మాతృ హృదయం...(కథ)

 

                                                                       మాతృ హృదయం                                                                                                                                                                 (కథ)

జీవితం యొక్క ఆరోగ్యం, నాణ్యత సాధించడానికి, కాపాడేందుకు లేదా తిరిగి కోలుకొనేందుకు వ్యక్తుల, కుటుంబాల, సంఘాల యొక్క సంరక్షణపై దృష్టి పెట్టే ఆరోగ్య సంరక్షణ రంగం ఒక వృత్తి. ఈ వృత్తిలో ఉన్న వారు రోగుల యొక్క సంపూర్ణ సంరక్షణకు బాధ్యత వహిస్తారు. ఇది రొగి యొక్క మానసిక, సామాజిక, అభివృద్ధి తో పాటూ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను చూసుకుంటుంది. ఒక్క మాతృ హృదయం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ రంగంలో గుర్తింపు తెచ్చుకోగలరు.

*****************************************************************************************************

కాలిలో చిన్న దెబ్బ తగిలి, ప్రైవేట్ ఆసుపత్రిలో అనుమతించబడ్డాడు కవిన్. తండ్రి పెద్ద బిజినెస్ మాగ్నెట్కాబట్టి, అప్పుడప్పుడు కొడుకును చెక్ చేయాలని డాక్టర్లకు ఆర్డర్ వేయబడింది.

అంతే కాకుండా, ఇరవై నాలుగు గంటలూ అతన్ని గమనిస్తూ ఉండటనికి నర్స్ నిర్మలాను నియమించారు.

బంగారు విగ్రహం లాగా ఉన్న ఆమె చాలా భవ్యంగా, శ్రద్దగా కవిన్ ని చూసుకుంటోంది. కానీ, అతనికే ఆమెను చూసిన మరు క్షణం మనసులో తప్పు ఆలొచన అగ్నిలాగా అంటుకుంది.

ఆమెను చూసినప్పుడు కొంటె నవ్వు, రెండు అర్ధాల మాటలూ లాంటివి ఉపయోగించాడు.

రోజు కూడా అలాగే... కవిన్ కు ట్యాబ్లెట్ ఇచ్చింది.

ఏయ్ నిర్మలా...

ఏమిటి సార్?”

నన్ను సార్ అని పిలవకు! కవిన్ అనే పిలువు. లేకపోతే బావా అని పిలు

నేను సార్ అనే పిలుస్తాను అన్న ఆమె చిన్నగా నవ్వింది.

సరే...నోరు తెరిచి చూపించండి. మాత్ర వేస్తాను

మాత్ర వేస్తున్నప్పుడు, కావాలనే ఆమె చేతులకు తన చేతులు తగిలేటట్టు చేతులను కదిలించాడు. మరు క్షణం ఆమె రెండు చేతులనూ పట్టుకున్నాడు. అతని పిడి నుండి తప్పించుకున్న ఆమె కాలు చూపించండి సార్...డ్రస్సింగ్ చేయాలిఅన్నది.

నిర్మలా....నువ్వు ముట్టుకుంటే నాకు నొప్పే తెలియటం లేదు. నీకొసం  ఆసుపత్రిలోనే ఉండిపోవాలని అనుకుంటున్నాను అన్న అతను గబుక్కున ఆమె చేయి పుచ్చుకుని లాగి ముద్దు పెట్టాడు.

అప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా చేయి విడిపించుకుని, “సార్...కొంచం నెమ్మదిగా ఉండండి. అటూ, ఇటూ కదలకండి. కాలు మీద వేసిన కుట్లు ఊడిపోతాయి. తరువాత ఐస్ వాటర్తాగకండి, వాతావరణానికి పడదు

అయితే ఏమిటీ? చలి జ్వరం వచ్చినా కౌగలించుకోవటానికి నువ్వు ఉన్నావే... అని కన్ను కొట్టి నవ్వాడు.

దానికి కూడా నిర్మలా ఏమీ చెప్పలేదు.

సడన్ గా రోజు సాయంత్రం కవిన్ కి జ్వరం వచ్చింది. మూలుగుతున్న అతన్ని డాక్టర్లు  పరీక్షించారు. ఇంజెక్షన్ వేసిన తరువాత మందూ, మాత్రలూ నిర్మలా దగ్గర ఇచ్చి, అతన్ని పక్కనే ఉండి చూసుకోమని చెప్పారు.

లేవటానికి కూడా ఓపిక లేకుండా ఉన్న కవిన్, బెడ్ లోనే మూత్ర విసర్జన చేశాడు. ఎటువంటి విసుగూ, విరక్తీ లేకుండా నిర్మలా అంతటినీ శుభ్రం చేసింది. అతని కళ్ళు చెమర్చినై.

మరుసటి రోజు ప్రొద్దున జ్వరం కొంచంగా తగ్గింది. మాత్ర ఇవ్వటానికి వచ్చిన ఆమె దగ్గర, అతని వాలకం పూర్తిగా మారిపోయింది.

నన్ను మన్నించండి నిర్మలా అన్నాడు బొంగురు పోయిన కఠంతో!

దేనికి సార్?”

నేను మిమ్మల్ని ఎంతో కష్ట పరిచాను. డబ్బు గర్వంతో లిమిట్స్ దాటి నడుచుకున్నాను. అవన్నీ సహించుకుని మీరు నిదానంగా ఉన్నారు!

మిమ్మల్ని నేను తప్పుగా అనుకోలేదు సార్. మీరు బాధపడకండి!

అన్ని కష్టాలు పెట్టినా...ఎటువంటి విసుగూ కనబరచకుండా నన్ను ఒక బిడ్డలాగా అనుకుని బెడ్ ను శుభ్రం చేసేరే! అది తలుచుకుంటుంటే...తల్లి లేని నాకు ఏడుపే వచ్చేసింది

నిజంగానే మీరు నాకు ఒక బిడ్డే సార్!"

ఏం చెబుతున్నావు నిర్మలా?”

నర్స్ ఉద్యోగమనేది దయ, మాత్రుత్వం కలిసున్నది. పేషంట్ ఎలా నడుచుకున్నా...మేము మానవత్వంతో నడుచుకోవాలి.

నా ఉద్యోగాన్ని నేను ఒక పవిత్రమైనదిగా అనుకుంటాను. పేషెంట్లందరూ నా బిడ్డల లాగా...బంధువుల లాగా అనుకుంటాను

చాల థ్యాంక్స్ అండి అని చెప్పిన అతనితో తల్లికి పిల్లాడు థ్యాంక్స్ చెప్పకూడదుఅంటూ దేవతలాగా నవ్వింది.

ఇప్పుడు అతని కళ్ళకు నిర్మలా కరుణ, దయ నిండిన తల్లిలాగా కనబడింది. అతని మనసులో వక్రం పోయింది....అభిమానం నిండి ఉన్నది.

**************************************************సమాప్తం*******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)