పోస్ట్‌లు

జూన్ 1, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

బాధ్యత…(కథ)

                                                                       బాధ్యత                                                                                                                                                                         ( కథ )   " డాక్టర్ ... ఎలాగైనా నా భార్యా బిడ్డలను కాపాడండి . వారు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు " ఏడుస్తూ చెప్పేడు గణేష్ . “ చూడండి మిస్టర్ . గణేష్ ... దానికోసమే ఒక ప్రత్యేక డాక్టర్ల బృందం నిన్నటి నుండి క్రుషి చేస్తున్నారు . కానీ మీ భార్య ఆరొగ్యంలో కొంచం కూడా మార్పు కనిపించడంలేదు . మీ భార్య కేసును మేమంతా ఒక చాలెంజ్ గా తీసుకున్నాము . నిజానికి ఇప్పుడు జరుగుతున్నది వైద్యానికి - విధికి మధ్య యుద్దం . వైద్యం మూలంగా విధిని జయించటానికి నగరంలోని డాక్టర్లంతా ఒకటయ్యేరు . మీ భార్య కేసులో ఎటువంటి ట్రీట్ మెంట్ చేస్తే తల్లీ - బిడ్డను కాపడవచ్చుననే విషయంపై వైద్య సముదాయమే పుస్తకాలు తిరగేస్తున్నది ... కాబట్టి మీరు కొంచం రిలాక్స్డ్ గా ఉండండి ... మమ్మల్ని రిలాక్స్డ్ గా ఆలోచించుకోనివ్వ