పోస్ట్‌లు

డిసెంబర్ 20, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉత్తరం...(కథ)

                                                                           ఉత్తరం                                                                                                                                                           ( కథ ) 2.8.2009. రాజమండ్రి . ప్రియమైన కూతురు మీనాక్షికి , అమ్మ యొక్క ఆశీర్వాదములు . “ నువ్వు బాగున్నావా ? నేనూ , మీ అక్కయ్యలు , బావలు , పిల్లలు కుశలమే . నువ్వు ఊరు వదిలిపెట్టి వెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది . ఇంతవరకు ఇక్కడకు రాలేదు . ఏదో అప్పుడప్పుడు ఉత్తరం రాయటంతో సరి . నువ్వు బాస్కెట్ బాల్ ఆడటాన్ని టీవీ పెట్టెలో చూపించినట్టు మన ఊరి అమ్మాయలు చెప్పారు . నీ పెద్దక్క భర్త , నిన్ను కూడా పెళ్ళి చేసి ఇవ్వమని గొడవ చేసింది తప్పే . నేను కన్న నలుగురూ ఆడపిల్లలుగా పుట్టారే నని ఏడ్చినమాట వాస్తవమే . చివరగా పుట్టిన నిన్ను , విషం ఇచ్చి చంపేయాలని అనుకున్న నేను కన్నీరు విడువని రోజంటూ ఒకటి కూడా లేదు . నెల నెలా నువ్వు పంపుతున్న డబ్బు తీసుకుంటున్నప్పుడల్లా , నీ లాంటి ఒక అమ్మాయిని చంపాలని అన