పోస్ట్‌లు

జూన్ 28, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

రాత్రి 9.45…(కథ)..(కాలక్షేపం కోసం)

                                                                                రాత్రి 9.45                                                                                                                                                            (కథ-కాలక్షేపం కో సం) గదిలో -- అతి భయంకరమైన నిశ్శబ్ధం ! చేతిలో ఉన్న ఆ చిన్న పెట్టెను , పసిపిల్లను కింద పడుకోబెట్టినంత మెల్లగా , జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టాడు అతను . “ బాస్ ... మీరడిగిన బహుమతి ” తన ఎదురుగా పెట్టబడిన అందమైన పెట్టెను , దాన్ని టేబుల్ మీద పెట్టిన అతన్ని నెమ్మదిగా చూశాడు , ' బాస్ ’ అని పిలువబడ్డ అతను . “ రేయ్ ... ఇప్పుడు టైము సాయంత్రం ఐదు - పది . సరిగ్గా రాత్రి తొమ్మిది ముప్పావుకు ఈ బాంబు పేలాలి . ఆ గోవర్ధన్ పెళ్ళి ఫంక్షన్ కు మన బహుమతి ఇదే ” గోవర్ధన్ . బ్రతకటం చేతకాని కార్మీక సంఘం నాయకుడు . న్యాయమైన పోరాటాల వలన ఎంతోమంది విరోధులను వెతుకున్నతను . ఈ రోజు అతనికి షష్టిపూర్తి పుట్టినరోజు సంబరం ! సింపుల్ గా తన ఇంటి దగ్గర హడావిడి లేకుండా శ్రేయోభిలాషుల బలవం