చదివింపు...(కథ)
చదివింపు ( కథ) చదివింపు ఇవ్వలేకపోతే పెళ్ళిళ్ళకూ , ఫంక్షన్లకూ వెళ్ళకూడదా ? కానీ , ఒకరు చదివింపు ఇచ్చుకోలేరు అని తెలిసినా వాళ్ళను కూడా పెళ్ళిళ్ళకూ , ఫంక్షన్లకూ పిలుస్తూ ఉంటారే . ఎందుకు ? పిలిస్తే అప్పుచేసైనా చదివింపులు చేస్తారు అనే భావంతోనా ? లేదు వాళ్లను పిలిచి అవమానించటానికా ?.... కాదు , ఇంకేదో ఉద్దేశం ఉంటుంది ? ఏమిటా ఉద్దేశం ?... ఈ కథను చదివితే మీకే చాలావరకు అర్ధమవుతుంది . *********************************** *********************************** ****************************** అఫీసులోని స్నేహితులందరికీ పెళ్ళి పత్రిక ఇచ్చి ఆహ్వానించిన సురేందర్ కళ్ళు ఆఫీసు ప్యూన్ ఆంజినేయులు ని వెతుకుతున్నాయి . " మీకు తెలియదా ?... అతను ఆఫీసు స్నెహితుల ఇంటి ఫంక్షన్లకు , పెళ్ళిల్లకూ రాడు . ఎందుకు అనవసరంగా ఒక పత్రికను ' వేస్టు చేయాలి