లక్ష్యమే విజయం...(కథ)
లక్ష్యమే విజయం (కథ)
ధ్యేయాన్ని
లక్ష్యం అని కూడా అంటారు. ధ్యేయాన్ని ఆంగ్లంలో గోల్ అంటారు. కోరుకున్న ఫలితాన్ని
సాధించడానికి ఒక జంతువు లేదా వ్యక్తి లేదా వ్యవస్థ ఊహ ద్వారా ప్రణాళికను తయారు
చేసుకొని అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఒక క్రమపద్ధతి ప్రకారం అభివృద్ధిని
సాధిస్తూ లక్ష్యంలోని చివరి స్థానానికి చేరడాన్ని ధ్యేయం అంటారు.
ప్రతి
వ్యక్తీ తాను చేయ బోయే పనికి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకునే ముందుకు
సాగుతాడు. ఈ లక్ష్యాన్ని నిర్ణయించు కోవడమన్నది ఊహాజనితం కావచ్చు, ప్రణాళికా
బద్ధంగా వ్రాత పూర్వకంగా ఏర్పాటు చేసుకున్నది కావచ్చు. మరేదైనా కావచ్చు. కాని
తప్పనిసరిగా ఒక లక్ష్యం అంటు ఒక టుంటుంది. లక్ష్యము లేనిది గమ్యము లేని ప్రయాణము
వంటిది. నిరుపయోగము. ప్రతి పనికి ఒక లక్ష్యము వుంటుంది. అది చిన్న పని గాని, పెద్ద
పని గాని, మహా కార్యము గాని, దానికి
ఒక లక్ష్యముంటుంది.
*********************************
“ఇంత ముఖ్యమైన విషయాన్ని ఇలా చివరి సమయంలో వచ్చి చెబుతున్నావే విశాల్...ఇది న్యాయమేనా బాబూ?”
కలవరమైన చూపులతో
న్యాయం అడుగుతున్న స్నేహితుడు అర్జున్ తల్లి శారదాని తలెత్తి చూసే ధైర్యం లేక
తలవంచుకునే ఉన్నాడు విశాల్.
“చెప్పు
బాబూ...మిమ్మల్నందరినీ నమ్మే కదా అర్జున్ ని కాలేజీకి పంపించాను. మంచి
స్నేహితులుగా ఉన్నారు. అన్నదమ్ములు లాగా కలిసిపోయారు. తండ్రి లేని కొరత తెలియనివ్వకుండా మంచి విధంగా చూసుకుంటున్నారు
అనే నమ్మకంతో ఉన్నాను! చివరికి ఇలా చేశావే బాబూ...”
శారదా యొక్క సత్యమైన
మాటలు మనసుపై దాడి చెయ్య, మాట్లాడటానికి ఏదీలేక వేదనపడుతూ నిలబడ్డాడు విశాల్.
“తోడబుట్టిన
ఇద్దరు చెల్లెలను గట్టెక్కించాలి అనేది విశాల్ తలరాతే. ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ మంచి భవిష్యత్తును ఏర్పరచి
ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నా బాబూ. సాధించాల్సిన వయసులో పోయి ఇలా ప్రేమా,
దోమా అంటూ తన మనసును ఊగిసలాడిస్తే జీవితంలో ఎలా ఎదుగుతాడు?
అతన్నే నమ్ముకున్న మా జీవితాలు ఏం కాను?”
“అమ్మా నేను
వాడికి చాలాసార్లు సలహా ఇచ్చాను. వాడి చెవులకు అది ఎక్కితేనే కదా?
దాని వెనుకే పిచ్చిపట్టిన వాడిలాగా తిరుగుతున్నాడు. 'గీతా... గీతా' అంటూ జపం చేస్తున్నాడు”
“అమ్మా కనకదుర్గ
తల్లీ ...నా కొడుకును కాపాడు. వాడికి మంచి బుద్ది ఇవ్వు తల్లీ” కన్నీరు కార ఆకాశం చూస్తూ వేడుకుంది ఆ పేద తల్లి.
“ఆమేమో అతన్ని
పట్టించుకోవటమే లేదు! ఒక మనిషి అని కూడా గౌరవించటం లేదు! అతనే ఆమెకోసం
తపిస్తున్నాడు. మేమందరం ఎంత బుద్ది చెప్పినా, తన ప్రేమను ఆమెతో చెప్పే తీరుతానని మొండికేసి ఇప్పుడు ఆమెను
వెతుక్కుంటూ వెళ్ళాడు...”
చేతి వేళ్ళతో నుదిటి మీద రుద్దుకున్నాడు ఆందోళనతో.
“ఆమె కుటుంబం చాలా
వసతిగల కుటుంబం. ఆమె తండ్రి పది వ్యాపారాలు చేస్తున్నాడు! వాళ్ళంతా మనవాడిని
అంగీకరించరు. అందులోనూ ఆ అమ్మాయి గీతా వీడ్ని చూసి నువ్వెవరయ్యా అని అడిగినా కూడా
ఆశ్చర్యపడక్కర్లేదు...ఛీ పో అంటూ తరిమేస్తుంది...”
అతన్నే చూస్తూ
ఉండిపోయింది.
“నాకూ అదే భయంగా
ఉంది. ఆమె నిరాకరింపును వీడు మానసికంగా ఎలా తట్టుకుంటాడో అనేదే బాధగా ఉంది! మనసు
విరిగి, ముక్కలైపోతాడేమో
నని భయంగా ఉంది. అలా విరిగి పోతే తిరిగి వీడిని మనిషిగా నిలబెట్టటం చాలా కష్టం.
నిరాకరించిందనే బాధతో, దుఃఖంతో ఏదైన తప్పుడు నిర్ణయం తీసుకుంటే...అలాంటి నిర్ణయం వాడు తీసుకోకూడదనే
ఆందోళన పడుతూ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను...!”
శారదా
నిట్టూర్చింది.
“చదువుకునే వయసులో
ఇదంతా మనకు అవసరమా తమ్ముడూ? ప్రేమిస్తున్న వారు ఒక్కొక్కళ్ళూ ఒక్క నిమిషం తమని
కన్నవాళ్ళ, తోబుట్టువుల
ముఖాలను మనసులో తలుచుకుని చూసుకుంటే అలాంటి ఒక ఆలోచన మొలకెత్తుతుందా?”
“..........................”
“నేను
సంతోషంగా ఉండకూడదు అనేదే నా తలరాత అనుకుంటా. ఆరొగ్యంగా తిరుగుతున వీళ్ళ నాన్న హఠాత్తుగా
హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినప్పుడు వీడి మీద ఉన్న నమ్మకంతో జీవించటం
మొదలుపెట్టాను. ఇప్పుడు వీడూ ఇలా తప్పైన దారిలో వెళితే...ఇక నేనెక్కడికి పోను?”
ఏదేదో చెబుతూ
కుమిలిపోతున్న ఆమెను మనో బాధతో చూశాడు విశాల్.
“సరే నేను
బయలుదేరతానమ్మా . వాడొస్తే ధైర్యం చెప్పి వాడి మనసుకు ధైర్యం ఇవ్వండి. నేను చూసినా సమాధాన పరుస్తాను. హోదాకు పైన ఆశ
పడటంలో తప్పులేదు...ఆశపడటానికి కావలసినట్లు తాను తన యొక్క హోదాను పెంచుకోవాలి
కదా...?”
ఏదో ఆమెను
ఓదార్చటానికి మాట్లాడాడు.
సగం మనసుతో తల
ఊపింది శారదా. “దేవుడే
నా కొడుకును కాపాడాలి!”
రాత్రంతా నిద్ర
పట్టక అవస్తపడుతూ ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు...తన కాలుపై ఏదో తడి తగులుతుంటే
ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచింది శారదా.
కొడుకు అర్జున్ నే
ఆమె కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు...?
ఆందోళనతో లేచింది. “అర్జున్ వచ్చాశావా?
ఎప్పుడొచ్చావు? తింటావా?”
తల్లి ప్రేమతో
అడిగిన మాటలకు అర్జున్ తట్టుకోలేక ఏడవటం మొదలుపెట్టాడు. “మొదట
ఈ పిచ్చి వాడిని క్షమించానని చెప్పమ్మా...” తల మీద
కొట్టుకున్నాడు.
“ఏం...ఏమైందయ్యా...”
“ఒక ఊబిలో
పడిపోయేవాడిని. మంచికాలం నాన్నగారి ఆత్మే నన్ను కాపాడుంటుంది...”
“అర్ధం కాలేదురా అబ్బాయ్...
ఏమైంది...?”
“నేను
మనసారా ఒకమ్మాయిని ప్రేమించాను. ఆమె లేదంటే జీవితమే లేదనేంత వరకు ప్రాణంగా స్నేహం
చేశాను...”
“అర్జున్...”
“అవునమ్మా! కలలతో,
ఆశలతో ఆమెను కలిసి నా ఇష్టాన్ని చెప్పాను”
అతనే కంటిన్యూ చేయనీ
అని కాచుకోనుంది శారదా.
“నా ప్రేమను
చెప్పిన వెంటనే ఆమె ఏం జవాబు చెప్పిందో తెలుసా?
నీకూ అని జీవితంలో లక్ష్యం, ఉద్దేశం, తత్త్వము అంటూ ఏదీ లేదా అర్జున్?
అది లేని వాళ్ళే ఇలాంటి
చిన్న చిన్న సుఖాలకూ, మత్తులకూ తమని బానిసలు చేసుకుంటారు! కానీ, నాకు లక్ష్యం ఉంది. బాగా చదివి పెద్ద ప్రభుత్వ ఉదోగిగా,
కనీసం ఒక కలక్టర్ అయినా అవ్వాలి! ఇలాంటి ఉత్తమమైన ఆలొచన ఏదీ
నీ మనసులో లేదా...? అని మొహం మీద కొట్టినట్టు అడిగింది...!”
“ఏమిటీ...?”
“ఆమె అడిగిన విధం,
చెప్పిన మాటలూ నాకు కొరడాతో కొట్టినట్టు ఉన్నది! నా టెంపరరీ
మత్తు తొలగిపోయి నా భవిష్యత్తు, బాధ్యతలూ అర్ధం కావటం మొదలైంది! నువ్వూ,
చెల్లెల్లు నా మనసులో దృశ్యం లాగా వచ్చారు. నేనున్న
పరిస్థితి ఏమిటి, చేస్తున్న పనేమిటి అని మనసు తపించింది! భగవంతుడా ఎంత పెద్ద తప్పు చెయ్యబోయేను.
నా జీవితాన్నే నాశనం చేసుకోవాలనుకున్నానే. నేనెవరో నాకు అర్ధమయేటట్టు చేసిన గీతా
దగ్గర క్షమాపణలు అడిగి ఇక్కడికి పరిగెత్తుకు వచ్చానమ్మా...”
శారదా కొడుకును
కావలించుకుని ఏడ్చింది.
“నాన్న చనిపోయి
ఇన్ని సంవత్సరాలలో ఎంత శ్రమ పడి మమ్మల్నిపెంచుంటావు అమ్మా. అదంతా మరిచిపోయి,
తప్పైన దారిలో వెళ్ళాలనుకున్నాను. నీ త్యాగం కంటేనా నా
ప్రేమ పెద్దది!”
“సరైన సమయంలో
నిన్ను నీకు ఎవరు అనేది నీకు గుర్తు చేసిన ఆమె మన కులదేవతరా..." శారదా
కొడుకును ప్రేమతో కౌగలించుకుంది.
*********************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి