పోస్ట్‌లు

జూన్ 19, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మూగ ప్రేమ…(కథ)

                                                                        మూగ ప్రేమ                                                                                                                                                     (కథ) రెండు నిండు ప్లాస్టిక్ కవర్లతో బయటకు వెళ్ళిన రఘు ఇంటికి తిరిగి వస్తునప్పుడు ఒక నిండు కవరుతో వచ్చాడు . ఇంటి బయట తన పాత చెప్పులను వదిలిపెడుతూ ఇంటి తలుపుపై " శేఖర్ ... టైలర్ " అని రాసున్న పాత చెక్క పలకను చూసి చిన్నగా నవ్వుకుని ఇంట్లోకి వెళ్ళాడు రఘు . కొడుకు ఇంట్లోకి రావడం చూసిన శేఖర్ బట్టలు కుడుతున్న టైలరింగ్ మిషెన్ ఆపి " ఏరా రఘూ ... యూనీఫాం బట్టలు ఇచ్చేసావా ?" అని అడిగేడు . " శంకరంగారింట్లో ఇచ్చేసాను ... సూర్యంగారిళ్ళు తాళం వేసుంది . ఇదిగో వాళ్ళ బట్టలు " చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవరును పక్కనున్న టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగేడు రఘు . " రఘూ ... ఈ చొక్కాకి బొత్తాలు కుడతావా . ఈ బట్టలు ఈ రోజు డెలివరీ ఇస్తానని మాటిచ్చాను " శేఖర్ కొడుకుని అడిగేడు . తండ్ర