పోస్ట్‌లు

మే 11, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నీకంటూ ఒకరు…(కథ)

                                                                                 నీకంటూ ఒకరు                                                                                                                                                                     ( కథ) భార్య అందించిన కాఫీ గ్లాసును ఎడం చేత్తో పుచ్చుకుని , వరాండాలో పడున్న ఆ రోజు న్యూస్ పేపర్ను కుడి చేతిలోకి తీసుకుని సోఫాలో కూర్చోబోయాడు అనుభవ్. "డాడీ ఫోన్" అంటూ తండ్రి సెల్ ఫోన్ను తీసుకుని అక్కడికి వచ్చింది ఆరేళ్ళ రంజని. "ఎవర్రా ఫోనులో ?" కూతురు అందించిన సెల్ ఫోన్ను తన చేతిలోకి తీసుకుంటూ ముద్దుగా అడిగాడు తండ్రి అనుభవ్. "తెలియదు డాడీ...పేరు రాలేదు" చెప్పేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది రంజని. "ఇంత ప్రొద్దున్నే ఎవరు చేసుంటారు" అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు అనుభవ్. "అనుభవ్ గారు ఉన్నారా ?" ఆడ గొంతుక. "అనుభవ్ నే మాట్లాడుతున్నా...మీరెవరు ?" " సార్ నేను నిమ్స్ హాస్పిటల్ నుండి నర్స్ మాలతిని మాట్లాడుతున్నాను. కౌశల్య అనే ఆవిడ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. మీరు తెలుసని ,