పోస్ట్‌లు

జులై 18, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్ముడుపోని విత్తనం...(కథ)

                                                                          అమ్ముడుపోని విత్తనం                                                                                                                                                            ( కథ ) రియల్ ఎస్టేట్ బిజినస్ చేస్తున్నాడు జనార్ధన్ . ఆ గ్రామం లోనే కాకుండా చుట్టుపక్కలున్న పది - పదిహేను గ్రామాలలో ఉన్న పొలాల -  స్థలాల రేట్ల పట్టీలో ఆరితేరిన మనిషి జనార్ధన్ . అమ్మటానికి రెడీగా లేని వాళ్ళను కూడా , డబ్బు ఆశ చూపించి వాళ్ళ స్థలాలనూ - పొలాలనూ అమ్మేటట్టు చేయగల ధీరుడు . ఆ గ్రామంలోనూ , చుట్టుపక్కల గ్రామాలలోనూ ఎవరైనా స్థలలు గానీ , పొలాలు గానీ అమ్మాలన్నా , కొనాలన్నా మొదట జనార్ధన్ దగ్గరకే వస్తారు . ఆకాష్ బయటి దేశంలో ఉంటున్నాడు . జనార్ధన్ ఆకాష్ కి ఒక విధంగా దూరపు చుట్టం . గ్రామంలో ఉంటున్న తన తల్లిని కూడా తనతో తీసుకువెళ్ళాలనే ఐడియాతోనే భారతదేశం వచ్చాడు ఆకాష్ . ఇది ఎలాగో తెలుసుకున్న జనార్ధన్ , గ్రామంలో ఉన్న ఆకాష్ కు చెందిన ఆస్తులను ఎలాగైనా తానే అమ్మించి , మంచి డబ్బు