పోస్ట్‌లు

సెప్టెంబర్ 1, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

పరిగెత్తు...దాక్కో!...(కథ)

                                                                                పరిగెత్తు...దాక్కో!                                                                                                                                                                  (కథ) ఈ సమాజంలో డబ్బో , పదవో ఉంటే...అంతస్తో , రాజకీయమో పక్క బలంగా ఉంటే...నేరాలు చెయచ్చు , శిక్షల నుండి ఎలాగూ తప్పించుకోవచ్చు అని అనుకేనే వాళ్ళు పెరిగిపోయారు. రాసుంచిన చట్టాలన్నీ వాళ్లకోసం తలవంచుతాయి. తమకు తలవంచని వాళ్ళను డబ్బుపెట్టి కొనుక్కోవటానికి ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం ఓడిపోతే తలవంచని వాళ్ళు కనబడకుండా పోతారు. ఇది అన్యాయం అనుకున్న కాలంపోయి , ఇదే యదార్ధం అని ఒప్పుకునే మనో పరిస్థితికి తోయబడ్డాం. డబ్బూ , పలుకుబడి ఉన్నవాళ్ళు చట్టానికి ఎదురుగా నడుచు కుంటే , వాళ్ళను  ఎదిరించి సామాన్యుడు పోరాడగలడా ? ********************************* ********************************* ********************************* ఆ పోలీసు జీపు వేగంగా ఆ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోకి దూరి , తిన్నగా వాకిలి ముందు ఆగింది. జీపులో నుండి ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి దిగారు.