ఉత్తరం...(కథ)

 

                                                                         ఉత్తరం                                                                                                                                                         (కథ)

2.8.2009.

రాజమండ్రి.

ప్రియమైన కూతురు మీనాక్షికి,

అమ్మ యొక్క ఆశీర్వాదములు.

నువ్వు బాగున్నావా? నేనూ, మీ అక్కయ్యలు, బావలు, పిల్లలు కుశలమే. నువ్వు ఊరు వదిలిపెట్టి వెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఇంతవరకు ఇక్కడకు రాలేదు. ఏదో అప్పుడప్పుడు ఉత్తరం రాయటంతో సరి.

నువ్వు బాస్కెట్ బాల్ ఆడటాన్ని టీవీ పెట్టెలో చూపించినట్టు మన ఊరి అమ్మాయలు చెప్పారు. నీ పెద్దక్క భర్త, నిన్ను కూడా పెళ్ళి చేసి ఇవ్వమని గొడవ చేసింది తప్పే.

నేను కన్న నలుగురూ ఆడపిల్లలుగా పుట్టారే నని ఏడ్చినమాట వాస్తవమే. చివరగా పుట్టిన నిన్ను, విషం ఇచ్చి చంపేయాలని అనుకున్న నేను కన్నీరు విడువని రోజంటూ ఒకటి కూడా లేదు.

నెల నెలా నువ్వు పంపుతున్న డబ్బు తీసుకుంటున్నప్పుడల్లా, నీ లాంటి ఒక అమ్మాయిని చంపాలని అనుకున్నానే అని నా మనసు కొట్టుకుంటోంది.

అక్కయ్య పద్మజకు  మొదటి బిడ్డ పుట్టి నాలుగు నెలలు అయినా, ‘నగ ఏదీ చేయించ లేదని కోపగించుకుని, ఆమె భర్త ఆమెను తీసుకు వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆరు నెలలుగా అది ఇక్కడే ఉంది. ఆమె కథకు నువ్వే తల్లీ కొంచం మనసు పెట్టాలి

ఇట్లు,

తల్లి,

కాంతమ్మ.

20.8.2009.

హైదరాబాద్.

ప్రియమైన అమ్మకు,

మీనాక్షి రాస్తున్నాది. నేను గత మూడు నెలలుగా ఊర్లో లేను. మా కంపెనీ తరఫున ఆటల పోటీలో పోటీ పడటానికి ఢిల్లీ, కలకత్తా అంటూ వెళ్ళొచ్చాను. నీ ఉత్తరం చూశాను. రోజు డబ్బు పంపించాను

ప్రేమతో.

మీనాక్షి.

25/8/2009.

ప్రియమైన చెల్లి మీనాక్షికి.

నీ మూడో అక్కయ్య బాగ్యం రాస్తున్నది. మన ఊరి పెద్ద చెరువు మాష్టారు సుందరయ్య గారి కూతురు హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం చేయటానికి వెళ్ళింది. పోయిన వారం మన ఊరికి వచ్చింది. నిన్ను ఒక రోజు ట్యాంక్ బండ్ దగ్గర చూసినట్లు, ఎవరో ఒక మనిషిని చూపించి, ఈయనే నా భర్త,  అని ఆయన్ని పరిచయం చేశావని చెప్పింది. మాటల్లో ఆయన మొదటి భార్య చనిపోతే, ఆయనకు నువ్వు రెండో పెళ్ళి భార్యగా పెళ్ళిచేసుకున్నావని చెప్పావుట. ఆమె వచ్చి చెప్పినందు వలనే మాకు తెలిసింది. విన్న వెంటనే మా కందరికీ షాక్ తగిలి నట్లు అయ్యింది.

ఎవరినైనా పెళ్ళి చేసుకుని నువ్వు సంతోషంగా ఉంటే మాకూ సంతోషమే. జాతీ, మతం చూసి,  మంచి రోజు, మంచి ముహూర్తం చూసి, బంధువులతో పాటూ ఊరంతా పిలిచి పెళ్ళి చేసుకున్న నీ ముగ్గురు అక్కయలమైన మేము, జీవించటానికి ఎంత పోరాటం చేస్తున్నామో నువ్వు చూస్తే బావురుమని ఏడ్చేస్తావు.

నువ్వైనా నగరంలో సంతోషంగా ఉంటే చాలే. నీ గురించి తలుచుకుని ఎప్పుడు చూడూ సనుగుతూ ఏడుస్తూ ఉంటోంది అమ్మ.  'దానికి కరెక్టు వయసులో పెళ్ళి చేసుంటే ఇలా రెండో పెళ్ళి వాడిని చేసుకోనుంటుందా?' అని చెప్పి, చెప్పి ఏడుస్తోంది. నువ్వే ఆదరణగా నాలుగు మాటలు చెప్పి ఉత్తరం రాసి, ఆమెను సమాధాన పరుచు

ప్రియమైన అక్కయ్య.

బాగ్యం.

31/08/2009.

హైదరాబాద్.

ప్రియమైన అమ్మకు,

మీనాక్షి రాస్తున్నది. నేను నీకు తెలియకుండా పెళ్ళి చేసుకున్నందుకు నీ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటున్నాను. నా భర్త నాలుగైదు సంవత్సరాలుగా నా వెనుకే తిరిగి, ఆశగా ప్రేమించాడు. నేను సులువుగా అతనికి చోటివ్వక దూరంగానే ఉన్నాను. ఊర్లలో నేను ఆటల పోటీలలో పాల్గొంటున్నానో, చోట్లలో మొదటి వరుసలో కూర్చుని నా ఆటను చూసి ఆనందించేవారు.

చాలా నిదానంగానే నేను ఆయన్ని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఒక రోజు మాటల్లో ఆయనికి ఆటలంటే ఇష్టమని, తాను పోటీలలో పాల్గొనటం కుదరకపోయినా, ఆటల పోటీలలో పాల్గొనే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నట్టు, అలాగే ఒక అమ్మాయిని చేసుకున్నట్టు(ఆమే అతని మొదటి భార్య), దురదృష్టవశాత్తూ ఆమె ఒక యాక్సిడెంటులో చనిపోయిందని, నాకు ఇష్టమైతేనే నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పారు. నాకు ఆయన నిజాయితీ నచ్చింది. పెళ్ళికి ఒప్పుకున్నాను.

పెళ్ళి చేసుకుని ఊరు వచ్చిన దగ్గర నుండి ఒకే ఇంట్లోనే అద్దెకుంటున్నాము. నలభై ఇళ్ళు ఉన్న చోట చాలా ఇళ్ళల్లో రోజూ గొడవలే.

నా భర్త వారానికి రెండు రోజులో, నెలకి ఒక వారమే ఇంట్లో గడుపుతారు. ఎక్కువ రోజులు వ్యాపార విషయంగా బయట ఊర్లలోనే ఎక్కువ రోజులు గడుపుతారు. ఆయన వచ్చినప్పుడల్లా కావలసినవి కొనిబెట్టి, బిడ్డతో ఆడుకుని ఆనందంగా గడిపి వెలతారు.

పలు ఇళ్ళల్లో కాపురం జరుపుతున్నామనే పేరులో, ఒకరి నొకరు ఆక్రమించి--తల్లి, తండ్రీ, పిల్లలూ ఎవరూ సంతోషంగా ఉన్నట్టు అనిపించటం లేదు.

అందరూ నన్ను చూసి నీ పని బాగుందమ్మాయ్అని చెప్పే విధంగానే నా జీవితం ఉన్నది. మొదటి భార్యా-రెండో భార్యా , ప్రేమ పెళ్ళా-పెద్దలు చేసిన పెళ్ళా అనేదంతా ముఖ్యం కాదు. అందరి మనసుల్లోనూ చిన్నగా ఒక నొప్పి, పెద్దగా ఒక నిట్టూర్పు ఉంది. చదువుకోని భర్త, అర్ధం చేసుకోలేని భార్య అంటూ ఏవేవో ఉన్నాయి. ఇంతవరకూ మాకు ఒక్కసారి కూడా పోట్లాట వచ్చింది లేదు. నేను కూడా, ‘ఎందుకురా ఈయన్ని పెళ్ళి చేసుకున్నాం?’ అని బాధపడింది లేదు.

నేను ఆటల్లో సాధించాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని నా భర్త ఆశ పడుతున్నారు. అది మాత్రమే కాదు...దానికొసం నాకు సహాయం చేస్తున్నారు.

అందువల్ల అమ్మా...నువ్వు ఏదో తలుచుకుని మనసు పాడు చేసుకోకు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉత్తరంతో పాటూ నా భర్త ఫోటో, నా పిల్లడి, అదే నీ మనవుడి ఫోటోలు పంపుతున్నాను.

ఇట్లు,

ప్రియమైన కూతురు,

మీనాక్షి.

ఉత్తరాని విప్పిన తల్లి, ఆశగా మనవడికి ముద్దు పెట్టింది.

**************************************************సమాప్తం*******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)