పోస్ట్‌లు

వెన్నెల…కథ

                                                                          వెన్నెల                                                                                                                                                            కథ ఆ లేఖను చదివిన తరువాత జగపతి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ లేఖలో రాసున్న ఒక్కొక్క అక్షరమూ సాన పడుతున్న కత్తిలో నుండి వెలువడుతున్న నిప్పురవ్వల లాగా అతన్ని కాలుస్తున్నాయి. తిన్నగా విషయాన్ని మొదలు పెట్టి...లేఖను ముగించింది జగపతి భార్య మేనక. “ డబ్బును తరుముకుంటూ , ఎప్పుడు చూడూ ‘ పని...పని ’ అంటూ తిరగాలనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు ? మీరు ఇంటికి వస్తారని ఎన్ని రాత్రులు భోజనం చేయకుండా కాచుకోనున్నానో మీకు తెలియదు ? కానీ , మీరు... ’ నేను తినేశాను , నువ్వు భోజనం చేసి పడుకో! ’ అని చెప్పేసి పడుకునే వారు! నా కడుపుకు మాత్రమే ఆకలి వేస్తుందా ? చలికి దుప్పటి యొక్క వెచ్చదనం చాలా ? ఇవన్నీ చాలవని వారానికి రెండు మూడు రోజులు ' తాగి ఇంటికి వస్తారు. అడిగితే , ' హు...బిజినస్ లో మనుషులను మాయ చేయటానికి ఇలా ' పార్టీ ' ఇవ్వాల్సి వస్తోంది! ఇలాంటి

నీకంటూ ఒకరు…(కథ)

                                                                                 నీకంటూ ఒకరు                                                                                                                                                                     ( కథ) భార్య అందించిన కాఫీ గ్లాసును ఎడం చేత్తో పుచ్చుకుని , వరాండాలో పడున్న ఆ రోజు న్యూస్ పేపర్ను కుడి చేతిలోకి తీసుకుని సోఫాలో కూర్చోబోయాడు అనుభవ్. "డాడీ ఫోన్" అంటూ తండ్రి సెల్ ఫోన్ను తీసుకుని అక్కడికి వచ్చింది ఆరేళ్ళ రంజని. "ఎవర్రా ఫోనులో ?" కూతురు అందించిన సెల్ ఫోన్ను తన చేతిలోకి తీసుకుంటూ ముద్దుగా అడిగాడు తండ్రి అనుభవ్. "తెలియదు డాడీ...పేరు రాలేదు" చెప్పేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది రంజని. "ఇంత ప్రొద్దున్నే ఎవరు చేసుంటారు" అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు అనుభవ్. "అనుభవ్ గారు ఉన్నారా ?" ఆడ గొంతుక. "అనుభవ్ నే మాట్లాడుతున్నా...మీరెవరు ?" " సార్ నేను నిమ్స్ హాస్పిటల్ నుండి నర్స్ మాలతిని మాట్లాడుతున్నాను. కౌశల్య అనే ఆవిడ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. మీరు తెలుసని ,