పోస్ట్‌లు

జులై 5, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

వాగుడుకాయ...(కథ)

                                                                                వాగుడుకాయ                                                                                                                                                                     (కథ) ప్రయాణీకుల చూపంతా అతనిపైనే పడింది . బస్సు బయలుదేరుతున్నట్టు చూపించటానికి బస్సు డ్రైవర్ బస్సును ఒక్కసారిగా కుదిపి , వేగంగా బస్సును బస్ స్టేషన్ బయటకు తీసుకు వచ్చి రోడ్డు పక్కన ఆపాడు . దానికే అరగంట పట్టింది . అది కూడా ఆ బస్సు వెనుక అదే రూటులో వెళ్ళే మరో బస్సు హారన్ మోత ఈ బస్సు డ్రైవర్ను కదలమని చెప్పటంతో . బస్సులో సీట్లను నింపటానికి ఇదొక ఎత్తు . చివరి క్షణాన్న వేగంగా పరిగెత్తుకు వచ్చి ఎక్కి కూర్చున్న అతనే చక్రధర్ . వచ్చి కూర్చున్న దగ్గర నుండి ఒకటే వాగుడు . అందుకే ప్రయాణీకుల చూపంతా అతనిపైనే పడింది . " రైలు ప్రయాణం కంటే బస్సు ప్రయాణమే నాకు చాలా నచ్చుతుంది . దీనికి కారణాలన్నీ అడగకండి . కొన్ని కోరికలకు కారణం ఉండదు ... కానీ నచ్చుతుంది " " నేను మిమ