పోస్ట్‌లు

డిసెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

పిడుగు…(కథ)

                                                                               పిడుగు                                                                                                                                                           (కథ) పెద్ద వర్షం వస్తున్న సమయం ఇంటి వెనుక వైపున్న బావి గోడ దగ్గర ఆవుపేడను గుండ్రంగా చేసి , పరచి పడేసి వచ్చేయాలట. రాత్రి పిడుగులు పడుతున్నప్పుడు ' అర్జునా...అర్జునా ' అని చెప్పుకుంటూ కళ్ళుమూసుకుని ఉండాలట. తెల్లవారిన తరువాత చూస్తే ఆ పేడ బంతిలో పిడుగుపడి అది బంగారంగా మారి ఉంటుందట. ప్రశ్న ఒకటి , జవాబు ఒకటి...జరగాల్సింది ఒకటి , జరిగేది ఒకటి అని ఉన్నది. చల్లటి వర్షం ,   అందమైన మెరుపులు , మరణం అనే పిడుగు , ఇది ఎందుకు ? ********************************* ********************************* *********************************** చిన్న వయసులో చక్రవర్తికి ఎప్పుడూ అనుమానం. తెలుగు టీచర్ రఘునాద శాస్త్రి దగ్గర మాట మాటకీ అడుగుతాడు. "సార్...పిడుగు పడింది...పిడుగు పడిందని చెబుతున్నారే సార్...పిడుగు ఎలా ఉంటుంది సార్...లావుగా కొండరాయి లాగా ఉంటుందా సార