పోస్ట్‌లు

జూన్ 25, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

పెంపకం…(కథ)

                                                                         పెంపకం                                                                                                                                                       ( కథ)   పుట్టింటికి వచ్చి రెండు రోజులయ్యింది . తల్లి తనతో సరిగ్గా మాట్లాడ్డం లేదు . మొహం చాటేస్తోంది . తాను ఏదైనా మాట్లాడితే ముఖం పక్కకు తిప్పుకుని ఒక ముక్కతో సమాధానం చెబుతోంది . ఎప్పుడూ తన మీద అపరితమైన ప్రేమను చూపే తల్లి ఆ విధంగా ఉండటం జానకి కి బాధ కలిగించింది . ఉండబట్టలేక అడిగేసింది . " ఏంటమ్మా ? ఏమైందని నువ్విప్పుడు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు ? నేనేం తప్పు చేశేనని నువ్వు నాకు అంత దూరంగా ఉంటున్నావు " తల్లిని నిలదీసింది జానకి . " ఏం తప్పు చేశేనని అడుగుతున్నావా ... నీకు తెలియదు నువ్వేం తప్పు చేశేవో " … కస్సు మన్నది జానకి తల్లి అనసూయ . " చెబితేనేగా తెలిసేది " తాను కూడా కస్సుమని అరిచింది జానకి . " నువ్వు నీ అత్తగారిని కష్టపెడుతున్నది నాకు కొంచం కూడా నచ