ఆశ...(మినీ కథ)
ఆశ ( మినీ కథ ) మానవుడు పుట్టుకతో ఆశాజీవి . ఈ ప్రపంచంలో అనేక మంది భౌతికమైన ఆశాపాశాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు . ఈ కథలోని ఒక వ్యక్తి దేనికోసం ఆశపడ్డాడో తెలుసుకుంటే మీరు నవ్వు ఆపుకోలేరు . ************************************************************************************************** ఆఫీసులోపలకు వచ్చిన రాఘవ శర్మ గారు చుట్టూతా చూశారు . అన్ని కుర్చీలూ ఖాలీగానే ఉన్నాయి . ‘ ఎక్కువ కుతూహలంతో తొందరగా వచ్చాశమా ?’ -- చేతి మనికట్టును తిప్పి టైము చూశారు . ఉదయం 9.50 అయ్యింది . ఇంతలో జెర్మియా సుల్తానా లోపలకు వచ్చింది . “ గుడ్ మార్నింగ్ సార్ ! ” “ వెరి గుడ్ మార్నింగ్ జెర్మియా ! ” అని ప్రతి విష్ చేశారు . ఆమె తన సీటులో కూర్చుని పనిలో మునిగిపోయింది . రాఘవ శర్మ గారు ఆరాటంతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు . ‘ ఎన