ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)
ఉమ్మడి కుటుంబం (మినీ కథ)
ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానికే తావు ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు.
ఇది తెలిసుండి కూడా ఈ రోజుల్లో చాలా మంది ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయి వేరుగా కాపురాలు పెడుతూ జీవిస్తున్నారు. చిక్కులను ఎదుర్కొంటూనే ఉన్నారు. సుఖంగా ఉంటున్నారా అంటే అదొక చిక్కు ప్రశ్నే?......ఈ కథలో ఏ జరిగిందో తెలుసుకోండి.
****************************************************************************************************
"ఏమండీ...మనం
వేరే కాపురం
పెట్టుకుని ఇక్కడ్నుంచి
వెళ్ళిపోదామండీ"
కొత్త పెళ్ళికొడుకు
విశాల్ తో
చెప్పింది భార్య.
"ఏయ్
కల్పనా...నువ్వేం
మాట్లాడుతున్నావో
తెలుస్తోందా? మనకు
పెళ్ళై ఒక
నెలే అయ్యింది.
ఇంతలోనే వేరే
కాపురం పెట్టి
వెళ్ళిపోదాం అని
చెబితే మా
అమ్మా -- నాన్న
ఏమనుకుంటారు" అన్నాడు
ఆశ్చర్యంగా.
"ఏమండీ...ఈ
ఇంట్లో ఇప్పటికే
మీ ఇద్దరు
అన్నయ్యలూ ఉమ్మడి
కుటుంబంగానే ఉంటున్నారు.
వీళ్ళే కాకుండా
పెళ్ళీడు కొచ్చిన
ఒక చెల్లెలు.
వీళ్ళందరికీ సేవ
చేయటం నా
వల్ల కాదండి.
అది మాత్రమే
కాదు...మనిద్దరం
ఉద్యోగాని వెళుతూ
సంపాదిస్తున్నాం.
ఉమ్మడి కుటుంబంలో
ఉంటే మనిద్దరి
సంపాదననూ ఖర్చుపెట్టాలి.
మనం వేరు
కాపురం పెట్టుకుని
వెళ్ళిపోతే మనకొసం
కొంత డబ్బును
చేర్చిపెట్టుకోవచ్చు"
"కల్పనా...నాకెందుకో
ఉమ్మడి కుటుంబంగానే
ఉండాలని అనిపిస్తోంది"
"అదంతా
కుదరదు. ఈ
రోజే మీ
నాన్న దగ్గర
అడగండి. లేకపోతే
నేను మా
అమ్మా వాళ్ళింటికి
వెళ్ళిపోతాను" ఖచ్చితంగా
చెప్పింది కల్పనా.
వేరే దారిలేక
వేరు కాపురం
పెట్టటానికి తన
తల్లి-తండ్రుల
దగ్గర అనుమతి
తీసుకున్నాడు విశాల్.
వేరు కాపురం
పెట్టటానికి తన
తల్లి-తండ్రులు
ఒప్పుకున్నారనే
భర్త చెప్పిన
విషయాన్ని విని, సంతోషంగా
మేడమెట్లు ఎక్కిన
కల్పనా, కాలు
జారి గబుక్కున
పడిపోయింది. దొర్లుకుంటూ
కిందకు పడిపోయింది.
అందులో ఆమె
కాలుకు ఫ్రాక్చర్
అయ్యింది. కాలును
రెండు నెలల
వరకు కదపకూడదని
చెప్పాడు డాక్టర్.
అంతవరకు విశాల్
కుటుంబం కల్పనను
ఒక చిన్న
పిల్లలాగా చూసుకున్నారు.
ఆమెకు ఏమేమి
కావాలో ఆమెను
అడిగి మరీ
చేశారు.
కల్మషం లేని
వాళ్ళ ప్రేమతో
కరిగిపోయింది కల్పన.
సిగ్గుపడింది. రెండు
నెలల తరువాత
మెల్లగా నడవటం
మొదలుపెట్టింది.
"కల్పనా...నువ్వు
నడవటం మొదలుపెట్టావు
కదా! ఇప్పుడు
మా అమ్మా-నాన్న, అన్నయ్య-వదినల, వాళ్ళ
పిల్లల, నా
చెల్లి గోల
లేకుండా వేరు
కాపురం వెళ్ళిపోదామా?"
అన్నాడు విశాల్.
గబుక్కున భర్త
కాళ్ల మీద
పడి "నన్ను
క్షమించండి. ఉమ్మడి
కుటుంబం యొక్క
గొప్పతనం తెలియక
మాట్లాడాను. ఇంత
ప్రేమ చూపించే
మనుష్యులను, బంధువులను
వదిలి మనం
ఎందుకండి వేరుగా
ఉండటం? చివరిదాకా
ఉమ్మడి కుటుంబం
గానే ఉందాం"
అన్న భార్య
భుజాన్ని నొక్కి
పట్టుకుని ఆదరణతో
పైకి లేపాడు.
******************************************************సమాప్తం***************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి