పోస్ట్‌లు

ఏప్రిల్ 12, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నిజమైన మగాడు…(కథ)

                                                                      నిజమైన  మగాడు                                                                      ( కథ ) చెంప చెళ్ళుమన్న శబ్ధం వినబడింది . పార్కులో బెంచి మీద కూర్చుని తన ప్రేమికుడు మహేష్ తో సరదాగా మాట్లాడుకుంటున్న రమ ఆ శబ్ధానికి ఉలిక్కిపడి , కూర్చున్న బెంచి నుండి పైకి లేచి శబ్ధం వచ్చిన వైపు చూసింది . అక్కడ చెట్టు క్రింద తన స్నేహితురాలు మాలతి , ఆమె ప్రేమికుడు రాజు నిలబడున్నారు . మాలతి తన చెంపను పట్టుకుని , తల దించుకుని నిలబడున్నది . ఆమె కంటి నుండి ధారగా నీరు కారడం , ఆమె ప్రేమికుడు రాజు వేగంగాఅక్కడి నుండి వెళ్ళిపోవటం గమనించిన రమ కోపంగా అడుగు ముందుకు వేసింది . " ఎక్కడికి " అమె చేయి పుచ్చుకుని ఆపిన మహేష్ రమను అడిగాడు . " ఎక్కడికని అడుగాతావేమిటి మహేష్ ! ?... నా స్నేహితురాలు మాలతిని ఆమె ప్రేమికుడు రాజు కొట్టి వెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా ?... ఎందుకు కొట్టేవు అని రాజును నిలదీయ వద్దా ?... వదులు , నా చేయి వదులు మహేష్ . రాజు తల దించుకునేలా నాలుగు