పోస్ట్‌లు

ఫిబ్రవరి 27, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏల్నాటి శని...(కథ)

                                                                          ఏల్నాటి శని                                                                                                                                                       (కథ) అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఎంతో కష్టపడాలి. మనం విజయాలు సాధిస్తున్నప్పుడు జీవితం ఎంతో సంతోషదాయకంగా అనిపిస్తుంది. గెలిచిన వారి వెంట ఎంతోమంది వెళతారు అదే పరాజయాల బాటలో నడుస్తున్నప్పుడు వెనక వచ్చేవారు ఎవరూ ఎక్కువగా ఉండరు. అలాంటప్పుడు మనుషులు నిరాశకు లోనవుతారు. అలాంటప్పుడు జీవితం విషాదమయంగా బాధల సుడిలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ మనం చేసే పని అద్భుతంగా చేసి తీరాలి. మనం కష్టాలలో ఉన్నాం కదా అని చేసే పనిలో నిర్లక్ష్యం చూపకూడదు. దీనికి మానసిక ధైర్యం కావాలి. ప్రపంచంలో మనం ఏం కోల్పోయినా ఫర్వాలేదు. కానీ మానసిక ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. మానసిక ధైర్యమే మనకు దీర్ఘకాలిక విజయాలను చేకూర్చి పెడుతుంది. మానసిక ధైర్యం అంటే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎంతో తెలివిగా అర్థం చేసుకోవడం , సమస్య ఏమిటో గుర్తించడం , సమస్య అర్థమయ్యాక దానికి పరిష్కారాన్ని వెతక