పూడ్చే మట్టి…(కథ)

 

                                                                       పూడ్చే మట్టి                                                                                                                                                       (కథ)

చట్టదిట్టాలలో ఉన్న లొసుగులుపై నాకు ఎక్కువ బాధ ఉంది. చాలా వరకు అవి ఎక్కువగా, సహజంగా మంచి వాళ్ళకు సహాయపడటం లేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. అమాయకులు అందులో చిక్కుకుని, కష్టపడుతూ నలిగిపోవడం జరిగే అపాయం ఉన్నదని భావిస్తున్నాను. ఆ భావం యొక్క పరిణామమే ఈ కథ. అత్తగారూ ఒకింటి కోడలే అనే కాలం పోయి, కోడలూ ఒక రోజు అత్తగారే కదా అన్న ఆలొచనతో ఏర్పడింది. పెళ్ళి అయిన రెండు సంవత్సరాలలో కోడలు కు ఎలాంటి క్షోభ ఏర్పడినా దానికి ఆ కోడలి అత్తగారూ, మామగారే కారణమవుతారు అని రాయబడ్డ చట్టాన్ని, పోలీసు డిపార్టుమెంటులో పెద్ద అధికారిగా ఉన్న నా స్నేహితుడు ఎత్తి చూపాడు. అప్పుడు ఆ చట్టంలో ఉన్న రంధ్రాలను నేను గుర్తు చేసాను. అవన్నీ మేము చూడం. చట్టం చెప్పిందే చేస్తాం. చెయ్యగలంఅని చెప్పటం వలన ఏర్పడీన కథా ఆంశం ఇది.

వయసైన మామగారూ, అత్తగారూ...వేరు రకంగా దొరికిన కోడలు వలన ఇలాంటి చట్టాల వలన ఖైదు చేయబడతారనే భయంతో ఏర్పడిందే. ఖచ్చితంగా దీనిని ఎవరైనా కారణ కర్తల దగ్గరకు తీసుకు వెడతారనే ఎదురు చూపు, ఇలాంటి సంఘటన జరగటానికి అవకాశం ఉన్నదని పరిశోధనా పరిస్థితి రావచ్చని ఆలొచించి రాయబడ్డది.

చదవండి. నా ఆలొచన, రచన, ఎదురు చూడటం సరే అనే పక్షంలో మీరూ ఆలొచించి మీ అభిప్రాయలతో గొంతు విప్పండి. ప్లీజ్.

*************************************************************************************************

షాకైపోయాడు బద్రయ్యా!

కోడలు చెప్పిన మాట అలాంటి మాట. ఎవరూ ఆయన్ని అనని మాట. ఇంతవరకు ఆయన ముందు ఎవరూ చెయ్యి జాపి మాట్లాడింది లేదు.

గట్టిగా ఎవరూ మాట్లాడింది లేదు. అయన ఏ రోజూ, ఎవరి మీదా తన స్వరాన్ని పెంచి మాట్లాడింది లేదు. ఆ ఊరిలో గౌరవించబడే ఒక పెద్ద మనిషి. సున్నితమైన, పండిపోయిన పండు  మనిషి.

 డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో కూడా ఆయన పొలం పనికి వెళ్తున్నారు. ఉన్న భూమిలో ఎక్కువ శాతం చెఱకు, వరి వేసున్నారు. పది ఎకరాల పొలంలో వేరుసెనగ, మినపప్పు, నువ్వులు పండిస్తాడు.

పంటల మధ్యలో కలుపు మొక్కలు, గడ్డి పోచలు తీసిపారేయటానికి మనుషులు తక్కువగా ఉంటే, భుజంపైన వేసుకున్న తుండును తీసి నడుముకు బిగించి తానే స్వయంగా పనిలోకి దిగుతాడు. ఆ ఊరి పెద్ద మనిషిని తానే నన్న భావం అంతా చూడరు.

డబ్బు, ఆస్తి, ఉన్నదనే గర్వమంతా అసలు లేనే లేదు. ఏదైనా సరే నమ్మే స్వభావం గల మనిషి.

తనలాగానే కొందరు అనే ఆలొచన ఆయనకు ఉంది. ఆయన భార్య సరోజినీ ఆయన కంటే సున్నితమైనది. పిల్లల మనసు కలిగినది. అమాయకురాలు. ప్రపంచంలో జరుగుతున్న తప్పొప్పులు గురించి తెలియని మనిషి.

ఒకడే కొడుకు. ఆశకు ఒక కూతురు కావాలనే ఆలొచన కూడా బద్రయ్యాకు లేదు. కానీ, సరోజినీ కు ఉండేది.

మనకు ఒక అమ్మాయుంటే బాగుండేదండీ...మనపైన ప్రేమగా ఉంటుంది...

ఏం, కొడుకు గిరీ ప్రేమ పెట్టలేదా...? అమ్మా, నాన్నా అంటూ ప్రాణం వదలటంలేదా...?”

వదులుతున్నాడండీ...అయినా కానీ కూతుర్ల ప్రేమ, మగ పిల్లలకు ఉండదు కదా...?”

అదేంటి అలా చెబుతున్నావు...? కోడలు పిల్ల వస్తే కూతురుగా అనుకుందాం

అశ్వినీ పిల్ల ఒక్క రోజు కూడా విడవకుండా మనింటికి పరిగెత్తుకు వస్తోంది...నిన్ను అత్తయ్యా అని, నన్ను మామయ్యా అని ఎంతో ప్రేమగా పిలుస్తోంది...దాన్ని కోడలుగా చేసుకుని, కూతురుగా అభిమానిద్దాం...

"మీకు అలాంటి ఆలొచన కూడా ఒకటి ఉన్నదా?”

మొదట్లో లేదు. ఆ పిల్ల సైకిల్ తొక్కుకుంటూ, ఊరు వదిలి ఊరొచ్చి, ఇల్లు వెతుక్కుని మనింటికి వచ్చి కలుపుగోలుగా ఉంటోందే. అది చూసి ఏర్పడింది ఆ ఆలొచన...

కానీ మన ఊర్లో అందరూ ఆ పిల్లను వద్దంటున్నారే...ఆ ఊరి ఆడపిల్లలందరూ గయ్యాలి పిల్లలూ అంటున్నారే...?”

ఊర్లలో ఏముంది...అమ్మాయిల మనసులే బాగుండాలి....ఈ ఊరి అమ్మాయినే కదా వెతికి పట్టుకుని మొదట్లో గిరీకి పెళ్ళి చేశాము...? ఆ పిల్ల ఏం చేసింది...? రాత్రికి రాత్రి ఎవడితోనో  లేచిపోలా...? ఇంకొక అతనితో ప్రేమలో ఉన్నది... ముందే ఈ విషయం వాళ్ళింట్లో వాళ్ళకు తెలిసినా కూడా మనకు చెప్పలేదే...దాచి పెళ్ళి చేశారు కదా...వాళ్ళు ఈ ఊరి మనుషులే కదా...?”

 సరే. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు?”

ఆ అశ్వినీ పిల్లను మన గిరీకి పెళ్ళి చేసేద్దాం అంటున్నా…

దానికి గిరీ ఒప్పుకోవాలే...ఈ నలభై ఏళ్ళ వయసులో నాకెందుకు పెళ్ళి అంటాడే...?”

నలభై అంతా ఒక వయసా...? నేను నిన్ను పెళ్ళి చేసుకున్నప్పుడు నా కెంత వయసు? మా నాన్న, మా అమ్మను పెళ్ళి చేసుకునేటప్పుడు వయసు యాభై...

అదంతా ఆ రోజుల్లో...

ఈ రోజుల్లో కూడా జరుగుతున్న విషయమే సరోజినీ... గిరీకి ఆ అమ్మాయి మీద ఇష్టం లేకుండానా ఆమెతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు...? ఒక రోజు ఆ పిల్ల రాకపోయినా కూడా ఏమ్మా ఈ రోజు అశ్వినీ రాలేదు అని నీ దగ్గర అడుగుతున్నాడుగా...

అవును అడుగుతున్నాడు!

ఇష్టంలేని వాడు అలా అడుగుతాడా...?”

అదీ కరెక్టే. కానీ ఆ అమ్మాయికి ఇరవై, ఇరవై రెండు ఏళ్ళ వయసే ఉంటుంది... గిరీ వయసులో సగానికి సగం తక్కువ...

ఉండనీ! మనసుకు నచ్చితే, అదంతా పెద్ద విషయంగా కనబడదు…

సరే కానివ్వండి...

ఒక మంచి రోజు చూసి పక్క ఉర్లో ఉన్న వెంకటాద్రి ఇంటికి వెళ్ళి పిల్లను అడిగాడు. ఉరి పెద్ద మనిషి తానుగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి పిల్లనడగటంతో వెంకటాద్రికి విపరీతమైన సంతోషం.

ఎంత పెద్ద చోటు! ఇల్లు, వాకిలి, తోట, పొలాలూ అంటూ ఎంత ఆస్తి! ఆ ఇంటికి  కోడలుగా వెళ్ళటం కూతురు అశ్వినీ అదృష్టం కాదా...?’

నా కొడుకుకు ఇది రెండవ పెళ్ళి. నీకు అంతా తెలుసు కదా వెంకటాద్రి... అంటున్న ఆయనకి అడ్డుపడ్డాడు వెంకటాద్రి.

ఎందుకు పాత కథలన్నీ ఇప్పుడు ఎత్తుతారు?  అమ్మాయ్ అశ్వినీ! బయటకు వచ్చి పెద్ద వాళ్ళకు నమస్కరించుకో...

కాళ్ళ గొలుసు శబ్ధంతో వచ్చింది అశ్వినీ.

వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కరించింది.

మీ తాహతుకు సరిసమంగా నేను చెయ్యలేకపోయినా ఏదో, పది కాసుల బంగారం వేసి...

ఇలా చూడు వెంకటాద్రి అదంతా మాట్లాడటానికి నేను ఇక్కడకు రాలేదు. పిల్లను అడగటానికి మాత్రమే వచ్చాను. అశ్వినీ మా ఇంటికి కోడలు పిల్లగా రావటం లేదు...కూతురుగా వస్తోంది...చేసేదీ, చెయ్యలేనిదీ అంతా నీ ఇష్టం! 

వైశాక మాసం పెళ్ళి. పెళ్ళి  బ్రహ్మాండంగా నేనే చేయిస్తా...మన రెండు ఊర్ల జనం వస్తే చాలు. వాళ్ళే మనకు సొంతవాళ్ళు!

ఆకాశమంత పందిరి వేసి చెప్పినట్టు పెళ్ళి జరిపించారు.

పెళ్ళివారి స్వాగతం, పెళ్ళి, మొదటి రాత్రి అన్నీ బద్రయ్యే చూసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర అశ్వినీ నా కూతురు...!అని గర్వంగా చెప్పుకున్నారు.

ఆయన అలా అనుకుంటుంటే, ఇంట్లోకి కుడికాలు ఎత్తి పెట్టి లోపలకు వచ్చిన అశ్వినీ వేరే విధంగా ఆలోచించింది. ఆ రోజు శోభనం గదిలో భర్తను బాగా సంతోష పరిచిన అశ్వినీ, తరువాత మెల్లగా అతన్ని హత్తుకుంటూ అడిగింది.

ఏమండీ, మనిద్దరం వేరు కాపురం వెళదామా...?”

ఛీఛీ...నీకు ఎందుకు ఇలాంటి ఆలొచన వస్తోంది...?”

అది కాదండీ...ఆ మామిడి తోటలో ఉన్న ఇల్లు ఖాలీగానే కదా ఉంది...

మామిడి కాయ సీజన్లో మూటలు మూటలుగా మామిడి కాయలూ, కొబ్బరి కాయలూ పడేసే ఇల్లు అది...

మనం అక్కడికి వెళ్ళిపోదాం...లేకపోతే మీ అమ్మా-నాన్నలను అక్కడికి పంపేయండి...

అలాగంతా మాట్లాడకు అశ్వినీ. అమ్మా--నాన్నలను వదిలి నేను ఉండలేను.  మనల్ని వదిల్తే వాళ్ళకీ ఎవరూ లేరు…

అది కాదండీ...మనం కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళం. కొన్ని రోజులు వేరుగా సంతోషంగా ఉండవచ్చు కదా?”

ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండొచ్చు! మన సంతోషానికి ఎవరూ అడ్డురారు...

మీరు అలా అనుకుంటున్నారు...అడ్డు వచ్చారు కాబట్టే మీ మొదటి భార్య పారిపోయింది...

ఆమె వెళ్ళటానికి కారణం వేరే కథ ఉంది అశ్వినీ...అదెందుకు ఇప్పుడు లాగుతావు...?”

పొండి...మీకు అర్ధమే కావటం లేదు!

గబుక్కున పక్కకు తిరిగి అతనికి వీపు చూపిస్తూ పడుకున్న ఆమె మోహం కోపంతో ఎర్రబడింది.

*************************************************PART-2********************************************

అశ్వినీ వచ్చి దగ్గర దగ్గర ఒక నెల రోజులకు పైన అయిపోయింది. కానీ సరోజినీనే తెల్లవారు జామున లేచి వాకిలి ఊడ్చి, నీళ్ళు జల్లి, ముగ్గు వేస్తోంది.

స్నానం చేయటానికి చిన్న బిందెతో నీళ్ళు తెచ్చుకుని స్టవ్వు మీద పెట్టి వెలిగించింది. స్నానం చేసి, దేవుడికి దన్నం పెట్టుకుని టిఫిన్ తయారు చేసింది.

ఏం సరోజినీ...ఇంకా ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావా...? అశ్వినీని లెమ్మని చెప్పి అలవాటు చెయచ్చు కదా...?”

ఉండనివ్వండి. కొత్త దంపతులు. సంతోషంగా ఉండనివ్వండి. మనకు గిరీ యొక్క జీవితం ముఖ్యమండి...

అంతకుపైన బద్రయ్యా ఏమీ మాట్లాడలేదు. ఇదంతా ఆడవాళ్ళ విషయంఅనుకుని మాట్లాడకుండా ఉండిపోయారు.

వాటన్నిటినీ తనకు అనుకూలం చేసుకుంది అశ్వినీ. గిరీ తననే చుట్టి చుట్టి వస్తూ ఉండటం ఆమెకు మరింత బలం చేకూర్చింది. ఇవన్నీ పెట్టుకుని మెల్లమెల్లగా అతన్ని తనవైపుకు లాక్కునే ప్రయత్నంతో అటువైపుగా ఒక్కొక్క అడుగు వేస్తున్నది.

ఏమండీ...నేనొచ్చి ఒక నెల రోజులు అవుతోంది...మా ఇంటికి వెళ్ళి ఒక నాలుగు రోజులు ఉండొస్తానండీ...

నాలుగు రోజులా...! అమ్మో...! నువ్వు లేకుండా నేను ఉండలేనే... అన్నాడు అతను.

ఇన్ని సంవత్సరాలు నేనా మీతో ఉన్నాను! ఇప్పుడే కదా వచ్చాను...?”

వచ్చాశావు కదా...ఇక వెళ్ళటం కుదరదు... అని నవ్వాడు అతను.

మీ నాన్నా--అమ్మ ఇరవై నాలుగు గంటలూ మీతోనే ఉంటున్నారు...నాకూ మా నాన్నను--అమ్మనూ చూడాలని అనిపించదా...?”

రా...తీసుకు వెళ్తాను...చూడు...మాట్లాడు...రోజంతా ఉండు...రాత్రికి తిరిగి వచ్చేద్దాం!

తీసుకు వెళ్ళాడు.

ఒక గంటసేపటి కంటే ఎక్కువ సేపు అక్కడ కూర్చోలేక పోయాడు. చిన్న పెంకుటిల్లు...ఒక చిన్న హాలు, ఒక బెడ్ రూము, ఒక వంట గది...అంతే.

అక్కడ రాత్రి పూట ఉండలేమని చెప్పి ఆమెను పిలుచుకుని ఇంటికి వచ్చి చేరాడు.

ఏరా...ఇలా ప్రొద్దు గూకిన తరువాత వస్తున్నారు ...కొంచం ముందు రాకూడదా...?”

ఏం...మా అమ్మగారింటి దగ్గర కాసేపు ఉండి రావటం మీకు నచ్చలేదా?” -- చటుక్కున అడిగింది అశ్వినీ.

దానికి కాదమ్మా... అంటూ సాగదీసిన సరోజినీ రాత్రి సమయం...పురుగు పుట్రా, పాములూ, చెడుగాలి...

మాకూ అన్నీ తెలుసు. మేమూ గ్రామంలో పుట్టిన వాళ్ళమే...నేను మీ అబ్బాయితో బయటకు వెళ్ళటం మీకు నచ్చలేదు...

అయ్యో...అలాగంతా లేదమ్మా అశ్వినీ...నువ్వు తప్పుగా అర్ధం చేసుకున్నావు... అన్న తల్లిని విసుగ్గా చూసాడు గిరీ.

సరే. వదులమ్మా...అదేం తప్పుగా చెప్పలేదే ఇప్పుడు...చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తావు...? అది కూడా గ్రామంలో పుట్టి పెరిగిన అమ్మాయే కదా...దానికి తెలియదా...?”

సరేరా... అంటూ లోపలకు వెళ్ళిపోయిన సరోజినీ, ఆ రోజు భర్త బద్రయ్యా దగ్గర విషయం చెప్పి, “నేనేమీ తప్పుగా మాట్లాడలేదండీఅన్నది.

లేదు సరోజినీ...వాళ్ళు పెద్ద పిల్లలు...తెలిసిందా...? ఇక అనవసరంగా వాళ్ళ విషయంలో నువ్వు తల దూర్చకు...

సరేనండీ... అన్నదే తప్ప, మామూలు విషయాలలో అశ్వినీతో మాట్లాడే అవసరం ఏర్పడుతోంది.

ఈ రోజు ఏం చేశారు అత్తయ్యా...?”

మినపట్టు...అల్లం పచ్చడి...

పచ్చడా...? అట్టుకు మా ఇంట్లో చేపల పులుసే పెడతారు...

ఈ రోజు మంగళవారం. ఆంజనేయస్వామి రోజు...నీచు చేయకూడదు!

మా ఇంట్లో అవేమీ చూడం. అన్ని రోజులు నీచు ఉంటుంది...

మేము చూస్తాము. మంగళవారం, శుక్రవారం, క్రితిక, అమావాస్య, షష్టి అన్ని రోజులూ శాకాహారమే!

అది విని భర్త దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది అశ్వినీ.

ఆమె వచ్చిన వేగం చూసి కలవరపడ్డాడు గిరీ.

ఏమిటి అశ్వినీ...?”

ఈ ఇంట్లో నోటికి రుచిగా తినటం కూడా కుదరదు లాగుందే, వయసైన వారికీ, వయసులో ఉన్నవారికీ కలిసుండటం కుదరదండీ అంటే వింటున్నారా...? వేరుగా వెళ్దాం అని అరుస్తున్నానే, మీ చెవిలో పడటం లేదా...?”

ఇప్పుడేమైంది అశ్వినీ...?”

మంగళ, శుక్ర, శని, కృతిక, అమావాస్య, షష్టి వారం మొత్తం శాకాహారమేనట...

సరే...మిగిలిన రోజులు ఉన్నాయి కదా...ఆ రోజు నీకు కావలసింది వండు...తిందాం...

మీ అమ్మ వంట గదిని ఎందుకు వదిలిపెడుతుంది...? వదిలిపెడితేనే కదా నేను వంట చేయటానికి...? నేనెప్పుడు కొనేది...ఎప్పుడు వండేది...?”

పరిస్థితి అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావు అశ్వినీ...ఇల్లూ, వాకిలి, పొలం, తోటలు అన్నీ నాన్న పేరు మీద ఉన్నాయి...వచ్చే డబ్బు అటే వెళుతోంది...అన్నీ నా చేతులలోకి వచ్చేంతవరకు నేను ఏమీ చెయ్యలేను...నాకని డబ్బూ దస్కం లేనప్పుడు ఏం కొని పడేయగలను? నువ్వేం వంట చేస్తావు? ఇక్కడుంటే వంట మొత్తం వాళ్ళే చూసుకుంటారు...

అంతే కదా...వదలండి...దానికీ ఒకదారి ఏర్పాటు చేస్తాను...

ఏం చెయ్యబోతావు...?”

వెంటనే చెప్పగలనా...? ఆలొచించాలి కదా...?”

ఏం ఆలొచించబోతావు...?”

చెబుతాను!

*************************************************PART-3********************************************

ఊర్లో ఉత్సవాలు వచ్చింది.

అమ్మవారి గుడి అలంకరించబడ్డది. మైకు, లౌడ్ స్పీకర్, దేవుడి పాటలతో ఊరంతా ఉత్సాహంగా ఉంది. బద్రయ్యే దగ్గరుండి అన్ని యేర్పాట్లు చేస్తున్నారు.

అమ్మవారిని వెండి కవచాలతో అలంకరించి రధంలో ఉంచి ఊరేగింపుగా తీసుకు రావటం అలవాటు.  ఆ రోజు రాత్రి నుండి ప్రొద్దుటి వరకు నాటకాలూ, నాట్యాలూ ఏర్పాటు చేయబడ్డాయి. ఊరి యుక్త వయసు యువకులు గిరీని కలుసుకున్నారు.

ఈ సారి పురాణాల నాటకం, నాట్యం వద్దన్నా...నవీన నాటకం, నాట్యం ఏర్పాటు చేద్దాం!

నాన్న ఏం చెబుతారో...?’ సందేహించాడు గిరీ.

వాళ్ళ సంభాషణను వింటూ వస్తున్న అశ్వినీ, “నాన్న ఏమిటండీ చెప్పేది..? ఇంకా ఎన్ని రోజులకు ఆయనే నాయకత్వం తీసుకుని జరుపుతారు...ఇకమీదట మీ నాయకత్వంలో జరగాలి. కొంచం కొంచంగా మీరు అన్ని విషయాలలోనూ లోపలకు దూరాలి...ఎంత కాలం వరకూ ఇలాగే ఉండబోతారు మీరు...?”

అలా అడగండి వదినా...మీరు చెప్పేదే కరెక్ట్!

మీరు వెళ్ళండి తమ్ముళ్ళూ...ఈ సారి నవీన నాటకం వేస్తారు!

చాలా థ్యాంక్స్ వదినా...మేమొస్తాం వదినా...

వాళ్ళు వెళ్ళిన వెంటనే కలవరపడుతూ భార్యను అడిగాడు గిరీ.

ఏం చెయ్యబోతావు అశ్వినీ...?”

నాతో రండి

ఎక్కడికి?”

మీ నాన్న దగ్గరకు...

దేనికీ?”

మాట్లాడటానికి

ఏం మాట్లాడబోతావు...?”

వచ్చి వినండి!

వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన భోజనం చేస్తున్నారు.

మామయ్యా...

ఏమ్మా...నన్ను మామయ్య అని పిలవకు! నాన్నా అని పిలువు అని ఎన్నిసార్లుచెప్పను...?”

నాన్నా అని రానంటోంది...మామయ్యా అనే వస్తోంది…

అలాగంటే...నువ్వు నన్ను నాన్నగా అనుకోవటంలేదు...మామయ్యగానే అనుకుంటున్నావు...

కన్న తండ్రినే నాన్నా అని పిలవగలం...మిమ్మల్ని ఎలా...?”

ఒక్క క్షణం ఆలొచనలో పడిపోయారు.

మనసులో దెబ్బతిన్నట్టు నొప్పి అనిపించింది. క్షణంలోనే తేరుకున్నారు.

సరే...పరవాలేదమ్మా...వదులు. ఇప్పుడెందుకు పిలిచావు...?”

ఈ సంవత్సరం ఉత్సవాలలో బుర్రకథ, పురాణ నాటకాలూ వద్దనీ, నవీన నాటకాలు, నాట్యాలూ కావాలని అందరూ ఆశపడుతున్నారు మామయ్యా...

అందరూ అంటే ఎవరమ్మా?”

మీ కొడుకు కూడా మామయ్యా...

ఒక్క క్షణం మౌనం వహించిన తరువాత చెప్పారు.

సరేనమ్మా...ఇష్టమైనట్టే చేయండి...మా కాలం అంతా ముగిసిపోయింది...ఇక మీ కాలమే...మీకు నచ్చినట్టే జరగనీ!

ప్రతి సంవత్సరం ఆయనే నాటకం వేసే వాళ్ళనూ, నాట్య మండలి వాళ్ళనూ పక్క ఊర్లో నుండి రమ్మని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి పంపుతారు. ఈ సారి గిరీ దగ్గర డబ్బులిచ్చారు.

నువ్వే మాట్లాడి ముగించరా గిరీ. మీ మనసుకు నచ్చిన నాటకం, నాట్యాం పెట్టుకోండి...

                                                                       ************************

అమ్మావారు ఊరేగింపు వచ్చే రోజు ప్రొద్దున సరోజినీను పిలిచారు. తడి చేతులను చీర కొంగుకు తుడుచుకుంటూ ఏమిటండీ...?” అంటూ వచ్చి నిలబడింది.

ఈ రోజు మంచి రోజు...లోపల పెట్టున్న పూర్వీక నగలన్నీ తీసి అశ్వినీకి ఇచ్చేద్దామా? ఇంకా నువ్వు వేసుకోబోతావా ఏమిటి...?”

అవన్నీ వేసుకునే వయసా నాది...? ఇక అవన్నీ ఉంచుకుని నేనేం చేసుకుంటాను...? ఇచ్చేయండి

బీరువా తెరిచి అన్ని నగలూ తీసింది.

అశ్వినీ...ఇటురామ్మా...

సమాధానమేమీ ఇవ్వకుండా ఒక్క నిమిషం తరువాత వచ్చి నిలబడింది అశ్వినీ.

ఇవిగో సరోజినీ...నీ చేతులతో నువ్వే ఇవ్వు...

మీరే ఇవ్వండి... అన్నది సరోజినీ.

ఇదిగోమ్మా... అంటూ జాపారు.

ఏమిటిది...?”

తీసుకుని తెరిచి చూడు!

తీసుకుని తెరిచి చూసింది. మొహం వికసించింది.

అన్నీ ఆ రోజుల నాటి నగలు!

ఆయన బీరువా తెరిచి అందులో ఒక పక్కగా ఉన్న ఒక చెక్కపెట్టెను తెరిచి లోపలున్న వెండి పాత్రలను చూపించారు.

ఇవన్నీ నీకేనమ్మా...ఈ ఇల్లు, తోట, పొలం అన్నీ నీకే, గిరీని వదిలితే మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు...?”

అశ్వినీ మొహంలో సూర్యకాంతి లాంటి ప్రకాశం కనబడింది...తరువాత మెల్లగా బిడయపడుతూ మా...మ.. అని సాగదీసింది.

చెప్పమ్మా...?”

మీ అబ్బాయి సొంతంగా ఒక వ్యాపారం మొదలుపెట్టాలని ఆశపడుతున్నారు...

ఏం వ్యాపారం...?”

ఏదో వస్తువులు తయారు చేసే కంపెనీయట...

ఎందుకమ్మా అదంతా...? మనకు తెలియని విషయంలో కాలు పెట్టకూడదమ్మా...వంసపారంపర్యంగా మనం వ్యవసాయులమమ్మా మనం...

అప్పుడైతే మీరు ఆయన్ని ఎందుకు చదివించారు...చదువుకున్నందువలనే కదా ఆశపడుతున్నారు...

అదీ కరెక్టే! దానికి ఏం కావాలట?”

బ్యాంకుకు సెక్యూరిటీ ఇవ్వాలట!

అంతే కదా? తరువాత ఇవ్వబోయే నా ఆస్తిని వాడికి ఇప్పుడే ఇచ్చేస్తాను. రేపే ఆస్తీ మొత్తాన్నీ వాడి పేరుకు మార్చేస్తాను!

                                                                             *********************************

మరుసటి రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో దరఖాస్తు ఇచ్చి ఇంటికి వచ్చిన తరువాత, గిరీ సంకోచపడ్డాడు.

ఇప్పుడెందుకు నాన్నా దీనికంత అవసరం?”

ఏదో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావట. దానికి కావలసిన పెట్టుబడికోసం బ్యాంకుకు సెక్యూరిటీ ఇవ్వాలని అశ్వినీ చెప్పింది? మా తదనంతరం ఈ ఆస్తంతా నీకేకదా వస్తుంది. దాన్ని ఇప్పుడే నీకు రాసిచ్చేస్తాను. నీకు, నీ వ్యాపారానికీ ఉపయోగపడుతుంది

అయినా నాన్నా...

ఏమండీ...?” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ సంభాషణలో తల దూర్చింది అశ్వినీ.

మామయ్య ఎంతో ఆశతో ఇప్పుడే ఇస్తున్నారు...అదెందుకు మీరు వద్దంటున్నారు? మామయ్య చెప్పినట్టు తరువాత చేరవలసింది ముందే ఇస్తున్నారు...అంతే కదా...?”

దానిక్కాదు అశ్వినీ, వాళ్లకూ ఏమీ ఉంచుకోకుండా ఆస్తి మొత్తాన్నీ...

రండి లోపలకు వెళ్ళి మాట్లాడదాం. మామయ్య బయలుదేరుతున్నారు చూడండి…

అతని చెయ్యి పుచ్చుకుని, బెడ్ రూముకు తీసుకు వచ్చింది. మంచం మీద కూర్చోబెట్టి తాను నిలబడి అతని మొహాన్ని తనవైపుకు తిప్పి తన హృదయానికి హత్తుకుంది. మొహాన్ని కొంచంగా లాక్కుని అశ్వినీ..?”

ఏమిటండీ... అంటూ తన పెదాలను, అతని పెదాలపై ఆనించి అతన్ని మంచంలోకి తోసింది.

ఏంతో కష్టపడి అన్నిటినీ మీ పేరుకు మార్చటానికి ఏర్పాటు చేసాను...అది అర్ధం చేసుకోకుండా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు...?”

అది కాదు అశ్వినీ…

మాట్లాడకండీ...మాట్లాడకండీ...మాట్లాడాల్సిన సమయం కాదు ఇది...?”

అరగంట సేపు తరువాత చాలా సంతోషంగానూ, తృప్తితోనూ లేచాడు.

నువ్వు చాలా చిలిపిదానివి

మీరు మాత్రం తక్కువా ఏంటీ...? చూడటానికి పిల్లిలా ఉన్నారు. కానీ మీరు పులి...

అతను నవ్వాడు.

ఆమె కూడా నవ్వింది.

తలవెంట్రుకలన్నీ చెదిరిపోయున్నాయి. తల దువ్వుకుని వెళ్లండి...బయట మీ అమ్మ ఉన్నది. చూస్తే ఆమె కడుపు మండిపోతుంది...

ఛీఛీ...అమ్మ అలాంటిది కాదు...

మీకేం తెలుసు? మీకు తెలిసినదంతా తెల్లవన్నీ పాలు...

*************************************************PART-4********************************************

రిజిస్ట్రేషన్ పూర్తి అయి పొలం, ఇల్లు, తోట అన్నీ చేతులు మారిన తరువాత అశ్వినీ పూర్తిగా మారిపోయింది. మామూలు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసింది. ప్రతి రోజూ సమస్య...ఒక్కొక్కటిగా తలెత్తింది.

ఏమ్మా అశ్వినీ...చెబు నిండుగా పాలు ఉంచాను...దేనికైనా వాడేవా...?”

ఏం, నేనేమన్నా పాలను కళ్ళతోనే చూడని ఫ్యామిలీలో నుండి వచ్చానా...?  దొంగతనంగా పాలు తాగాల్సిన కర్మ నాకేం పట్టలేదు...? మేము కూడా పాడీ పంటా ఉండి బాగా బ్రతికిన వాళ్ళమే...!

అయ్యో...నేను అలా చెప్పలేదమ్మా...

ఎలా చెప్పినా అర్ధం ఒకటే. మీరు మాట్లాడేదంతా నాకు అర్ధం కాదని అనుకుంటున్నారా...

అంత కంటే ఎక్కువ సరోజినీ మాట్లాడదలుచుకోలేదు. కానీ అశ్వినీ మాత్రం గొడవపడటం ఆపలేదు.

ఈ నాగమ్మ నన్ను గౌరవించటమే లేదు అత్తయ్యా. నేను ఏది చెప్పినా చెయ్యటం లేదు...

దానికి కూడా సరోజినీ జవాబు చెప్పలేదు.  

నాగమ్మను పిలిచి మందలించ లేదనే నేరం సరోజినీ మీద పడింది.

మీ అమ్మ మామూలు మనిషి కాదు. చాలా గర్వం ఉన్న మనిషి. ఈ వయసులో ఆవిడ ఇలా ఉందే...చిన్న వయసులో ఎలా ఉండుంటుందో...?”

సరే వదులు...వయసైన ఆవిడ. ఓపికలేక కొంచం అలా, ఇలా ఉంటుంది…

మీ అమ్మను ఏమన్నా అంటే నా నోరు మూసేస్తారే...అమ్మకు పకోడీలు కొనుక్కు రావటం, చిన్న పిల్లాడి లాగా ఆవిడ ఒడిలో తలపెట్టి పడుకోవటం...ఈ వయసులో ఇవన్నీ బాగున్నాయా...?”

ఏం, ఏమిటి తప్పు...? మా అమ్మ ఒడిలోనే కదా నేను పడుకుంటున్నాను…

దానికోసం నా ఒడి ఉంది కదా...?” కసురుకుంది అశ్వినీ.

అది చెవిన వేసుకోకుండా ముందుకు జరిగాడు.

ఈ అమ్మా-కొడుకుల బంధాన్ని ఎలా తెంపాలి అనే ఆలొచనతో ప్రతిరోజూ మునిగిపోయేది అశ్వినీ. గొడవ పెట్టుకోవటానికని ఆమె కోసమే ఏదో ఒక విషయం దొరికేది.

                                                                                          **********************

ఒక రోజు మంచి నూనెను కాచి ఒక గిన్నెలో పోసి తీసుకు వచ్చింది సరోజినీ.

నువ్వు నూనె రాసుకుని తల స్నానం చేసి చాలా రోజులు అయ్యింది గిరీ. కళ్ళు చూడు ఎలా పొంగినట్లు ఉన్నాయో...రా...వచ్చి కూర్చో...నూనె రాస్తాను…

ఇదిగో వస్తున్నా...

నడుముకు తుండు చుట్టుకుని వచ్చాడు. స్టూలు మీద కూర్చున్న కొడుక్కి ఎడం  చేత్తో గిన్నె తీసుకుని, కుడి చేతిలో వంచుకుని అందులో నూనె పోసుకుంది. గిరీ తల మీద చేతిలో ఉన్న నూనెను పోద్దాం అనుకునప్పుడు ఎక్కడ్నుంచో పరిగెత్తుకుంటూ వచ్చిన అశ్వినీ నూనెను తోసేసింది.

ఆశ్చర్యపోయిన సరోజినీ ఆమెను చూసింది.

ఇది మీకే సరి అనిపిస్తోందా...?”

ఏంటమ్మా...?”

ఇదంతా చేయటానికి నేనున్నాను కదా...? మిమ్మల్ని ఎవరు చెయ్యమని చెప్పింది...?”

ఎప్పుడూ వాడికి నేనేనమ్మా నూనె రాసేది...

నూనె రాయండి. అన్నం పెట్టండి. ఒడిలో పడుకోబెట్టుకోండి...అన్నీ మీరే చేస్తానన్నప్పుడు...పెళ్ళి ఎందుకు చేసారు...? అది కూడా మీరే చేసుకోనుండచ్చే!

ఒక్కసారిగా షాకయ్యింది సరోజినీ...అధిరి పడ్డది...ఒక్క క్షణం మాట్లాడటానికి నాలిక తిరగలేదు.

ఏం మాట్లాడుతున్నావు అశ్వినీ...?”

సరేమ్మా...వదులు...అన్నిటినీ పెద్దది చేయకు... అంటూ పరిస్థితిని చక్కబెట్టటానికి ప్రయత్నించాడు గిరీ.

రా అశ్వినీ...వచ్చి నువ్వే నూనె పెట్టు! తన భార్యనే పిలిచాడు.

దీన్ని మీరు మొదటే చేసుండాలి! అంటూ సరోజినీ చేతులో ఉన్న నూనె గిన్నెను గబుక్కున లాక్కుంది.

ఆ వేగంలో నూనె కదిలి గిన్నెలో నుండి నేలమీదకు ఒలికింది. ఏమీ మాట్లాడకుండా కన్నీళ్ళతో జరిగి వెళ్ళింది సరోజినీ. ఆ రోజంతా ఆమె ఏమీ  తినలేదు. బద్రయ్య దగ్గర కూడా ఏమీ చెప్పలేదు. ఒక వేల నేను చేసిందే తప్పా...? అధికప్రసింగి తనంతో నడుచుకున్నానో...?’ అని కూడా అనుకుంది.

బద్రయ్య లాగానే సరోజినీ కూడా అమయకురాలు. కుళ్లు కుతంత్రాలు లేని మనిషి. కొడుకు, కోడలూ ప్రేమగా ఉండటం చూసి ఆనందపడింది.  

ఏమండీ...చిన్న పిల్లలు...ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి...ఇప్పుడే నండీ మన గిరీ మొహాన నవ్వు చూస్తున్నా... అన్నది ఒక రోజు సరోజినీ ప్రారంభంలోనే.

అది చాలు సరోజినీ...ఇంకేం కావాలి మనకి...? వాడు సంతోషంగా ఉండాలనే  కదా మనం ఎదురు చూసింది...?”

అవునండీ...

వాళ్ళను నిలబెట్టి దిష్టి తీయి సరోజినీ...ఎవరి దిష్టైనా వాళ్ళకు తగలొచ్చు... అన్నారు.

ఒక రోజు కొడుకునూ, కోడల్నీ నిలబెట్టి దిష్టి తీసి మంటలో పడేసినప్పుడు అది బాగా చిటపటలాడింది.

ఎంత దిష్టి ఉందో చూడు అశ్వినీ...?”

కొత్తగా ఎవరొచ్చి మమ్మల్ని చూశారు...దిష్టి తగలటానికి...? రోజూ మీరే కదా మమ్మల్ని చూస్తున్నారు...మీ కళ్ళే పడుంటాయి!

ఇలాగే అశ్వినీ మొదట్లో ప్రారంభించింది. కానీ దాన్ని కూడా ఆ సరోజినీపెద్దగా పట్టించుకోలేదు. కానీ, పోను పోనూ ఒక్కొక్కటీ గొడవగా మారినై.

అశ్వినీ...భోజనానికి వస్తావామ్మా...?”

లేదు...మీరు తినండి...

ఎందుకమ్మా ఆకలితో ఉండటం? రా, వచ్చి కూర్చో...ఇద్దరం కలిసే తిందాం

ఆ రోజు రాత్రి గిరీ దగ్గర ఊదింది.

మీ అమ్మ ఎందుకు ఆమెతో తినమంటోందో తెలుసా...?”

అతను తెలియదన్నట్టు తల ఊపాడు.

నేను ఏం తింటున్నాను, ఎంత తింటున్నాను చూడటానికే...

ఛీఛీ...అలా ఉండదు! అమ్మ పనివాళ్ళు తినేటప్పుడు కూడా దారాళంగా ఉంటుంది...చాలు చాలు అంటున్న నాగమ్మకు మరో రెండు గరిటలు ఎక్కువే పెడుతుంది...

పని వాళ్ళకూ, నాగమ్మాకీ చేస్తుంది...కోడలుకు చేయదు

ఎందుకు అశ్వినీ అలా అనుకుంటావు...నేను చూసినంత వరకూ అమ్మ నీ దగ్గర ఆశగానే కదా ఉంటోంది...

అదంతా మీ కళ్ళ ముందు...మీకు తెలియదండీ...మీరు అమాయకులు! పసిపిల్లాడిలాగా! కానీ మీ అమ్మా, నాన్నా ఇద్దరూ ఈర్ష్య మనుషులు...

అది విని బెదిరిపోయాడు అతను.

ఏమిటి అశ్వినీ చెబుతున్నావు...?”

అవునండీ...ఇలా ఒక పిల్లాడ్ని మాత్రం కన్న వాళ్ళు అలాగే ఉంటారు! మేము కని ఇన్ని సంవత్సరాలు పెంచిన కొడుకును, నిన్న వచ్చిన కోడలు తన సొంతం అంటోందే అని మనసులో ఈర్ష్య పడతారు. కోపగించుకుంటారు. మూగవారిలాగా ఉంటూ కచ్చె తీర్చుకుంటారు...

కానీ...అమ్మ అలా కాదు అశ్వినీ! ఆమె అమాయకురాలు...నా మీద ప్రాణమే పెట్టుకుంది

ఆవిడ అమాయకురాలా-కాదా అనేది నాకు బాగా తెలుసు. మీ మీద ప్రాణం పెట్టుకున్నదని చెబుతున్నారు కదా...అదే వీటన్నిటికీ కారణం!

ఒక భార్య, తల్లి చోటును పట్టుకోవచ్చు. తల్లి లాగా నడుచుకోవచ్చు. కానీ, ఒక తల్లి ఎప్పుడూ భార్య అవలేదు! మొదట అది తెలుసుకోండి మీరు...

అతను ఆలొచించ సాగాడు.

ఆపైన మరికొన్ని విషయాలు చెప్పగా, చెప్పగా తాను చెప్పేదంతా నిజమేనని అతన్ని ఒకసారి నమ్మించింది.

ఇక నేనే వేరుగా తింటాను. నాకెవరూ భోజనం పెట్టక్కర్లేదు! మీ అమ్మతో చెప్పేయండి

వేరే దారి తెలియక చెప్పాడు.

అమ్మా... అశ్వినీ తానొక్కతే తింటుందట. మీరు ఆమెను వదిలేయండి...

ఏం నాయనా...?”

వదిలేయంటే వదిలేయమ్మా...ఎందుకూ, దేనికీ అని అడిగి నా ప్రాణం తీయకు?”

భార్య మీదున్న విసుగును తల్లి మీద చూపించాడు!

షాకైయ్యింది ఆ తల్లి.

సరే నాయనా...అదే తిననీ! నేను అన్నీ పెట్టేసి వెడతాను!

నువ్వు తీసి కూడా పెట్టక్కర్లేదు. అదే తీసుకుంటుంది...

ఆ రోజు పడిన గుంట కొంచం కొంచంగా చీలిక పడుతూ వచ్చింది.

                                                                              *******************************

అదే రోజు బాధపడుతూ విషయాన్ని భర్తతో చెప్పింది సరోజినీ.

నేను భోజనం కూడా తీసి పెట్టక్కర్లేదని చెప్పాడు గిరీ

సరే వదిలేయి సరోజినీ...వాళ్ళే పెట్టుకుని భోజనం చేయనీ...కొత్త దంపతులు. కబుర్లు చెప్పుకుంటూ తింటారు. నీ ఎదురుగా అలా కుదురుతుందా? నువ్వుగా అర్ధం చేసుకోవాలి!

వాడెక్కడండీ భార్యతో కలిసి తింటున్నాడు? మీరు వేరుగా, వాడు వేరుగా కదా తింటున్నారు. రోజూ నేనూ, అశ్వినీ నే కదా కలిసి తింటున్నాము

ఇదిగో చూడు సరోజినీ...ఊరికే తప్పులు కనిబెడుతూ కూర్చోకు. కుటుంబ కలయిక చెడిపోతుంది.

మనసు అద్దం లాంటిది! మనం ఎలాగున్నామో అదే కనబడుతుంది...నీకు ధర్మ రాజు, ధుర్యోధనుడి కథ తెలుసుకదా...? ధర్మరాజు ఊరంతా తిరిగి చూసి రాజ్యం మొత్తం మంచి వాళ్లే ఉన్నారని చెప్పాడు...కానీ, ధుర్యోధనుడు తిరిగి చూసొచ్చి రాజ్యం పూర్తిగా చెడ్డవారే ఉన్నారని చెప్పాడు.

దీనివల్ల ఏం తెలుస్తోంది...? ఎవరు ఏ చూపులతో చూస్తారో, వాళ్ళకు అలాగే అర్ధమవుతుంది కదా? నువ్వు మంచిగానే చూడు సరోజినీ...మంచే జరుగుతుంది! ప్రశాంతంగా జీవించటం చాలా ముఖ్యం సరోజినీ! ఆ ప్రశాంతత దొరుకుతుందంటే ఏదైనా వదిలి పెట్టవచ్చు! వదిలిపెట్టి వెళ్ళు!

సరే నండీ అని చెప్పింది సరోజినీ.

ఆ తరువాత ఆమె మౌనంగానే ఉన్నది. ఒంటరిగానే భొజనం చేసింది.

ఇలా చూడండి...మీ అమ్మగారు మజ్జిగ ఎలా ఉంచారో? వాళ్ళిద్దరూ తినేసిన తరువాత మనకు నీళ్ళు పోసి ఉంచుతున్నారు...

మరుసటి రోజు అతను తల్లితో చెప్పాడు.

అమ్మా...మజ్జిగ చాలా నీళ్ళగా ఉన్నాయి. కొంచం బాగా ఉంచమ్మా!

ఒకే మజ్జిగేరా గిరీ. నేను, మీ నాన్న పోసుకున్న తరువాత మిగిలినది అలాగే ఉంచుతున్నారా?”

ఇక మీదట మేము మొదట తింటాము. మిగిలింది మీకు ఉంచుతాము. మీరిద్దరూ తరువాత భోజనం చేయండి! మధ్యలో దూరి చెప్పింది అశ్వినీ!

సరేనమ్మా...మేము తరువాత తింటాము!

మరుసటి రోజు నుండి సరోజినీకీ, బద్రయ్యకీ సాయంత్రం నాలుగింటి  తరువాతే భోజనం దొరికింది. ప్రొద్దున ఎనిమిదింటికల్లా నాలుగు ఇడ్లీలు తినేసి...నడిచే పొలాలన్నీ తిరిగి, పని చూసుకుని మధ్యాహ్నం రెండు గంటల సమయంలోనే ఇంటికి వచ్చే బద్రయ్యకి ఆకలి పొట్టను వేధిస్తుంది.

బాగా ఆకలేస్తోంది సరోజినీ...

వాళ్ళిద్దరూ ఇంకా భోజనం చెయ్యలేదు. భోజనం చేసి వెళ్ళనివ్వండి...తరువాతే కదా మనకి భోజనం. ఇదుగోండి...కొంచం మంచి నీళ్ళు తాగండి...

ఒక చెంబుడు నీళ్ళు గడగడమని కడుపులోకి వెళుతోంది...ఖాలీ కడుపులోకి దిగుతున్న నీళ్ళు గబగబమని ఆకలి కోరికను చల్లబరచింది.

వాళ్ళు తిన్న తరువాత పిలు! నేను కొంచం సేపు నడుం వాలుస్తాను

ఆ రోజు వాళ్ళు భోజనం చేసి ముగించటానికి సాయంత్రం ఐదు గంటలు అయ్యింది. తినేసి, భోజనం చేసిన కంచాలను, గ్లాసులనూ అలాగే ఉంచేసి వెళ్ళిపోయింది అశ్వినీ. అది చూసిన సరోజినీకి మొట్టమొదటి సారిగా చిన్నగా కోపం తొంగి చూసింది.

ఏమిటండీ ఈ అమ్మాయి ఇలా చేస్తోంది...? భోజనం చేసిన చోటును శుభ్రం చేయాలని తెలియదూ?”

సరే వదులు...మనం తిన్న తరువాత ఒకేసారి శుభ్రం చేసుకుందాం...!

ఇలా వదులుకుంటూ వెలితే ఎలాగండీ...?”

వదులు వదులు...అన్నిటికీ ముగింపు ఉంటుంది...ఓర్పును మటుకు పోగొట్టుకోకు!

ఆ రోజు రాత్రి ఓర్చుకోలేక గిరే చెప్పాడు.

మనం కొంచం పెందరాలే భోజనం చేద్దామే అశ్వినీ! వయసైన వాళ్ళు...ఎక్కువ సేపు ఆకలి తట్టుకోలేరు...

ఏమండీ...ఆకలేసినప్పుడే కదా భోజనం చేయగలం...? వాళ్ళ కోసం త్వరగా తినగలమా? ఇలాంటి విషయాలలోనే మనకీ, వయసైన వాళ్ళకూ సెట్ అవదు...! మనం వేరుగా వెళ్ళిపోదాం. లేకపోతే వాళ్ళను వేరుగా పెడదామని చెప్పాను...

అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావు అశ్వినీ...నిన్న ఒక కేసులో జడ్జ్ ఏం  తీర్పు చెప్పారో తెలుసా...? వయసైన అమ్మా-నాన్నలను వదిలి వేరు కాపురం వెళ్దామని పట్టుదల పట్టె భార్యకు భర్త విడాకులు ఇవ్వచ్చు!

విడాకులు ఇవ్వాలనుకుంటున్న మనిషిని చూడు... అంటూ హేలన చేస్తూ అతన్ని తనతో చేర్చుకుని హత్తుకుంది అశ్వినీ.

జడ్జీ తీర్పే కదా చెప్పారు...కానీ, కొత్తగా పెళ్ళి అయిన యువతుల వైపు చట్టమే ఉన్నదే!

ఏం చట్టం?”

పెళ్ళి అయిన ఏడు సంవత్సరాల లోపు ఆ అమ్మాయికి విపరీతంగా ఏదైనా జరిగిందంటే పోలీసులు మొదట ఖైదు చేసేది మామగారినీ, అత్తగారినీనే

ఏయ్ ఫూల్! ఇవన్నీ కూడానా తెలిసిపెట్టుకున్నావు...?”

ఏమండీ, మీరు జడ్జీగారు చెప్పిన తీర్పును తెలిసిపెట్టుకోలేదా...? అదేలాగానే నేనూ...

నేను పేపర్ చదువుతున్నాను. టీ.వీ చూస్తున్నా

నేను కూడా రెండూ చూస్తున్నాను

అవునవును...నువ్వు ఇంటర్ పాసయ్యావు. మరిచిపోయాను. ఇప్పుడు నిద్ర పోదామా?”

ఊహూ...నిద్ర తరువాత. మొదట ఇదే!

అతని మొహాన్ని లాగి తన హృదయానికి హత్తుకుంది.

కావాలా?”

మీకు వద్దా...?”

దొంగా...ఇరవై నాలుగు గంటలైనా నాకు ఓకేనేనే...

తెల్లారిందే తెలియలేదు ఇద్దరికీ.

*************************************************PART-5********************************************

ఒక రోజు భోజనం సాయంత్రం ఐదు గంటల సమయానికి దొరికింది. బద్రయ్యకీ, సరోజినీకి. ఎప్పుడూ లాగానే ఈ రోజు కూడా అశ్వినీ దంపతులు భోజనం చేసిన తరువాత, భోజనం చేసిన చోటు చిందరవందరగా ఉన్నది. అది చూసిన సరోజినీ మొదట సారిగా కొంచం స్వరం పెంచింది.

ఏమ్మా అశ్వినీ...ఇదేమన్నా హోటలా...? భోజనం చేసేసి, లేచెల్లి చేతులు కడుక్కోవటానికి...? భోజనం చేసిన తరువాత గెన్నెలన్నీ తీసి వంటింట్లో పెట్టి మూత మూసి ఉంచాలి కదా. తిన్న చోట్లోనే గిన్నెలూ, కంచాలు ఉంచేసి, శుభ్రం చేయకుండా పోయావు...?”

దానికొసమే కాచుకోనున్న దానిలా లిస్టు తెరిచి భూతం లాగా బయటపడ్డది  అశ్వినీ.

ఏయ్...ముసలీ...నేనూ చూస్తూనే ఉన్నాను...రాను రాను పూనకం వచ్చినదానిలా ఊగుతున్నావు...? ఏమనుకుంటున్నావు నీ మనసులో...? నన్ను ఇంట్లోంచి తరిమేయాలని నిర్ణయించుకున్నావా...? నువ్వు పెద్ద రాక్షస ముసలి! మనసంతా విషం! హృదయమంతా కక్ష! మాటలో మాత్రం పంచదార పూసినట్టు మాట్లాడుతున్నావు...?”

నిర్ఘాంతపోయింది సరోజినీ.

అశ్వినీ...నేను ఇప్పుడు ఏం చెప్పానని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు...?”

ఏయ్ ముసలీ! నువ్వు నన్ను అనాల్సింది ఇంకా ఏమన్నా మిగిలిపోయిందా...? అందరి దగ్గరా నా గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు...నాకని వచ్చి తగలడింది అన్నావట...నా జీవితాన్ని నాశనం చేయాలనే కదా నీ ఉద్దేశం...ఏమండీ...మీ అమ్మ మంచిది కాదండీ...రాక్షసి...ఎలాగైనా సరే మీ దగ్గర నుండి నన్ను విడదీయాలని అలమటిస్తోంది...మనం సంతోషంగా ఉండటం ముసలికి ఇష్టం లేదు...

మొట్టమొదటి సారిగా బద్రయ్య కూడా స్వరం పెంచారు అశ్వినీ! ఎమిటా పిచ్చి వాగుడు...? మంచి కుటుంబంలోని అమ్మాయిలాగానా మాట్లాడుతున్నావు...?”

రేయ్...ముసలోడా! అంటూ అసహ్యమైన మాటలతో అరిచింది.

అదివిని అలాగే కృంగిపోయారు బద్రయ్య.

నువ్వెందుకురా ఆడవాళ్ళ విషయంలో తల దూరుస్తున్నావు...? నీ మనసులో నూవేమనుకుంటున్నావురా...? నువ్వు డబ్బుగల వాడివి, నేను పేద ఇంటి దానిని అనే కదా ఇవన్నీ చేస్తున్నావు...?”

ఏయ్ అశ్వినీ...ఎందుకలా వెర్రి వాగుడు వాగుతున్నావు?”

చాలు. ఆపరా! నగలూ, డబ్బూ, మంచము, బీరువా, మోటార్ సైకిలు ఇవ్వలేదనేగా నన్ను ఇంత కష్టపెడుతున్నారు? కట్న కానుకలు, సారె సరిగ్గా ఇవ్వటానికి దిక్కులేదు...కాలి బూడిదైపో అని చెప్పావు కదా...? ఇదిగో నీ కళ్ళ ముందే కాలి బూడిదవుతారా దుర్మార్గుడా...చూసి సంతోషించు!

గబ గబమని ఆవేశంతో వంటింట్లోకి పరిగెత్తింది.

కరెంటు పోతే లాంతరు దీపంలో పోసి వెలిగించుకోవటానికని కొని పెట్టుకున్న కిరసనాయల్ క్యాన్ను తీసుకుని అలాగే తలంతా పోసుకుంది. వెలిగించుకోవటానికి అగ్గిపెట్టి వెతుకుతున్నప్పుడు బయటకు వెళ్ళున్న గిరీ లోపలకు పరిగెత్తుకు వచ్చాడు.

కంగారూ, ఆందోళనతో అయ్యయో... అశ్వినీ...వద్దు అశ్వినీ... అని అరుస్తూ ఆమె దగ్గరకు చేరుకున్నాడు.

లేదండీ...మీ అమ్మా, నాన్నలు మనల్ని జీవించటానికి వదలరండీ...మిమ్మల్నీ, నన్నూ వేరుచేయటానికి ప్లాన్ అంతా పూర్తి చేసారు...మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు అన్నారో తెలుసా...నన్ను చూసి కాలి బూడిదైపోవే పాపాత్మురాలాఅన్నారు...వాళ్ల దగ్గర ఉండటం కంటే చచ్చిపోవచ్చండి...వెళ్ళి చేరటమే మేలు...

ఉగ్ర రూపం దాల్చాడు గిరీ.

రాక్షసుల్లారా...? తల్లీ-తండ్రేనా మీరు...? దీనికోసమా నాకు పెళ్ళి చేసారు...? అది చెప్పినప్పుడల్లా నేను నమ్మలేదు...? ఆమె మాత్రమే కాదు, నేను కూడా వెళ్ళిపోతాను...ఇద్దరం వెళ్ళిపోతాం...మీరిద్దరూ సంతోషంగా జీవించండి...రా అశ్వినీ...నేనూ నీతో కలిసి కాలి బూడిదైపోతాను

గిరీ అరిచిన అరుపులకు ఊరు గుమికూడింది.

ఆడవాళ్ళు పరిగెత్తుకు వెళ్ళి వంటగదిలోకి దూరి అశ్వినీని లాకొచ్చారు.

వదలండి...నేను చచ్చిపోతాను...వాళ్ళిద్దరూ ఆశపడినట్టు నేను బూడిదైపోతాను... అంటూ చచ్చిపోవటానికి ప్రయత్నించింది.

ఇంతలో ఒకరు అశ్వినీ నాన్నకు ఫోనులో మాట్లాడి విషయం చెప్పారు. మరో అరగంటలో ఆయన పోలీసులతో ఇంట్లోకి చొరబడ్డారు. తండ్రినీ, పోలీసులనూ చూసిన అశ్వినీకి ఎక్కువ ధైర్యం రావటంతో పెద్ద స్వరంతో ఏడవటం  మొదలుపెట్టింది.

ఇలా చూడండి ఇన్‌స్పెక్టర్ సార్, మాకు పెళ్ళి జరిగి ఇంకా ఒక సంవత్సరం కూడా కాలేదు...అంతలోనే మామగారూ, అత్తగారూ పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు...నేను పేదింటి అమ్మాయిని. కట్న కానుకలు ఇచ్చే స్తోమత లేదు...దానికోసం ఇలాగా...?”

ఇంకా కొంచం ఆలస్యంగా నేను వచ్చుంటే నా భార్య కాలి బూడిద అయ్యుండేది సార్... అని గుండె బాదుకున్నాడు గిరీ.

బద్రయ్య, సరోజినీ ఇద్దరూ మతి చెలించిన వారిలాగా నిలబడున్నారు. మాట్లాడటానికి నోరు రాలేదు. వాళ్ళ వైపు న్యాయాన్ని ఎవరూ అడగలేదు.

చట్టం ఏం చెప్పిందో, అది చేసారు పోలీసులు.

బద్రయ్యనూ, సరోజినీనూ ఖైదు చేయబడినప్పుడు వారి కళ్ల నుండి ధారగా నీరు కారింది. పోలీసు జీపులో ఎక్కించి వాళ్ళను తీసుకు వెళుతున్నప్పుడు ఉరే బాధపడింది. వయసైన వారు గొడవ చేసారు.

మంచి మనుషులు...పాపం...ఈ వయసులో ఈ కష్టం రావాలా...?”

మంచి వాళ్ళకే ఎక్కువ పరీక్షలు, కష్టాలు వస్తాయి...

ఈ పోలీసులు, వాళ్ళ పక్కనున్న న్యాయాన్ని అడగనే అడగరా?”

అదంతా కోర్టులో అడుగుతారు...

కోర్టు, కేసూ అంటూ అదొక తిరుగుడా...?”

ఊరికే పెద్ద మనుషులు...వీళ్లకే ఈ గతి అంటే...మనమంతా ఏ మూలకు...?”

ఏం చేయగలం...? ఇలాంటి ఒక చట్టం ఉందట కదా...?”

ఈ చట్టాలను రూపొందించే ముందు, కొంచం కూడా ఆ చట్టంలోని రంధ్రాల గురించి ఆలొచించరా...?” వయసైన ముసలమ్మ మాట్లాడింది.

ఈ సారి చట్టం రాసేటప్పుడు నిన్ను అడగమని చెబుతాను అవ్వా యువతి ఒకత్తి చెప్పింది.

ఒకరికొకరు చెప్పుకుంటున్న అభిప్రాయాలను విని విననట్లు ఉన్నది అశ్వినీ.

మెల్లగా చీర కొంగుతో మొహం తుడుచుకుంటున్నప్పుడు విజయం సాధించిన గొప్ప ఆమె పెదాలపై చిన్న నవ్వుగా మార ఎవరూ చూడాకుండా మిక్కిలి రహస్యంగా బయటపడింది.

*************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)