పోస్ట్‌లు

జనవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

జమునా…(కథ)

                                                                                   జమునా                                                                                                                                                         (కథ) జీవితం చాలా విచిత్రమైనది.ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి ఒక సంఘటనే ఈరోజు ఆ ఇద్దరి జీవితంలో జరిగింది. ఆ సంఘటనే వాళ్ళిద్దరి ప్రాణాలకూ ఆనందం ఇచ్చింది. ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్పవలసిన ప్రేమను ఆ రోజు ఇద్దరూ వ్యక్తం చేయలేకపోయారు. కానీ , ఈ రోజు వ్యక్తం చేసుకున్నారు. ఆనందపడ్డారు. ఆ రోజు వ్యక్తం చేసుంటే... ? ఏం జరిగేదో తెలియదు. వాళ్ళెందుకు ఆ రోజే వాళ్ల ప్రేమను బయటపెట్టలేదు ? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి. ********************************* ********************************* ********************************* జీవితం ఎంత విచిత్రమైనది ? చివరగా హైదరాబాదులో ఒక మండే వేసవి ఏప్రిల్ నెల ప్రొద్దున , ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు చూసిన జమునాను , ఈ రోజు అద్దాల బయట మంచు బిందువులు ఎగురుతున్న ఫ్రాంక్ ఫుట్ విమానాశ్రయంలో ఒక చలికాల రాత్రిపూట చూస్తున్నాను.

ఆకలికి రంగులేదు…(కథ)

                                                                      ఆకలికి రంగులే దు                                                                                                                                                 (కథ) జాతి! ఆ పదం మీకు దేనిని జ్ఞప్తికి తెస్తుంది ? కొందరికైతే ఇది ద్వేషం , అణచివేత అనే భావాన్నిస్తుంది. ఇతరులకైతే , ఇది అసూయ , కలహం , మరియు హత్య కూడా అని భావమైయుంది. అమెరికాలోని జాతి కలహాలతో మొదలుకొని దక్షిణాఫ్రికాలోని వర్ణవివతల వరకు , తూర్పు ఐరోపాలోని వేర్వేరు తెగల మధ్య యుద్ధాలు మొదలుకొని పాకిస్తాన్‌ , శ్రీలంక లాంటి దేశాల్లోని పోరాటాల వరకు — జాతి అనేది మానవుని దారుణ బాధకు , విధ్వంసకాండకు కేంద్రస్థానమైంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది ? దాదాపు ప్రతీ విషయాన్ని కూడ సహించేలా కన్పించే ప్రజలున్న దేశాల్లో కూడ , జాతి అనేది ఎందుకంత విపరీత వివాదాంశమైంది ? ఎంతో గందరగోళాన్ని , అన్యాయాన్ని రగిలించే ఒత్తిలా జాతిని తయారుచేసిందేమిటి ? సరళంగా చెబితే , వేర్వేరు జాతుల ప్రజలు ఎందుకు కలిసిమెలసి జీవించలేరు ? " ఎవరయ్యా నాకు ఉద్యోగం ఇచ్చేది ? ఎక్కడకెళ్ళి అడిగినా నీ జాతి