పోస్ట్‌లు

జూన్ 10, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

గురుదక్షణ…(కథ)

                                                                            గురుదక్షణ                                                                                                                                                        ( కథ) నేను స్కూలు చదువుకునేటప్పుడు నాకు పాఠాలు చెప్పిన రామారావు మాస్టారు , తన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బుచాలక చాలా కష్టపడుతున్నారని తెలిసింది . ఆయన దగ్గర చదువు నేర్చుకుని , గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి , ఇప్పుడు రైల్వేలో క్లర్కుగా పనిచేస్తున్న నేను ఆయనకు సహాయ పడలేకపోతున్నానే అన్న బాధ నన్ను వేధిస్తున్నది . చేతిలో ఉన్నది యాభైవేల రూపాయలు . అవి సరిపోవు . ఏం చేయాలో తెలియక చేతులు నలుపుకుంటూ ఆలొచిస్తున్న నాకు ' బిల్డింగ్ కాంట్రాక్టర్ ’ గా పనులు చేస్తున్న , నాతోపాటు చదువుకున్న , నా చిన్ననాటి స్నేహితుడు గణేష్ ఇంట్లోకి రావడం కనబడింది . అతనికి ఎదురు వెళ్ళి " రా ... రా ... గణేష్ " అంటూ అతన్ని ఆహ్వానించి లోపలకు తీసుకువచ్చి కుర్చీ చూపించి " కూర్చో " అన్నాను . గణేష్ కుర్చీలో