పోస్ట్‌లు

జులై 2, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆర్గానిక్ …(కథ)

                                                                             ఆర్గానిక్                                                                                                                                                                                             ( కథ) " ఇది ' ఆర్గానిక్ ' పండే కదా ?" ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళిన శేఖర్ , చేతిలో ఉన్న సంచీని భార్య సరోజకు అందించిన వెంటనే అడిగింది. అవి ద్రాక్ష పండ్లు. ఆమె వేడిగా   వేడిగా కాఫీ తీసుకు వచ్చి ఇచ్చింది. కాళ్ళూ-చేతులూ-మొహమూ కడుక్కుని...ఆమె అందించిన కాఫీ తాగుతూ చెప్పాడు... ..... "అవును...ఫోనులోనే పదిసార్లు చెప్పాను. ఇప్పుడు పూర్తిగా ఇంట్లోకి రాక ముందే అడుగుతున్నావు. ' ఆర్గానిక్ ' పండ్లే! కానీ నువ్వు ఇంత పెద్ద ' ఆర్గానిక్ ' పిచ్చిదానివిగా ఉండకూడదు" అన్నాడు. "ఆర్గానిక్ కే నండి శరీరానికి మంచిది. కృతిమంగా తయారు చేసింది ఏదైనా సరే ఆరోగ్యానికి హాని చేస్తుందండి. అందులోనూ ఇప్పుడు పంటలకు వేస్తున్న రసాయన ఎరువులు , రసాయన పురుగుల మందూ వేసి పండించేది ఏదీ మంచిది కాదు. మన శరీరానికి