పోస్ట్‌లు

జులై 8, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నిజాయతీ...(కథ)

                                                                           నిజాయతీ                                                                                                                                                                        ( కథ ) బట్టలు ఇస్త్రీ చేసి ఇమ్మని మూర్తీ దగ్గర ఒక జత బట్టలు ( ప్యాంటూ , చొక్కా ) ఇచ్చేసి వెళ్ళింది ఆ కొట్టుకు కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి . ఆ అమ్మాయిని మూర్తి ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు . బహుశ ఆ వీధిలో కొత్తగా కట్టిన అపార్టు మెంటుకు కొత్తగా వచ్చుంటారు అనుకున్నాడు మూర్తి . ఆ బట్టలను తీసుకుని , కొంచంగా నీళ్ళు జల్లి , చుట్టినప్పుడు , ' జేబులో ' ఐదు వందల రూపాయల నోటు ఉన్నది తెలిసింది . మూర్తీ ఆ నోటును తీసుకుని జేబులో పెట్టుకున్నాడు . ఆ సమయంలో ఒక కారు వచ్చి ఆ ఇస్త్రీ కొట్టు ముందు ఆగింది . అందులో నుండి దిగి వచ్చింది అభిరామి . మూర్తి ప్రేమికురాలు . ఆమెకు కూల్ డ్రింక్స్ కొనిచ్చాడు మూర్తి . బట్టలను ఇస్త్రీకి ఇవ్వటానికి వచ్చినప్పుడు , కష్టపడి జీవించాలి అనే అతని జీవిత ఆశ