చిలుకల గుంపు...(కథ)

 

                                                                       చిలుకల గుంపు                                                                                                                                                  (కథ)

"వాళ్ళందరూ ఎవరు, ఎక్కడ్నుంచి వస్తున్నారో తెలుసా మ్యాడం? అందరికీ సుమారుగా ఇరవై ఏళ్ళు ఉంటాయి. పక్క గ్రామాలలోనే నివసిస్తున్నారు.

ఇంటర్ పూర్తి చేసిన వెంటనే...అప్పు తీసుకుని చిన్నదిగా మెడిసన్ కు సంబంధించిన చదువు చదువుకుని, ఇలా హాస్పిటల్స్ లో ఉద్యోగానికి వచ్చేస్తారు. హాస్పిటల్లో ఇచ్చే జీతం అలాగే వాళ్ల కుటుంబానికి అవసరముంది.

తండ్రి తాగుబోతుగా ఉంటాడు. తల్లి వ్యాధితో బాధ పడుతూ ఉంటుంది. వాళ్ళకు కింద ఒక తమ్ముడో, చెల్లెలో ఉంటుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలు. అది చేయూత నివ్వనప్పుడు, ఇలాంటి ఆడ పిల్లలే ఆ కుటుంబానికి నమ్మకంగా నిలబడతారు.

******************************************************************************************************

జగన్నాధపురం వీధిలో ప్రయాణం చేయటం హాయి. 'చుర్రు ' మని ఎండ పడుతున్నా, 'జోరు 'మని వానపడుతున్నా, చల్లటి గాలి, శరీరాన్ని రాసుకుని వెళుతుంది. సర్వేయర్ కాలనీ నుండి సూర్యా నగర్ వచ్చేలోపు ఎన్ని పంట కాలవలు, చెరువులు.

వర్షా కాలంలో నిండా నిలబడే నీళ్ళు, కాంతిని ప్రసరింపచేసి మనసును తన వసం చేసుకుంటుంది. సాయంత్రం సమయానికి మేడపైకి వెళితే దట్టమైన తోటలో హాయిగా నడిచి వెళుతున్నట్టు మనసు కుతూహల పడుతుంది.

మన ప్రజలు, నీళ్ళ నిలువలకు ఎంత ముఖ్యత్వం ఇచ్చున్నారో అనేది తలుచుకుంటే ఆశ్చర్యకరమైన సంతోషం మనసులోకి వచ్చి వెళుతుంది. ఆ వీధిలోనే భర్తతో ఆటోలో ప్రయాణిస్తోంది మాలతీ.

మాలతీకి ఈ రోజు డాక్టర్ను చూడాల్సిన నిర్భంధం. సడన్ గా తల తిప్పటం, ఒళ్ళు తడబడటం.

వంట గదిలో నిలబడున్న ఆమె స్టవ్వు కట్టేసి, అక్కడే నేలమీద పడుకుండిపోయింది. రెండు నిమిషాలు గడిచినై. మెల్లగా కళ్ళు తెరిచి లేచిన వెంటనే విపరీతమైన నీరసం ఫీలయ్యింది.

'ఎందుకు ఇలా?' అని, భర్తతో చెప్పింది. ఎప్పుడూ చూసే ఫ్యామిలీ డాక్టర్నే చూశారు. డాక్టర్ తో మాట్లాడి, చేతిలో మందు చీటీతో బయటకు వస్తున్నప్పుడు 'సాయంత్రం ఖచ్చితంగా వచ్చి నన్ను చూడండి...' అన్నారు డాక్టర్.

రాసిచ్చిన మందులు వేసుకున్నా సాయంత్రం లోపు మూడు, నాలుగుసార్లు తల తిప్పటం జరిగింది మాలతీకి. ప్రతి ఒక్కసారీ తీవ్రత ఎక్కువగా ఉంది.

మంచం, దిండు, ఫాను అన్నీ వేరు వేరుగా తిరిగినా, ఈమె తల 'గిర్రు 'మని తిప్పటం ఫీలయ్యింది. బాధను తట్టుకోలేక భర్త చేతిని పట్టుకుని నొక్కింది.

విపరీతమైన నీరసంతో పడుకున్నమాలతీ సాయంత్రం మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ను కలిసింది. అప్పుడు మందులేవీ రెకమెండ్ చేయకుండా 'మీరు ఈ చెవి డాక్టర్ను చూడటం మంచిది...!' అన్నారు.

చెవి డాక్టర్ను చూడటానికి భర్తతో ఆటోలో ప్రయాణం చేస్తోంది మాలతీ .

హాస్పిటల్ వాకిలిలో ఆటో ఆగిన వెంటనే, దిగి లోపలకు వెళ్లారు. వచ్చిన వాళ్ళు కూర్చోగా, హాలులో వరుసగా కుర్చీలు వేసున్నాయి. దాని మొదట్లో పేరు రిజిస్టర్ చేసే చోటు ఉన్నది.

రిసెప్షన్లో ఒకే వయసున్న ఏడెనిమిది మంది అమ్మాయులు ఉన్నారు. పేరు, అడ్రస్సు, వయసు అడిగి రిజిస్టర్ చేసుకుని, 'కూర్చోండి పిలుస్తాం...' అన్నది ఒక అమ్మాయి. రిజిస్టర్ చేసిన వాళ్ల పేర్లు పెట్టి పిలిచి, బి.పి చెక్ చేసింది ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి బరువు చూసి నోట్ చేసింది.

అన్నీ రిసెప్షన్ టేబుల్ దగ్గరే జరుగుతాయి.

ఒకమ్మాయి, గబగబా మేడపైకి వెళ్ళింది. తిరిగి కిందకు వచ్చింది.

ఒకమ్మాయి, కార్డు మీద రాస్తూ ఏదో చెప్పింది.

ఒక్కసారిగా నవ్వుల అలలు లేచినై.

ఒకమ్మాయి, ఇంకొక అమ్మాయిని గట్టిగా అరుస్తూ హేళన చెయ్య ఆ అమ్మాయి ఈ అమ్మాయిని కొట్టటానికి పరిగెత్తుకు వచ్చింది.

ఇలా ఆ చోటు కోలాహలంగా, గలగలమంటూ, ఒకే సమయంలో చిలుకల గుంపు స్వరం లేపినట్టు ఉన్నది.

పనిచేస్తూనే ఇవన్నీ జరిగినై.

ఒకమ్మాయి పేషెంట్లను వరుసక్రమంగా, డాక్టర్ రూముకు పంపిస్తూ, తన స్నేహితురాలి దగ్గర నవ్వుతూ మాట్లాడింది. డాక్టర్ రూములో నుండి బయటకు వస్తున్న వాళ్ళను మందులుకొనే చోటుకు దారి చూపిస్తూ మాట్లాడి నవ్వింది.

అబ్బబ్బ ఏం మాట్లాడతారో....నవ్వు, మాటల శబ్ధం, ఒకరికొకరు కొట్టుకోవటం, ఆడుకోవటం అంటూ, సరదాగా ఉండే రోజు, స్కూలు పిల్లల అరుపులతో గోల చేస్తున్నట్టు ఉన్నది.

'పనిచేసే చోట, ఇలాగా గోల చేసేది?' మనసులో అనుకున్నది మాలతీ.

కానీ పని మాత్రం ఆగకుండా జరిగింది.

అందరూ 18 ఏళ్ళ వయసు నుండి 21 ఏళ్ళ వయసు లోపలే ఉన్నారు. ఎత్తు, బరువు కూడా ఒకేలాగా ఉన్నట్లు అనిపించింది మాలతీకి.

కరెక్టుగా పనిచేస్తున్నారు. కానీ పనిచేసే చోట ఇన్ని మాటలా! ఈ కాలం పిల్లలకు బాధ్యత అనేది లేదు. అన్నీనూ సింపుల్, టేక్ ఇట్ ఈజీ నే, అని కూడా అనుకుంది.

'మాలతీ మ్యామ్... మాలతీ మ్యామ్...'

రెండు సార్లు ఆమె పేరును ఒక చిన్న చిలుక పిలవ, లేచి, డాక్టర్ రూముకు వెళ్ళింది.

దాక్టర్ దగ్గర తన ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన ఉత్తరం ఇచ్చి, ఆయన అది చదివిన తరువాత, తనకు తల తిప్పటం గురించి పొడవుగా చెప్పి ముగించింది మాలతీ.

డాక్టర్ కే తల తిరిగి ఉంటుంది. అంత విపరీతంగా చెప్పింది.

అన్నిటినీ ఓర్పుగా విన్న డాక్టర్ నుదిటి మీద గుండ్రంగా అమర్చబడ్డ లైటుతో ఆమెను పరిశోధించారు. పొడుగుగా ఉన్న కడ్డీలో అమర్చబడ్డ వెలుగుతున్న వెళుతురును ఆమె చెవిలో పంపారు.

కంప్యూటర్ తెర మీద లోతుగా చూశారు. తరువాత వస్తువులను ఊడదీసి, తలతిప్పటానికి కారణాలను వివరించారు.

"సరి చేసేయ వచ్చు..." అని వాగ్ధానం ఇచ్చారు.

"కానీ, ఇది సరి అవటానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు రావలసి ఉంటుంది" అన్నారు.

"ఎలాగైనా సరిపోతుంది కదా డాక్టర్?"

"దాని గురించి మీరు బాధపడక్కర్లేదు!"

మందుల చీటీని అసిస్టంట్ దగ్గర ఇచ్చి పంపించారు.

డాక్టర్ అడ్వైజ్ కు తగినట్లు, డాక్టర్ దగ్గరకు వచ్చి వెళ్ళింది మాలతీ.

చాలా సార్లు ఆసుపత్రికి వచ్చి వెళ్ళటంతో, డాక్టర్ తో బాగా పరిచయం ఏర్పడింది మాలతీకి.

ఒకరోజు డాక్టర్ తో మాట్లాడుతోంది మాలతీ. వ్యాధి, చికిత్స, మందు, మాత్రలు దాటి మాటలు వెళ్ళినై.

"మీరు చెప్పినట్టే నాకు తల తిప్పటం బాగా నయం అయ్యింది డాక్టర్. చాలా థ్యాంక్స్!" అన్నది మాలతీ.

"మీరు నాతో సహకరించటం కూడా దానికి ఒక కారణం మ్యాడం"

అలా ప్రారంభమైన మాటలు ఆసుపత్రి గురించి వచ్చింది.

"అన్నీ సరే డాక్టర్...మీ అసిస్టంటులే కొంచం మారాలి" అన్నది.

"అలాగా!" అన్నారు డాక్టర్.

"డాక్టర్...మీరు ఒక రోజు సర్ ప్రైజుగా వచ్చి, రిషెప్షన్ను చూడండి. ఒకటే వాగుడు, కేకలు, నవ్వులు, హేళనలు!"

నవ్వుతూనే, కొంచం దూరంగా నిలబడున్న అసిస్టెంటును "కాసేపు బయట ఉండండి" అని బయటకు పంపారు డాక్టర్.

ఇంటర్ కాం నొక్కి, రెండు కాఫీలు చెప్పి తెమ్మన్నారు.

తన టేబుల్ మీద ఉన్న సెక్యూరిటీ కంప్యూటర్ని మాలతీ వైపు తిప్పాడు డాక్టర్.

తెరను చూసింది మాలతీ.

రిసెప్షన్ భాగాన్ని చూపించింది తెర. మాలతీ చెప్పినట్టు మాటలూ, కేకలూ, నవ్వులు అంటూ గోలగోలగా ఉంది ఆ చోటు.

"చూడండి డాక్టర్ ఎంత ఆటలాడుకుంటున్నారో" అన్నది మాలతీ.

"మీరు చెప్పింది కరెక్టే మ్యాడం"

"వీటన్నిటినీ కాస్త తగ్గించు కుంటే మంచిది కదా...నేను ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా డాక్టర్?"

"నో...నో...మ్యాడం...ఒకటి గమనించరా...రిసెప్షన్లో ఉన్న అందరూ ఆడపిల్లలే. వాళ్లకు ఎంత వయసు ఉంటుంది అనుకుంటున్నారు?"

"పందొమ్మిది లేక ఇరవై!"

"వాళ్ళందరూ ఎవరు, ఎక్కడ్నుంచి వస్తున్నారో తెలుసా మ్యాడం? అందరికీ సుమారుగా ఇరవై ఏళ్ళు ఉంటాయి. పక్క గ్రామాలలోనే నివసిస్తున్నారు.

ఇంటర్ పూర్తి చేసిన వెంటనే...అప్పు తీసుకుని చిన్నదిగా మెడిసన్ కు సంబంధించిన చదువు చదువుకుని, ఇలా హాస్పిటల్స్ లో ఉద్యోగానికి వచ్చేస్తారు. హాస్పిటల్లో ఇచ్చే జీతం అలాగే వాళ్ల కుటుంబానికి అవసరముంది.

తండ్రి తాగుబోతుగా ఉంటాడు. తల్లి వ్యాధితో బాధ పడుతూ ఉంటుంది. వాళ్ళకు కింద ఒక తమ్ముడో, చెల్లెలో ఉంటుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలు. అది చేయూత నివ్వనప్పుడు, ఇలాంటి ఆడ పిల్లలే ఆ కుటుంబానికి నమ్మకంగా నిలబడతారు.

బాధ్యత గల మగ పిల్లలూ ఉన్నారు. కానీ, ఆడ పిల్లలకు తల్లి-తండ్రుల మీద, కుటుంబం మీద పిచ్చి ప్రేమ. ఆలొచించి చూడండి...మీరూ, నేనూ మన యొక్క టీనేజ్ లో ఎంత సంతోషంగా ఉండుంటామో.

కానీ ఈ పిల్లల భుజాలపై ఇప్పుడే కుటుంబ భారం. పని ముగించుకుని ఇంటికి వెళితే, చాలా వరకు ఉప్పు లేదు, చింత పండు లేదు అని కరువు పాటే ఉంటుంది. నవ్వూ, ఎగతాలి, సరదా వాళ్ళ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది.

తెల్లారిన వెంటనే, బ్యాగు పుచ్చుకుని, పరిగెత్తుకు వచ్చేస్తారు. ఈ చోటే వాళ్ళకు స్వర్గం. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క దేవతగా అనుకుని నవ్వుతూ, కబుర్లాడుతూ పనిచేస్తున్నారు.

అది మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ, ఒంటి మీద నగలూ, మనసులో భారాన్ని ఎత్తుకుని వచ్చేవాళ్ళే ఎక్కువ.

ఇలా వచ్చేవాళ్ళ ముఖంలో తెలిసే ఆవేదన, వీళ్ళకూ అతుక్కుంటుంది. దాన్నీ విధిలించుకుని, తుడుచుకుని, నవ్వు, నవ్వు మొహంతో తిరుగుతూ వస్తుంటే, ఈ హాస్పిటల్ వాళ్ళకు ఒక ప్లే గ్రౌండుగా ఉండనీ అనుకుంటాను.

 ఇంకొకటి గమనించారా మ్యాడం...ఒక్కొక్క అమ్మాయి పది నిమిషాల్లో నాలుగుసార్లు అయినా ఆసుపత్రి మేడ, కింద మెడికల్ షాపు, నా గదికి చుట్టి చుట్టి వస్తూ పని చేస్తారు.

దానికి వాళ్ళ ఒంట్లో ఎంత శక్తి కావాలి. ఆ శక్తి అంతటినీ ఆ పిల్లలు ఈ గుంపులో నుండే తీసుకుంటున్నారు....."

ఇంకా ఏదో చెప్పబోతున్న డాక్టర్ని అడ్డుకున్న మాలతీ, ఆయన్ని చూసి రెండు చేతులూ ఎత్తి దన్నం పెడుతూ "అర్ధమయ్యింది డాక్టర్..." అన్నది.

ఆమె కళ్ళల్లో నుండి కన్నీటి బొట్లు పడ్డాయి.

డాక్టర్ రూములో నుండి బయటకు వచ్చిన మాలతీ యొక్క చెవులకు ఆ చిలుకల గుంపు శబ్ధం, తేనెలాగా తియ్యగా ఉన్నది.

*************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)