ఇంటర్వ్యూ...(కథ)

 

                                                                              ఇంటర్వ్యూ                                                                                                                                                                       (కథ)

ఇంటర్వ్యూ లు చాలా విషయాలలో చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ, ఉద్యోగానికి సరైన వ్యక్తులను ఎన్నుకోవడం అన్నిటికంటే కష్టమైనది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని మదింపు చేస్తారు. అంటే పరిశీలనా శక్తిని, తెలివితేటలను, లౌక్యాన్ని, వాస్తవ దృష్టిని, నిర్ణయనిష్పాక్షితను, నేర్చుకోవాలనే ప్రేరణా శక్తిని, జట్టులో పని చేసే సమర్ధత, అలోచనా శక్తి, ముక్కుసూటి తనం, గోప్యత, నీతి నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణ లాంటి మనిషి నడవడికకి సంబందించిన వివిధ లక్షణాలని అంచనా వేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఈ కథలో ఒక కంపెనీ చైర్మాన్, తన తదనంతరం కంపనీ నిర్వహణని తన కొడుకుకు అప్పగించాలని, అయితే తన కొడుకు తన పదవికి తగినవాడా, కాదా అని తెలుసుకోవటానికి కొడుకుకే అతనికే తెలియకుండా ఇంటర్వ్యూ పెడతాడు.     

ఆ తండ్రి కొడుకుకు పెట్టిన ఇంటర్వ్యూ ఎలాంటిది? ఆ ఇంటర్వ్యూ లో కొడుకు పాసైయ్యాడా?...తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి. 

*************************************************************************************************

సెక్యూరిటీ చేసిన సెల్యూట్ కు తల ఊపుతూనే - తలుపు తీసుకుని లోపలకు వెళ్ళాడు అరవింద్.

రా అరవింద్. కూర్చో! అంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు, కంపెనీ చైర్మాన్., రత్నకుమార్.

వెంటనే రమ్మన్నారే! ఏమిటి నాన్నా అంత అవసరం?” కొడుకు అడిగాడు.

చెబుతాను...! అన్న ఆయన రోజు లంచ్ ముగించుకున్న తరువాత, రెండు గంటల కల్లా నువ్వు ముఖాముఖి ఇంటర్వ్యూ జరుగుతున్న చోటున ఉండాలి!

నేనా...?” అయోమయంగా అడిగిన అతను నేను ఎందుకు నాన్నా?” అన్నాడు ఏమీ అర్ధం కాక.

రత్నకుమార్ నవ్వుకున్నారు.

నువ్వు అనుకుంటున్నట్టు -- పెద్దగా ఏమీ లేదు. ఇంటర్వ్యూలో ఇద్దరు క్యాండిడేట్లు మాత్రమే చివరి సెలక్షన్ లిస్టులో ఉన్నారు. నువ్వు చెయ్యాల్సిందల్లా, ఇద్దరిలో ఎవర్ని తీసుకోవాలో నాకు నువ్వు సలహా ఇవ్వాలి. అంతే...!

ఆయన వివరం చెప్పి ముగించ -- సతమతంలో వంకర్లు తిరిగాడు, అరవింద్.

దీనికిపోయి నేనెందుకు నాన్నా! మొత్త ఇంటర్వ్యూ మీరే ముగించేయొచ్చుగా?”

చెయ్యచ్చు! కానీ, ఇద్దరు క్యాండిడేట్లూ తెలివితేటలలొ సరిసమంగా ఉన్నారు. ఎవర్నీ తక్కువ చేయలేం. కొలబద్ద పెట్టుకుని వాళ్ళిద్దర్నీ కొలిచి, ఎవరు బెస్టో తెలుసుకోవటం నాకు కష్టంగా ఉంది. అందువల్ల అందులో నేనెవర్ని సెలక్ట్ చెయ్యాలన్నదాంట్లో నాకు కన్ ఫ్యూజన్  గా ఉంది. ఎవర్నీ తీసుకున్నా, ఇంకొకర్ని తీసుకోలేదు, వాళ్లకేం తక్కువ  అని నా మనసు వేదిస్తుంది. అందుకనే నిన్ను సెలెక్ట్ చెయ్యమంటున్నాను. నీకేదైనా కొత్త వ్యూహం ఆలొచనకు రావచ్చు కదా?”

ఆయన మాటలను జాగ్రత్తగా గమనించిన అరవింద్ కొంచం సేపు మౌనం తరువాత----

సరే నాన్నా! అని నవ్వుతూ చెప్పాడు.

అప్పుడు తండ్రి చెప్పాడు! కానీ, ఒక నిబంధన. ఇంటర్వ్యూజరిగే చోట నేనూ నీతో ఉంటా...!

సరే నాన్నా భుజాలు ఎగరేసుకుంటూ బయటకు వెళ్లాడు.   

మధ్యాహ్నం సమయం మూడు.

అరవింద్ దగ్గర అడుగుతున్నారు, రత్నకుమార్.

ఏమిటి అరవింద్ ఇది? నువ్వేదో కొత్తగా పరిసీలిస్తావు అని అనుకుంటే? నువ్వేంట్రా అంటే ఇద్దరి దగ్గర మీకు రాబోయే భార్యా-భర్తల గురించి, వాళ్ళు ఎలా ఉండాలని మీరు ఎదురు చూస్తున్నారు అని సర్వ సాధారణంగా అడిగేసి, ఒకరిని ఉద్యోగానికి సెలెక్ట్  చేశాశావు...నువ్వడిగిన ప్రశ్నకు వాళ్ళిచ్చిన సమాధానం పెట్టుకుని నువ్వెలా ఫైనల్ చేశావు? నాకేమీ అర్ధం కాలేదుఅన్నారు అయోమయంగా.

నవ్వుతూనే సమాధానం చెప్పటం మొదలు పెట్టాడు కొడుకు.

నాన్నా! అమ్మాయి దగ్గర నీకు రాబోయే భర్త ఎలా ఉండాలని ఎదురు చూస్తున్నావుఅని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పింది? ‘నా కంటే ఎక్కువ సంపాదించకపోయినా నా జీతం ఎంతో అంత సంపాదిస్తే చాలు! అప్పుడే ఇద్దరికీ ఈగో ప్రాబ్లం రాకుండా ఉంటుందిఅని చెప్పింది...!

అవును! అమ్మాయి చెప్పిన సమాధానం కరెక్టే కదా?” అన్నారు తండ్రి.

కరక్టే నాన్నా! అన్న అరవింద్, “కానీ, యూత్ ఏం చెప్పాడో విన్నారా? ‘నాకు రాబోయే భార్య ఉద్యోగం చేయాలనే ఆశ లేదు. నాకొచ్చే జీతంతో, జీతంతోనే ఎంత ఆనందంగా జీవించగలదో...అలా జీవితం నడపగల అమ్మాయి నాకు భార్యగా రావాలని ఎదురు చూస్తున్నాను అని చెప్పాడా లేదా?”

అవును చెప్పాడు. అందుకోసం నువ్వు అతన్ని సెలెక్ట్ చేస్తానంటే అదెలా న్యాయమవుతుంది, అరవింద్

అడిగిన తండ్రి కళ్ళలోకి నేరుగా చూశాడు.

నాన్నా...మీరు వాళ్ళిద్దర్నీ వాళ్ళ తెలివితేటలను చూసి సెలెక్ట్ చేశారు. కానీ, నేను వాళ్ళ మనసులను తెలుసుకుని అందులో ఒకర్ని సెలెక్ట్ చేశాను.

ఆలొచించి చూడండి... అమ్మాయి ఉద్యోగం చూసే వరుడ్నే ఎదురు చూస్తోంది! కానీ, ఇతను అలా కాదు. తాను పదవిలో ఉన్నా ఉద్యోగానికి వెళ్లని అమ్మాయిని పెళ్ళి చేసుకోవటానికి రెడీగా ఉన్నాడు. యంగ్ మ్యాన్ కు ఉద్యోగం ఇస్తే, ఉద్యోగం లేని లేక ఉద్యోగం దొరకని అబ్బాయికో/అమ్మాయికో జీవితం దొరుకుతుంది

అరవింద్ చాలా క్యాషువల్ గా చెప్పగా -- కొడుకు వీపు తట్టి--

శభాష్ అరవింద్....నేను వాళ్ళ కోసం మాత్రమే ఇంటర్వ్యూ జరపలేదు. మన కంపెనీకి నా తరువాత నాకంటే గొప్ప చైర్మాన్ కావాలని అనుకుని నీకూ కలిపే ఇంటర్వ్యూ పెట్టాను. పెట్టిన ఇంటర్వ్యూలో నువ్వు A+ గ్రేడ్ లో పాసయ్యావు. నా కంపెనీకి నా తరువాత నాకంటే గొప్ప చైర్మాన్ దొరికేడు. నేను ప్రశాంతంగా నా రిటైర్మెంట్ జీవితం గడపొచ్చు అన్న రత్నకుమార్ కొడుకును గర్వంగా చూశాడు.  

**************************************************సమాప్తం***************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)