పోస్ట్‌లు

ఏప్రిల్ 14, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మిస్టర్ దోమ.. (కథ)

                                                                         మిస్టర్ దోమ                                                                                                                                                      ( కథ ) " ఈ మానవ జాతికి మనల్ని చూస్తేనే చిరాకు పుట్టుకు వస్తుంది . మన కష్టం వాళ్లకు ఎందుకు తెలుస్తుంది ? ఒక బొట్టు రక్తం తీసుకోవడానికి ఎన్ని దెబ్బలు తినాల్సివస్తోంది " అనుకుంటూ వీధి చివర పారుతున్న మురికి నీటి గుంటపై కూర్చుని ఆలొచిస్తున్నది మిస్టర్ దోమ . " కాపురం ఉంటున్న చోటును మార్చాలంటే మామూలు పనా ... అందులోనూ మంచి మురికి గుంట లేక మురికి కాలువో దొరకటం సాధారణ విషయమా ? మన కష్టాలు ఈ ఆడ దోమలకు ఎక్కడ అర్ధమవుతోంది ? ‘…. వెళ్ళి మంచి మురికి కాలువ వెతికి రా !’  అని గదమాయించడం తప్ప . వెతికే మనకి మాత్రమే తెలుసు వెతకటం ఎంత కష్టమైన పనో " అని మనసులోనే బాధపడింది మిస్టర్ దోమ . మిస్టర్ దోమ బాధపడటానికి పెద్ద కారణమే ఉంది . ఈ మధ్యే అష్టకష్టాలు పడి ఇప్పుడు కాపురం ఉంటున్న మురికి గ