పూడ్చే మట్టి…(కథ)
పూడ్చే మట్టి ( కథ ) చట్టదిట్టాలలో ఉన్న లొసుగులుపై నాకు ఎక్కువ బాధ ఉంది. చాలా వరకు అవి ఎక్కువగా , సహజంగా మంచి వాళ్ళకు సహాయపడటం లేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. అమాయకులు అందులో చిక్కుకుని , కష్టపడుతూ నలిగిపోవడం జరిగే అపాయం ఉన్నదని భావిస్తున్నాను. ఆ భావం యొక్క పరిణామమే ఈ కథ. అత్తగారూ ఒకింటి కోడలే అనే కాలం పోయి , కోడలూ ఒక రోజు అత్తగారే కదా అన్న ఆలొచనతో ఏర్పడింది. ‘ పెళ్ళి అయిన రెండు సంవత్సరాలలో కోడలు కు ఎలాంటి క్షోభ ఏర్పడినా దానికి ఆ కోడలి అత్తగారూ , మామగారే కారణమవుతారు ’ అని రాయబడ్డ చట్టాన్ని , పోలీసు డిపార్టుమెంటులో పెద్ద అధికారిగా ఉన్న నా స్నేహితుడు ఎత్తి చూపాడు. అప్పుడు ఆ చట్టంలో ఉన్న రంధ్రాలను నేను గుర్తు చేసాను. ‘ అవన్నీ మేము చూడం. చట్టం చెప్పిందే చేస్తాం. చెయ్యగలం ’ అని చెప్పటం వలన ఏర్పడీన కథా ఆంశం ఇది. వయసైన మామగారూ , అత్తగారూ...వేరు రకంగా దొరికిన కోడలు వలన ఇల