జమునా…(కథ)

 

                                                                                 జమునా                                                                                                                                                        (కథ)

జీవితం చాలా విచిత్రమైనది.ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి ఒక సంఘటనే ఈరోజు ఆ ఇద్దరి జీవితంలో జరిగింది. ఆ సంఘటనే వాళ్ళిద్దరి ప్రాణాలకూ ఆనందం ఇచ్చింది. ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్పవలసిన ప్రేమను ఆ రోజు ఇద్దరూ వ్యక్తం చేయలేకపోయారు. కానీ, ఈ రోజు వ్యక్తం చేసుకున్నారు. ఆనందపడ్డారు. ఆ రోజు వ్యక్తం చేసుంటే...? ఏం జరిగేదో తెలియదు.

వాళ్ళెందుకు ఆ రోజే వాళ్ల ప్రేమను బయటపెట్టలేదు? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

***************************************************************************************************

జీవితం ఎంత విచిత్రమైనది? చివరగా హైదరాబాదులో ఒక మండే వేసవి ఏప్రిల్ నెల ప్రొద్దున, ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు చూసిన జమునాను, ఈ రోజు అద్దాల బయట మంచు బిందువులు ఎగురుతున్న ఫ్రాంక్ ఫుట్ విమానాశ్రయంలో ఒక చలికాల రాత్రిపూట చూస్తున్నాను.

హైదరాబాద్ నుండి వచ్చిన నేను జెర్మనీ, ఫ్రాంక్ ఫుట్ విమానాశ్రయంలో దిగి లుఫ్తాన్సా ఏర్లైన్స్ విమానం పుచ్చుకుని సాన్ సాన్ ఫ్రాన్సిసికో వెళ్ళాలి. హెవీ స్నోఫాల్ పడుతున్న కారణంగా విమానం ఆలస్యం.

టెరిమనల్-2 లో, నా భార్య తో మొబైల్ ఫోనులో మాట్లాడుతున్నప్పుడు జమునాను గమనించాను. మెక్ డోనాల్డ్స్ రెస్టారెంటులో ఒంటరిగా నిలబడి బర్గర్ తింటూ ఉన్నది. చూసిన క్షణమే తెలిసిపోయింది...అది జమునానే. ఆ మరు క్షణమే మనసులో ఒక పెద్ద అల ఎగిసిపడింది. ఇక జీవిత కాలంలో చూసుకోనే లేము అని అనుకుంటున్న జమునా యాభై అడుగుల దూరంలో బర్గర్ తింటున్నది.

నేను జమునాను చూడటానికి నడుస్తున్నప్పుడు నా కాళ్ళు చిన్నగా వణికినై. లోలోపల పేరు పెట్టలేని ఒక ఎమోషన్, నడి నెత్తి వరకు ఎక్కి నన్ను కుదుపుతున్నది.

నేను జమునాను సమీపించినప్పుడు, ఆమె తిని ముగించింది. నేను ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడ్డాను. టిష్యూ పేపర్ తో పెదాలను తుడుచుకుంటున్నజమునా కళ్ళు నన్ను చూసిన వెంటనే అలాగే కదలకుండా నిలబడిపోయి, మొదట, కళ్ళల్లో 'ఎవరు?' అన్న ప్రశ్న, తరువాత గుర్తుపట్టినప్పుడు షాక్, ఆశ్చర్యం, అనుమానం...అనే మిక్సడ్ ఎమోషన్స్.

నేను నాలోని కుదుపులను అనుచుకుంటూ, "జమునా...నన్ను తెలుస్తోందా?" అన్నాను.

కళ్ళల్లోని ఆశ్చర్యం ఇంకా పోకుండానే "హాయ్...యూ... జో...మై గాడ్..." అంటూ, నుదుటి మీద పడిన జుట్టును పక్కకు తోసుకున్న జమునా తెల్లరంగు జీన్స్, పర్పుల్ రంగు రౌండ్ నెక్ టీ షర్ట్ వేసుకోనున్నది. నలబై సంవత్సరాలు అయినా కళ్ళల్లో, తగ్గని అదే యుక్త వయసు జీవం. మన మనసుకు నచ్చిన స్త్రీలు ఎంత వయసైనా అందంగానే కనబడతారు.

"ఇట్స్ అన్ బిలీవబుల్..." అన్న జమునా యొక్క స్వరంలో ఎంతో ఉత్సాహం.

నేను, "ఎస్...ఇలాంటి హఠాత్తు ఆశ్చర్యాలు లేకుండా పోతే జీవితం బోరు కొడుతుంది...అన్నాను.

"అవును...నిజమే...ఏదైనా తింటావా?"

"వద్దు, నాలుగు గంటలుగా నడిచి, నడిచి వచ్చినందువలన కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అలారా కూర్చుందాం"

కూర్చున్నాము.

కొద్ది క్షణాలు నన్ను రెప్ప వాల్చకుండా చూసిన జమునా, "నువ్వు హైదరాబాదులో లేవా?"

"లేను. యూ.ఏస్. సాన్ ఫ్రాన్సిస్కో..." అన్న వెంటనే ఆమె కనురెప్పలు పైకి లేచినై. కంటిన్యూ చేస్తూ "అమ్మా, నాన్న అందరూ చనిపోయారు. ఆర్.ఏ పురంలో ఉన్న మా స్థలాన్ని అమ్మటం కోసం హైద్రాబాద్ వెళ్ళి రిటర్న్ వస్తున్నాను" అన్నాను.

"నేనూ హైదరాబాదు నుండి ఇప్పుడే వచ్చాను. స్నో ఫాల్ పడుతోందని, వెయిట్ చెయ్యమని చెప్పారు...స్వీడన్ వెళ్ళాలి"

"ఓ..."

"నా భర్త స్టాక్ హోం లో పనిచేస్తున్నారు. మా అన్నయ్య కొడుకు పెళ్ళి హైదరాబాద్ లో జరిగితే, నేనొక్క దాన్నే వచ్చి వెళుతున్నాను...ఇక్కడ విమానం మారి స్టాక్ హోం వెళ్ళాలి" అని చెప్ప...నేనేమీ మాట్లాడక ఆమె మొహాన్నే చూస్తూ ఉండిపోయాను.

"ఏయ్...ఏంటలా చూస్తున్నావు?" అన్నది.

కాలేజీ ఫేర్ వెల్ డే రోజున, పట్టులంగా, ఓణీ, చెవులకు జిమికీలు...కల్చరల్ హాలు వాకిట్లో పువ్వులతో ముగ్గు వేస్తున్న జమునాని వెతుకుతున్నాను"

"ఆమె చనిపోయింది...నీకెప్పుడు విమానం" అన్నది.

"తెలియదు...హెవీ స్నో ఫాల్. డిస్ ప్లే బోర్డు చూసి చూసి కళ్ళు మందగించాయి..."

అప్పుడు ఆమె మొబైలుకొ ఫోను రాగా..."ఎక్ క్యూజ్ మి..." అని కొంచం జరిగి మాట్లాడడం మొదలు పెట్టింది.  ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె చెవులకు ఊగుతున్న పెద్ద వలయాన్ని చూస్తూ ఉన్నాడు. గబుక్కున ఫ్రాన్ ఫుట్, చలి, స్నో అన్నీ  మరిచిపోయి...1994లో నేను మొదటిసారిగా జమునాను చూసిన ప్రొద్దుటి జ్ఞాపకము వచ్చింది.

జమునా, నాతో హైదరాబాదు లో నాలుగు సంవత్సరాల కాలం బి.ఈ చదివింది. ఆమె ఎలెక్ట్రానిక్స్, నేను మెకానికల్ అయినానూ మానికొండ నుండి ఒకే కాలేజీ బస్సులోనే  కాలేజీకి వెళ్ళి వచ్చాము.

మొదటి రోజు పసుపు రంగు చుడీదార్ లో బస్సులోకి ఎక్కిన జమునా యొక్క అందంలో ఆశ్చర్యపోయి బస్సు మొత్తం నిశ్శబ్ధం అయ్యింది. బస్సులోని వారిని మాత్రమే కాదు...ప్రపంచాన్నే నిశ్శబ్ధం చేయగల అందం అది. మంచి బంగారు రంగు కలర్, అందమైన పెద్ద కళ్ళు. మెత్తని చెంపలు...అంటూ ప్రపంచంలోని గొప్ప అందగత్తెల ఫీచర్స్ అంతా ప్రోగ్రాం చేసి కంప్యూటర్లో గీసిన అమ్మాయిలాగా అంత అందంగా ఉన్నది.

జమునా తో ప్రారంభ పరిచయం...కొన్ని సంప్రదాయ మాటలు తప్ప ఎక్కువ మాట్లాడ  లేదు. కానీ, ఆ నాలుగు సంవత్సరాల కాలమూ, బస్సులో ఒక్కొక్క క్షణమూ ఆమె అందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. ఆమె, మెడలోని గొలుసును చూపుడు వేలుతో నొక్కి, చుట్టుకున్నట్టు చేస్తూ తన పక్కనున్న గాయత్రీతో నవ్వుతూ మాట్లాడుతున్నది, టిఫిన్ బాక్స్ మూతపై ముఖం చూసుకుని స్టిక్కర్ బొట్టును సరిచేసుకోవటం, బస్సులో వినబడే పాటకు తన్ లేత బుగ్గలమీద గోరింటాకు వేసుకున్న వేలుతో తాళం వేయటాన్ని...అంటూ చూస్తూ ఉన్నాను. ఆమె కూడా చూసీ చూడనట్టు, నేను ఆమెను ఎంజాయ్ చేస్తున్నది గమనిస్తుంది. పెదాల చివర చిరు నవ్వుతో కదలి వెళ్ళిపోతుంది.

చంద్రుడుని చూసి కోట్ల మంది ఎంజాయ్ చేస్తారు. దానికోసం చంద్రుడు వాళ్ళందరికీ జవాబు ఇవ్వగలడా ఏమిటి?

మా నాలుగో సంవత్సరం కాలేజీ చివరి రోజులు దగ్గర పడ...సడన్ గా ఒక నిర్ణయానికి వచ్చాను. మా చివరి పరీక్షకు ముందు రోజు, ఒక ప్రేమలేఖ రాసి, తీసుకుని బస్సులో ఎక్కాను.

కాలేజీకి వెళ్ళి దిగిన వెంటనే " జమునా..." అని పిలిచినప్పుడు నా స్వరం వణికింది. గాయత్రీతో పాటూ ముందు నడుస్తున్న జమునా "ఏమిటీ?" అని అడిగింది.

"మీతో కొంచం మాట్లాడాలి..." అన్న వెంటనే ఆమె కళ్ళల్లో ప్రశ్న. ఇద్దరం పక్కగా ఉన్న కుడ్మోహర్ చెట్టుకిందకు చేరుకున్నాం. గాయత్రీ కొంచం జరిగే నిలబడింది.

"జమునా...రేపటితో మన కాలేజీ చదువు పూర్తి అవబోతోంది..."

"అవును..."

ప్రేమలేఖను ఇచ్చేద్దం అనుకుంటూ జేబులోకి చెయ్యి పోనిచ్చాను. కానీ, చివరి క్షణంలో ఒక బిడియం. నేనొక క్రిష్టియన్. ఆమె హిందూ. కాబట్టి ఆమె తన ప్రేమను నిరాకరిస్తే ఏం చేయాలి? అంతకంటే ముఖ్యంగా నామీద ఏదైనా ఒపీనియన్ ఉన్నదా అనేది తెలియాలి.

ఇంకా రేపటి వరకు టైమున్నది. కనుక ఈ రోజు తిన్నగా ప్రేమను చెప్పకూడదు. మొదట ఆమె ఫోటోను అడిగి చూద్దాం. రేపు ఆమె తీసుకు వచ్చి ఇస్తే, ఆ తరువాత ప్రేమలేఖను ఇద్దాం అన్న నిర్ణయంతో నేను "మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో తెలియదు...అందువల్ల నీ జ్ఞాపకంగా...రేపు నీ యొక్క ఫోటో ఒకటి ఇస్తావా?" అన్నాను.

గబుక్కున జమునా ముఖం మారింది. జమునా చుట్టూ చూసింది. నా ముఖంవైపు కొద్ది క్షణాలు దీర్ఘంగా చూసిన ఆమె, నన్ను దాటి వెళ్ళి పోయింది.

మరుసటి రోజు బస్సు నుండి దిగిన వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాను. ఒక్క క్షణం నిలబడింది. నా ముఖం వైపు చూసింది. ఏమనుకుందో ఏమో తెలియదు. వేగంగా తిరిగి కాలేజీ భవనం వైపు నడిచింది.

ఆ రోజు చివరిగా చూడటమే. ఆ తరువాత రిజల్స్ వచ్చి సర్టిఫికెట్లు తీసుకోవటానికి వెళ్ళిన రోజు జమునా కళ్లకు కనిపించలేదు. ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఇప్పుడే ఆమెను మళ్ళీ చూస్తున్నాను.

మొబైల్ లో మాట్లాడి ముగించి తిరిగి వచ్చిన జమునా "నా భర్త..." అన్నది.

"ఎంతమంది పిల్లలు?"

"ఇద్దరు...ఇద్దరూ అమ్మాయిలే..." అని చెప్పినప్పుడు ఆమె తన కుడిచేతిని లేపి రెండు వేళ్ళను చూపించటం అందంగా ఉన్నది.

"నీకు ఎంతమంది పిల్లలు?" అని అడిగింది.

"ఒక అబ్బాయి...ఒక అమ్మాయి...నువ్వు కాలేజీ స్నేహితులతో టచ్ లో ఉన్నావా జమునా?" అంటూ మా సంభాషణ కొనసాగి కాలేజీ స్నేహితులూ, చర్చ్ తిరునాళ్ళు, వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్సవం, ఉడిపీ మెస్ పొడి దోసె...అంటూ అరగంట సేపు మాట్ల తరువాత మా ఇద్దరి మధ్య లాంగ్ నిశ్శబ్ధం. ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూస్తూ నిలబడ్డాం.

ఇంకేం మాట్లాడాలో తెలియని నేను, "నువ్వు ఫేర్ వెల్ డే రోజున ఏం పాటపాడావో జ్ఞాపకం ఉందా?"

"ఏం పాట?" అన్న జమునా తన వెడల్పాటి చూపులను పైకెత్తి చూస్తూ ఆలోచిస్తున్నప్పుడు ఎంతో అందంగా ఉన్నది.

"ఆ రోజు నువ్వు మజంతా రంగు పట్టు ఓణీ వేసుకున్నావు...కళ్లతో చూసేవంతా...పాడావు..."

"ఆలాగా?" అంటూ ఆమె మొహం వికసించ "ఇంకా అవన్నీ జ్ఞాపకం పెట్టుకోనున్నావా?"

"ఊ..." అని నవ్విన నేనునేను దేన్నీ మరచిపోలేదు జమునా..." అని చెప్పేసి ఆమె మొహాన్ని లోతుగా చూశాను. ఆమె మొహంలో ఏ చలనమూ లేదు. అప్పుడు డిస్ ప్లే  బోర్డులో తన విమానం బయలుదేరటానికి రెడీగా ఉన్నదని ప్రకటనను చూసినప్పుడు నా మాటలు ఆగినై.

"నీ విమానం బయలుదేరబోతోందా?" అన్నది.

"అవును" అంటూ లేచిన నేను, "తరువాత...ఇఫ్ యు డోంట్ మైండ్...నీ మొబైల్ నెంబర్ ఇవ్వగలవా?" అన్నాను.

"ష్యూర్" అన్నది.

ఇద్దరం మొబైల్ నెంబర్లు షేర్ చేసుకున్నాం...నేను హ్యాండ్ లగేజీ బ్యాగు తీసుకుని ఆమె మొహాన్ని చూసాను. ఆమె మొహంలో ఏమోటో తెలియని ఒక భావం.

"ఓకే...బై. చూద్దాం..." అన్న నేను వెంటనే "ఎక్కడ్నుంచి చూసేది? నువ్వు ఒక మూల, నేనొక మూల..." అన్నాను.

"ఎస్..." అన్న ఆమె నాకళ్ళనే గుచ్చి గుచ్చి చూడ...నా లోలోన ప్రాణం పోయి ప్రాణం వచ్చింది.

మళ్ళీ ఇంకోసారి "బై..." చెప్పేసి గేట్ నెంబర్ నలబై మూడు వైపుకు నడిచాను. పది నిమిషాలు నడిచి వెళ్ళి సెక్యూరిటీ చెక్-ఇన్ కోసం వరుసలో నిలబడ్డాను. క్యూ మెల్లగా కదిలింది. అప్పుడు నా మొబైలులో వాట్స్ ఆప్ మేసేజి వచ్చిన శబ్ధం వినబడింది. తీసి చూసిన నేను షాక్ అయ్యాను. జమునా మేసేజ్ పంపించింది. వేగంగా ఓపన్ చేశాను. అది టెక్స్ట్ మెసేజీ కాదు. ఎర్రటి రంగులో ఏదో క్లియర్ గా తెలియక పచ్చ రంగు  చుడుతూ ఉంది.

నాకు ఆదుర్దాగా ఉన్నది. గబుక్కున క్యూ నుండి వైదొలగి మొబైల్ చూశాను. సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. ఇంకా పచ్చ తిరుగుతూనే ఉంది. గబుక్కున ఆగిపోయిన పచ్చ తిరుగుడు తరువాత మొబైలులో కనబడ్డ ఫోటోను చూసి నేను ఆశ్చర్యపోయాను. అది... జమునా ఫోటో. అందులోనూ ఆమె కాలేజీ ఫేర్ వెల్ రోజున వేసుకున్న మజంతా రంగు  పట్టు ఓణీ, లంగాతో పువ్వుల ముగ్గు ముందు నిలబడ్డ ఫోటో.

"ఇప్పుడు అది పంపితే అర్ధం ఏమిటి?" అని నేను ఆలొచిస్తున్నప్పుడే, జమునా దగ్గర నుండి ఇంకో మేసేజి. "ఆ రోజు నువ్వు అడిగిన ఫోటోను ఈ రోజే ఇవ్వటం కుదిరింది... గుడ్ బై..." అన్న జమునా యొక్క మేసేజిని చదివిన వెంటనే, లోలోపల అంత ఆనందం. కాళ్ళూ చేతులూ వణికినై. నా విమానానికి ఇంకా అరగంట సేపు ఉంది. వేగంగా వేనక్కి  తిరిగి టెరిమినల్-2 వైపుకు పరిగెత్తాను.

టెరిమినల్-2 లో మేము కూర్చున్న అదే చోటనే జమునా కూర్చోనుంది. తన ఒడిలో బ్యాగును పెట్టుకుని, ఆ బ్యాగుపై తల పెట్టుకోనుంది. జమునాకు దగ్గరగా వెళ్ళిన నేను  " జమునా..." అని పిలవటానికి నోరు తెరిచాను. కానీ శబ్ధం రాలేదు. అలాగే ఆమె ఎదురుగా మోకాలు మీద కూర్చున్నాను. ఆమె భుజం మీద నుండి ఆమె మెడ మీద పడున్న జడనే కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయాను.

నేను గొంతుకను సరిచేసుకుని " జమునా..." అన్నాను. వేగంగా తల ఎత్తిన జమునా కళ్ళు తడిసున్నాయి. గబుక్కున కళ్ళు తుడుచుకుని "నువ్వింకా పోలేదా?" అన్నది.

"నీ ఫోటోను చూసిన వెంటనే వచ్చాశాను..." అన్న వెంటనే ఏడుస్తూ నవ్విన జమునా తన చేతి వేళ్ళతో నోటిని మూసుకుని ఏడుపును ఆపుకుంది. నాకూ గబుక్కున ఏడుపు వచ్చింది. చాలా కష్టపడి వస్తున్న ఏడుపును ఆపుకున్నాను.

 "ఆ ఫోటో నాకు చాలా నచ్చుతుంది. అందుకని ఎప్పుడూ మొబైల్ కాలర్లో  ఉంచుకుంటాను..." జమునా అన్నది.

"అలాగా" అన్న నేను "ఈ ఫోటోను నువ్వు...ఇరవై ఐదు సంవత్సరాలకు ముందే ఇచ్చుండచ్చే జమునా?" అన్నాను.

"ఇచ్చుంటే ఏం చేసుంటావు?"

"నేను నా ప్రేమను నీ దగ్గర చెప్పుంటాను..."

జమునా కింది పెదవిని కొరుక్కుంటూ ఏడుపును అనుచుకోనున్నది. ఎమోషన్స్ తో ఆమె కింది దవడ అటూ ఇటూ జరగ...చటుక్కున అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుని  "ఆ రోజు నీ దగ్గర ఇవ్వటం కోసమే ఫోటోను తీసుకు వచ్చానురా..." అన్న ఆమె వెక్కి వెక్కి ఏడవ...చుట్టూ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని వినోదంగా చూసి వెళ్తున్నారు.

అదిరిపోయిన నేను, "ఏయ్...ఏం చెబుతున్నావు?" అంటూ ఆమె మొహాన్ని పైకెత్తి "ఫోటో తీసుకు వచ్చావా?"

"ఊ..."

"మరైతే ఎందుకు ఇవ్వలేదు?"

"నువ్వెందుకు అడగలేదు?"

"ఏమడగలేదు?"

"మరుసటి రోజు నా దగ్గరకొచ్చి ఫోటో తీసుకు వచ్చావా అని ఎందుకు అడగలేదు?"

"నేను క్రితం రోజు ఫోటో అడిగినప్పుడు నన్ను కోపంగా చూసి వెళ్ళిపోయావు. ఆ భయంతో అడగలేదు"

"మూర్ఖుడా...అప్పుడు పక్కన గాయత్రీ ఉన్నది. ఆమె ఎదురుగా నేను ఏం చేయగలను? కానీ, మరునాడు నేను ఫోటో తీసుకు వచ్చాను. నేనే తీసుకు వచ్చి ఇద్దామనే మొదట  అనుకున్నాను. కానీ ఏదో ఒక భయం...తడబాటు. నువ్వు క్రిష్టియన్. ఇద్దరి ఇల్లల్లోనూ ఖచ్చితంగా ఒప్పుకోరు. అందువల్ల ఇద్దమా? వద్దా? అని ఒకటే అయోమయం. సరే...నువ్వు మళ్ళీ వచ్చి అడిగితే ఇద్దాము. లేకపోతే వద్దు. అని అనుకున్నాను. నువ్వు అడగనే లేదు..." అంటూ ఏడ్చిన ఆమె, నా చెంపల మీద మార్చి మార్చి కొడుతూ "ఎందుకురా అడగలేదు? నిన్ను నాకు బాగా నచ్చుతుంది...బాగా బాగా నచ్చుతావురా..." అన్న ఆమె నా భుజాల మీద వాలిపోయి ఏడవ...నేనూ ఏడుస్తూ ఆమెను హత్తుకున్నాను.

ఎంతసేపు అలా ఏడుస్తూ ఉన్నామో తెలియదు. ఏదో ప్రకటన రాగా...గబుక్కున తల ఎత్తిన జమునా, వేగంగా నా దగ్గర నుండి వెలువడింది. ఆమె ముఖాన్ని లోతుగా చూసిన నేను చిన్న పిల్లాడిలాగా "ఇప్పుడేమీ చెయ్యలేము కదా జమునా?" అన్నాను.

ఇప్పుడు కాస్త క్లారిటీతో ఉన్న జమునా "మూర్ఖుడా...దట్స్ ఆల్...అంతే. అంతా అయిపోయింది. చెప్పకుండా ఉంచబడ్డ ప్రేమను కూడా చెప్పుకుని ముగించాము. అంతవరకు సంతోషం..." అన్న ఆమె నా భుజాలు నొక్కుతూ "బయలుదేరు..." అన్నది.

"బై..." అని చెప్పిన నేను తిరిగి గేటు నెంబర్ 43-ఐ వైపు నడిచాను.

**************************************************సమాప్తం*******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)