పోస్ట్‌లు

జూన్ 7, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

పాలిట్రిక్...(కథ)

                                                                                    పాలిట్రిక్                                                                                                                                                                         (కథ) అది ఒక జాతీయ రాజకీయ పార్టికి చెందిన రాష్ట్ర కార్యాలయం . ఆ జాతీయ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు తలపై రెండు చేతులూ పెట్టుకుని తధేక ఆలొచనలో ఉన్నాడు . ఆయనకు ఎదురుకుండా ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర రాజకీయ నాయకులు కూర్చోనున్నారు . అందులో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడిని చూసి " ఏం నిర్ణయించుకున్నారు ?" అని అడిగేడు . రెండో అతను " లక్ష్మీపురం నియోజక వర్గంలో ఎవర్ని నిలబెట్టబోతున్నారు ?" అని అడిగేడు . అధ్యక్షుడు చిరాకుపడుతూ " ఆపండయ్యా మీ ప్రశ్నలు . ఎవర్ని నిలబెట్టాలో తెలియక నేనే కన్ ఫ్యూజన్లో ఉన్నాను . మీ ప్రశ్నలతో మీరు నన్ను ఇంకా కన్ ఫ్యూజ్ చేస్తున్నారు " అని చెప్పి తన టేబుల్ మీదున్న నీళ్ల గ్లాసు అందుకుని గడగడా గ్లాసుడు నీళ్లూ తాగ