మిస్టర్ దోమ.. (కథ)
మిస్టర్
దోమ (కథ)
"ఈ మానవ జాతికి మనల్ని చూస్తేనే చిరాకు పుట్టుకు వస్తుంది. మన కష్టం వాళ్లకు ఎందుకు తెలుస్తుంది? ఒక బొట్టు రక్తం తీసుకోవడానికి ఎన్ని దెబ్బలు తినాల్సివస్తోంది" అనుకుంటూ వీధి చివర పారుతున్న మురికి నీటి గుంటపై కూర్చుని ఆలొచిస్తున్నది మిస్టర్ దోమ.
"కాపురం ఉంటున్న చోటును మార్చాలంటే మామూలు పనా...అందులోనూ మంచి మురికి గుంట లేక మురికి కాలువో దొరకటం సాధారణ విషయమా? మన కష్టాలు ఈ ఆడ దోమలకు ఎక్కడ అర్ధమవుతోంది? ‘….వెళ్ళి మంచి మురికి కాలువ వెతికి రా!’ అని గదమాయించడం తప్ప. వెతికే మనకి మాత్రమే తెలుసు వెతకటం ఎంత కష్టమైన పనో" అని మనసులోనే బాధపడింది మిస్టర్ దోమ.
మిస్టర్ దోమ బాధపడటానికి పెద్ద కారణమే ఉంది. ఈ మధ్యే అష్టకష్టాలు పడి ఇప్పుడు కాపురం ఉంటున్న మురికి గుంటను వెతికి పట్టుకుంది. ఇప్పుడు ఆ మురికి గుంటను కూడా ఖాలీ చేసి పోవాలి. ఎందుకంటే ఆ ఏరియా క్పౌన్సిలర్ ఆ ప్రాంతానికి రేపోమాపో రాబోతున్నాడని ఆ ప్రాంతంలోని మురికి గుంటలను మట్టిపోసి మూసేసి బ్లీచింగ్ పౌడర్ జల్లి పరిశుభ్రం చేస్తున్నారు. మురికి కాలువల మీద లిక్విడ్ మందు జిమ్మి వెడుతున్నారు. ఈ రోజో, రేపో మిస్టర్ దోమ కాపురముంటున్న మురికి గుంటను కూడా మూసేశ్తారు. అందుకని మిస్టర్ దోమ భార్య కొత్త చోటు చూడమని ఆర్డర్ వేసింది.
భార్య దోమ
వేసిన ఆర్డర్ ను అమలుపరచటానికి వెళ్ళిన ఆ మిస్టర్.దోమ పడిన కష్టాలు, అందువల్ల
కనుక్కోగలిగిన ఒక విష పరీక్ష ఏమిటో?...తెలుసుకోవటానికి ఈ హాస్యభరిత కథ చదవండి.
*****************************************************************************************************
"ఈ మానవ జాతికి మనల్ని చూస్తేనే చిరాకు పుట్టుకు వస్తుంది. మన కష్టం వాళ్లకు ఎందుకు తెలుస్తుంది? ఒక బొట్టు రక్తం తీసుకోవడానికి ఎన్ని దెబ్బలు తినాల్సివస్తోంది" అనుకుంటూ వీధి చివర పారుతున్న మురికి నీటి గుంటపై కూర్చుని ఆలొచిస్తున్నది మిస్టర్ దోమ.
"కాపురం ఉంటున్న చోటును మార్చాలంటే మామూలు పనా...అందులోనూ మంచి మురికి గుంట లేక మురికి కాలువో దొరకటం సాధారణ విషయమా? మన కష్టాలు ఈ ఆడ దోమలకు ఎక్కడ అర్ధమవుతోంది? ‘….వెళ్ళి మంచి మురికి కాలువ వెతికి రా!’ అని
గదమాయించడం తప్ప. వెతికే మనకి మాత్రమే తెలుసు వెతకటం ఎంత కష్టమైన పనో" అని మనసులోనే బాధపడింది మిస్టర్ దోమ.
మిస్టర్
దోమ బాధపడటానికి పెద్ద కారణమే ఉంది. ఈ మధ్యే అష్టకష్టాలు పడి ఇప్పుడు కాపురం ఉంటున్న మురికి గుంటను వెతికి పట్టుకుంది. ఇప్పుడు ఆ మురికి గుంటను కూడా ఖాలీ చేసి పోవాలి. ఎందుకంటే ఆ ఏరియా క్పౌన్సిలర్ ఆ ప్రాంతానికి రేపోమాపో రాబోతున్నాడని ఆ
ప్రాంతంలోని మురికి గుంటలను మట్టిపోసి మూసేసి బ్లీచింగ్ పౌడర్ జల్లి పరిశుభ్రం చేస్తున్నారు. మురికి కాలువల మీద లిక్విడ్ మందు జిమ్మి వెడుతున్నారు. ఈ రోజో, రేపో మిస్టర్ దోమ కాపురముంటున్న మురికి గుంటను కూడా మూసేశ్తారు. అందుకని మిస్టర్ దోమ భార్య కొత్త చోటు చూడమని ఆర్డర్ వేసింది.
అందుకని
కొత్త చోటు చూడటానికి ఉదయమే బయలుదేరింది మిస్టర్ దోమ. మండిపోతున్న
ఎండను కూడా లెక్కచేయకుండా ఆ చుట్టు పక్కలున్న ప్రాంతాలన్నీ తిరిగింది. కానీ
మంచి చోటు ఒకటి కూడా దొరకలేదు. ఎండలో తిరుగుతున్న మిస్టర్ దోమకు అలసట అనిపించడంతో కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపించింది.
ఒక అపార్ట్ మెంట్ లోకి దూరింది.
హాలులోకి
చొరబడింది.
హాలులో
టీ.వీ ఆన్ చేసుంది. టీవీ ఎదురుకుండా ఉన్న సోఫాలో, ఫ్యాను క్రింద ఒక మొగ పిల్లాడు కూర్చుని టీవీ చూస్తున్నాడు. కాసేపు ఫ్యాను క్రింద కూర్చోవాలని ఆశ పుట్టడంతో ఆ పిల్లడి పక్కన కూర్చుందామని మిస్టర్ దోమ వాడి పక్కకు వెళ్ళి కూర్చుంది.
పిల్లాడు
కాసేపు ప్రశాంతంగా ఉన్నాడు. అనుకోకుండా పక్కకు తిరిగి చూశాడు. తన పక్కన కూర్చున్న దోమను చూశాడు. అంతే "నాన్నా...నాన్నా" అని అరుచుకుంటూ సోఫాలో నుండి దిగి పరిగెత్తడం మొదలు పెట్టాడు.
ఆ
పిల్లాడు అలా ఎందుకు పరిగెత్తేడో మిస్టర్ దోమకు అర్ధం కాలేదు. "నా కంటే వాడే కదా పెద్దగా, బండగా ఉన్నాడు! నన్ను చూసిన వెంటనే ఎందుకు అరుచుకుంటూ పరిగెత్తుకు వెడుతున్నాడు" అనుకుంటూ వింతగా చూసింది. "ఒక వేల ఇంకెవరైనా వచ్చారేమో?" అని చుట్టూ చూసుకుంది. అక్కడ తనూ, ఆ పిల్లాడూ తప్ప ఇంకెవరూ లేరు. "నన్ను చూసే పరిగెత్తేడు!...ఎందుకో?" అనుకుంటూ పెద్దగా ఊపిరి పీల్చుకుంది.
అరుచుకుంటూ
పరిగెత్తిన పిల్లాడు, తన తండ్రితో తిరిగొచ్చాడు. తండ్రి తన చేతిలో ఒక టెన్నీస్ బ్యాట్ లాంటిది పుచ్చుకోనున్నాడు.
మిస్టర్ దోమ కూర్చున్న సోఫాను పిల్లాడు తండ్రికి చూపించాడు. చేతిలో ఉన్న బ్యాటుతో మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ సోఫా దగ్గరకు వచ్చాడు తండ్రి. అది చూసిన మిస్టర్ దోమకు కోపం వచ్చింది. "ఏరా...నువ్వు నాకంటే ఎంతో పెద్దగా ఉన్నావు! నీ బలాన్ని ఇంకో మనిషి దగ్గర చూపించ వచ్చు కదా? అది వదిలేసి...పెద్ద పహిల్వాన్ లాగా నన్ను కొట్టడానికి వచ్చావు...పిచ్చోడా" అని అనుకుంటూ అక్కడి నుండి ఎగురుకుంటూ ఎదురుగా ఉన్న కిటికీ కర్టన్ పైన కూర్చుంది మిస్టర్ దోమ.
దొమ
ఎటు పోయిందో తెలుసుకోలేక అటూ ఇటూ చూశాడు పిల్లాడి తండ్రి. పిల్లాడు మాత్రం దోమ ఎటు వెళ్ళిందో బాగా గమనించాడు. "నాన్నా... అక్కడుంది" అంటూ కర్టన్ వైపు చేయి చూపించాడు.
పిల్లాడు
అలా చేయి చూపటంతో కోపగించుకున్న మిస్టర్ దోమ "ఈ చిన్న పిల్లవాడిని ఒక చూపు చూడాలి...నా పిల్లాడిలాగా మెతకగా కాకుండా బాగా తెలివిగా ఉన్నాడు. ఈ పిల్లాడి ఒంట్లో నుండి రక్తం తీసుకు వెళ్ళి నాపిల్లాడికి ఇవ్వాలి. అప్పుడైనా వాడికి కొంచం తెలివితేటలు వస్తాయేమో చూడాలి" అనుకుంటూ ఆ పిల్లాడిని ఎలా కుట్టాలో, ఎలా రక్తం
తీయాలో అనే ఆలొచనలో పడింది.
మిస్టర్ దోమ అలా
ఆలొచిస్తున్నప్పుడే పిల్లాడి తండ్రి వేగంగా బ్యాటును ఒక చుట్టు చుట్టి కర్టన్ మీద
పెట్టాడు. కానీ అతను చేయి ఎత్తినప్పుడే అక్కడ్నుంచి వేగంగా ఎగిరి వెళ్ళి తలుపు పై
కూర్చున్న మిస్టర్ దోమ "అరె...ఇదేం కర్మరా బాబూ?
అందరిళ్ళలోనూ ఈ బ్యాటు ఒకటి పట్టుకుని ప్రాక్టీస్
చేస్తున్నారు. ఇలా గనక ప్రాక్టీస్ చేస్తే వింబుల్ డన్ టెన్నీస్ పోటీలకు వెళ్ళినా వెళ్ళొచ్చు
" అని అనుకున్నది మిస్టర్ దోమ.
దొమ దొరకక పోవడంతో
కోపం తెచ్చుకున్న ఆ పిల్లాడి తండ్రి కర్టన్ పట్టుకుని ఊపి,
లాగి, అటూ ఇటూ తోసి అలసిపోయాడు. అలసట తీర్చుకోవటానికి సోఫాలో
కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన అతని భార్య కోపంగా
"ఏమండీ...నేను చెప్పిన పని చేయకుండా మీరేంటి హాయిగా కూర్చున్నారు...వెళ్ళి ఆ
పని ముగించుకు రండి" అని భర్తను తరిమింది.
ఆ సంఘటనను చూసిన మిస్టర్ దోమ "నా భార్య మాత్రమే నా
మీద పెత్తనం చేస్తోంది అనుకున్నానే. కానీ
మనిషి జన్మ ఎత్తిన ఆడవాళ్ళు కూడా భర్తల పైన పెత్తనం చలాయిస్తారన్నమాట!" అనుకుని
ఆశ్చర్యపోయింది.
"చూడమ్మా...నన్ను
వెతికి వెతికి అలసిపోయి పాపం ఇప్పుడే మీ ఆయన విశ్రాంతి కోసం కూర్చున్నాడు. ఎందుకు అలా కూర్చున్నాడో తెలుసుకోకుండా అలా
తరుముతావేమిటి...వెళ్ళి ఆయనకు కాస్త కాఫీ చుక్క పట్టుకురావమ్మా"
అనుకుంటూ తలుపు పై నుండి బయలుదేరి
అక్కడున్న టెబుల్ మీదకు వెళ్ళి కూర్చుంది మిస్టర్ దోమ.
అప్పుడు ఆ పిల్లాడు
"నాన్నా...దోమ అక్కడుంది చూడు" టేబుల్ వైపు చేయి చూపిస్తూ అరిచాడు. ఆ
పిల్లాడి అరుపులు చెవులను తాకిన వెంటనే మళ్ళీ బ్యాటు తీసుకుని మెళ్ళగా టెబుల్
దగ్గరకు వచ్చాడు పిల్లాడి తండ్రి.
పిల్లాడి తండ్రి
టెబుల్ దగ్గరకు రావటం గమనించిన మిస్టర్ దోమ పిల్లాడి వైపు కోపంగా చూస్తూ "నీ
కెందుకురా నా మీద అంత కోపం? పగ?...నిన్ను కుట్టి ఏడిపించను కూడా చెయ్య లేదే?
అయినా కానీ నా కధను ముగించ కుండా
విడిచిపెట్టవనుకుంటా..." అనుకుంటూ అక్కడ్నుంచి ఎగురుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది.
దోమ అలా
ఎగిరిపోవటంతో టెన్ షన్ తెచ్చుకున్న భర్తను చూసి "ఇప్పుడెందుకంత ఫీలైపోయి
ఆరొగ్యం పాడుచేసుకుంటారు...దోమ మ్యాట్ ఆన్ చేస్తే, అదే
మన ఇల్లు వదిలి పారిపోతుంది కదా?" చెప్పింది భార్య .
వంటింట్లోకి దూరిన
మిస్టర్ దోమ అక్కడున్న ఒక గిన్నె మూతపై కూర్చుంది. వేగంగా ఎగురు కుంటూ వచ్చిందేమో
కొంచంగా ఆయాసపడింది. "అప్పుడే నాకు వయసైపోయిందా! ఒక గది నుండి ఇంకో గదికి
ఎగురుకుంటూ వస్తేనే రొప్పు వస్తోంది " అనుకుంది.
హాలులో భార్యా భర్త
లిద్దరూ దోమల మ్యాట్ ఆన్ చేయడమా...లేక దోమల కాయల్ వెలిగించడమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సంభాషణ విన్న
మిస్టర్ దోమ "ఇలాంటి దోమల కాయల్స్, మ్యాట్లు,
లిక్విడ్లు, బ్యాట్లూ
అన్నింటినీ చూశేశాము! వాటిని ఎలా
ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు...ఇదొక ట్రిక్కా" అనుకుంటూ తనలో తానే
నవ్వుకుంది.
సడన్ గా మిస్టర్
దోమకు గుండె పట్టేసినట్లు అనిపించింది. దగ్గు వచ్చింది. శ్వాశ పీల్చుకోవటమే
కష్టమనిపించింది. ఎక్కడి నుండో ఒక చెడు వాసన వచ్చింది.
"దోమల మ్యాట్
మాత్రమే కదా వెలిగిస్తామన్నారు? అది వెలిగించినా మనకు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ కలగలేదే?....కానీ, ఇలాంటి చెడు వాసనను నేను ఇంతవరకు అనుభవించిందే లేదే"
అనుకుంటండగానే మిస్టర్ దోమకు కళ్ళు తిరగటం,
వొళ్ళు తూలడం లాంటివి ఏర్పడింది. "నేను ఆరొగ్యంగానే
ఉన్నాను కదా!...ఈ కళ్ళు తిరగటం, వొళ్ళు తిప్పటం ఖచ్చితంగా ఆ చెడు వాసన వలనే" అని అనుకుంటూ
తన చుట్టు కలియచూసింది.
అప్పుడు వంట గదిలోకి
వచ్చిన పిల్లాడి తల్లి "ఏమండి...మీకొసం కొత్త వంటకం చేశాను. తిని చూసి టేస్ట్
ఎలా ఉన్నదో చెప్పండి" అని చెబుతూ తాను వండిన కొత్త వంటకం పై ఉంచిన మూతను
తీసింది.
వెంటనే
సుడిగుండంలాగా, గాలి ధుమారం లాగా ఒక్కసారిగా గుప్పున ఒక చెడువాసన గదిలో చెలరేగింది. ఆ వాసనకు
మిస్టర్ దోమ శరీరంలో మిగిలిన ఉన్న కొంచం శక్తి కూడా నసించటంతో కిచన్ గచ్చు మీద
వాలిపోయింది మిస్టర్ దోమ.
ఆమెకు కూడా కళ్ళు
తిరుగుతున్నట్లు, ఏదో చెడు వాసన వస్తున్నట్లు అనిపించింది. ముక్కు మూసుకుని
వంట గదిని ఒకసారి పరిశీలించింది. కానీ ఆ
చెడువాసన ఎక్కడి నుంచి వస్తోందో గ్రహించలేకపోయింది.
తల్లి వెనుకే వంట
గదిలోకి వచ్చిన పిల్లాడికి కూడా తల తిరుగుతున్నట్లయ్యింది. తమాయించుకుని,
ముక్కు మూసుకోవటంతో మామూలు పరిస్థితికి వచ్చాడు.
"అమ్మా...నువ్వు
చేసిన ఆ కొత్త రకం వంటకం నుండే ఆ చెడు
వాసన వస్తోంది. ఆ వాసన పీల్చడం వలనే తల తిరగటం,
కళ్ళు తిరగటం జరుగుతోంది...వెంటనే ముందు గదిలోకి వెల్దాం.
త్వరగా రా" అన్నాడు.
"అవునా...?"
అంటూ పిల్లాడితో కలిసి వంట గదిలో నుండి హాలులోకి పరుగులాంటి
నడకతో వచ్చి సోఫాలో కూర్చుంది.
తల్లి పక్కనే
కూర్చున్న పిల్లాడు "నువ్వు చేసిన ఆ కొత్త వంటకం నుండి వస్తున్న ఆ చెడువాసన
వలన మనకే కళ్ళు తిరిగినై అంటే...ఆ చెడు వాసన వలన ఇంట్లో ఉన్న దోమలన్నీ
చచ్చిపోతాయి...కానీ ఈ వంటకాన్ని ఎవరూ లేనప్పుడు వండేసి,
ఇంట్లో ఉంచేసి వచ్చేయాలి. లేకపోతే ఆ చెడు వాసనకు మనం కూడా
చచ్చిపోతాం" అన్నాడు.
"నిజమా!...అయితే
మనం ఈ కొత్త వంటకాన్ని దోమల మందుగా ఉపయోగిద్దామండి" భర్తతో గర్వంగా
చెప్పింది.
అప్పుడే సృహలోకి
వచ్చిన మిస్టర్ దోమ వాళ్ళ సంభాషణను విన్నది. "అమ్మో...ఈ చెడు వాసనలో ఇంకాసేపు
ఉంటే చచ్చిపోతాం. వెంటనే వెళ్ళిపోవాలి" అనుకుంటూ కష్టపడి ఓపిక తెచ్చుకుని
ఎగురుకుంటూ వంట గది కిటికీలో నుండి బయటకు వచ్చి, అపార్ట్
మెంట్ డ్రైనేజ్ పంపుపై కూర్చుని స్వచ్చమైన గాలి పీల్చుకుంది.
“అమ్మయ్య...వెంట్రుక
వాసిలో చావు తప్పించుకున్నాను...కానీ ఆ పిల్లాడికీ, వాడి
నాన్నకు ఈ జన్మంతా నరకమే. మంచికాలం, మనకి వంటలూ గట్రా అని ఏమీ లేదు. ఉండుంటే నా భార్య వంట చేసే
నన్ను పరలోకానికి పంపించి ఉండేది" అని అనుకుంటూ తన దోమ జన్మను తలచుకుంటూ
"నేను దోమగా పుట్టినందుకు ఈ రోజు చాలా గర్వపడుతున్నాను. “నాకు మనిషి
జన్మ ఇవ్వకండా, ఆ పిల్లాడి తల్లి లాంటి మానవుల దగ్గర నుండి కాపాడావు.
భగవంతుడా...నీకు శతకోటి వందనాలు" అని దేవునికి తన కృతజ్ఞతలు తెలుపు కుంది.
“ఈ కోత్త వంటకం, ఆ వంటంకం నుండి వెలువడే చెడు వాసన గురించి వెంటనే మన రీసెర్చ్ దోమలతో చెప్పాలి. ఆ కొత్త వంటకం నుండి వచ్చే చెడు వాసన నుండి ఎలా తప్పించుకోవాలో పధకం రూపొందించి అన్ని దోమలకు తెలియజేస్తారు" అన్న ఆలొచన తట్టడంతో అక్కడ్నుంచి వేగంగా బయలుదేరింది మిస్టర్ దోమ.
*************************************************సమాప్తం********************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి