పోస్ట్‌లు

ఫిబ్రవరి 19, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

వనిత...(కథ)

                                                                               వనిత                                                                                                                                                            (కథ)   దొరికిన విరామంలో తల్లికి ఫోన్ చేసి ఆ సంతోషకరమైన వివరం చెప్పింది పూర్ణిమా. “ అంతా సేరేనే...అల్లుడు నిన్ను పంపుతారా అనేది చూసుకో. ఎందుకంటే , నువ్వు ఉద్యోగానికి వెళ్ళకూడదని ఆయన ఖచ్చితంగా ఉన్నారు. రేడియోలో న్యూస్ రీడర్ ఉద్యోగం ఆయన ఒప్పుకుంటారా ? నా కెందుకో ఆయన వద్దని చెబుతారనే అనిపిస్తోంది”   “ ఏంటమ్మా ఇలా చెబుతున్నావు...ఇది ఎవరికీ దొరకని అవకాశం. నా ప్రయత్నానికీ , నైపుణ్యానికీ దొరికిన అంగీకారం” “ అదంతా నువ్వు నాకు కూతురుగా ఉన్నంత వరకే. ఇప్పుడు నువ్వు భార్గవ్ భార్యవు. ఆయనకు ఏది ఇష్టమో అదే నీ ఇష్టం అవాలి”   “ అయితే నాకని ఏ ఇష్టమూ , కోరిక , ఆశ ఉండకూడదా ? నీకే తెలుసు. వార్తలు చెప్పే వ్యక్తిగా అవ్వాలనేదే నా చాలా రోజుల ఆశ , కల. ఇప్పుడు నువ్వే ఇలా చెబుతున్నావేమ్మా” “ ఒక మగాడి అంగీకారం లేకుండా , ఏ ఆడదీ తన , తెలివితేటలను బయట పెట్టలేదమ్మా. అర్ధం చే