొచించవచ్చు అనుకున్నాడు . ఇంతలో అనుకోకుండా మూడో కూతురుకి మంచి సంబంధం వచ్చింది . అయినా కానీ వరుడి దగ్గర , వరుడి కుటుం