పిడుగు…(కథ)

 

                                                                             పిడుగు                                                                                                                                                         (కథ)

పెద్ద వర్షం వస్తున్న సమయం ఇంటి వెనుక వైపున్న బావి గోడ దగ్గర ఆవుపేడను గుండ్రంగా చేసి, పరచి పడేసి వచ్చేయాలట. రాత్రి పిడుగులు పడుతున్నప్పుడు 'అర్జునా...అర్జునా' అని చెప్పుకుంటూ కళ్ళుమూసుకుని ఉండాలట. తెల్లవారిన తరువాత చూస్తే ఆ పేడ బంతిలో పిడుగుపడి అది బంగారంగా మారి ఉంటుందట.

ప్రశ్న ఒకటి, జవాబు ఒకటి...జరగాల్సింది ఒకటి, జరిగేది ఒకటి అని ఉన్నది.

చల్లటి వర్షం,  అందమైన మెరుపులు, మరణం అనే పిడుగు, ఇది ఎందుకు?

*****************************************************************************************************

చిన్న వయసులో చక్రవర్తికి ఎప్పుడూ అనుమానం.

తెలుగు టీచర్ రఘునాద శాస్త్రి దగ్గర మాట మాటకీ అడుగుతాడు.

"సార్...పిడుగు పడింది...పిడుగు పడిందని చెబుతున్నారే సార్...పిడుగు ఎలా ఉంటుంది సార్...లావుగా కొండరాయి లాగా ఉంటుందా సార్?"

"నీ నెత్తి మీద పిడుగుపడ...పోరా..."

ఆయన వెళ్ళిపోయారు.

చక్రవర్తి భయంతో నెత్తిమీద తడిమి చూసుకున్నాడు.

సహ విధ్యార్ధులు విపరీతంగా కథలు చెబుతుంటారు. పెద్ద వర్షం వస్తున్న సమయం ఇంటి వెనుక వైపున్న బావి గోడ దగ్గర ఆవుపేడను గుండ్రంగా చేసి, పరచి పడేసి వచ్చేయాలట. రాత్రి పిడుగులు పడుతున్నప్పుడు 'అర్జునా...అర్జునా' అని చెప్పుకుంటూ కళ్ళుమూసుకుని ఉండాలట. తెల్లవారిన తరువాత చూస్తే ఆ పేడ బంతిలో పిడుగుపడి అది బంగారంగా మారి ఉంటుందట.

చక్రవర్తి కూడా తల్లి పిడకల కోసం సేకరించి పెట్టున్న పేడను రహస్యంగా తీసి  పిడుగులు, వర్షం సమయంలో దాన్ని గుండ్రంగా చేసి బావి పక్కన పడేసి చూశాడు.

నిరాశే మిగిలింది.

పిడుగు పడలేదు!

అయినా కానీ టీచర్ చెప్పినట్టు ఒకడి నెత్తిపై పుడుగు పడితే ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది తెలియకుండానే పోయింది!

జీవితంలో పలు విషయాలు ఇలాగే అనేది అతను పెద్దవాడు అయిన తరువాత తెలుసుకున్నాడు చక్రవర్తి.

ప్రశ్న ఒకటి, జవాబు ఒకటి...జరగాల్సింది ఒకటి, జరిగేది ఒకటి అని ఉన్నది.

పూర్ణా ను పెళ్ళి చేసుకున్న కొద్ది సంవత్సరాలకే ఆమెను క్యాన్సర్ వ్యాధికి పోగొట్టుకున్నాడు.

పెళ్ళికి సంబంధాలు చూస్తున్నప్పుడు జ్యోతిష్కుడు తండ్రితో ఇతనికని అమ్మాయి ఎక్కడో పుట్టుంటుంది అని చెప్పాడు. 'అయితే ఆమె ఎక్కడున్నదనే సంగతే ఎవరికీ తెలియదు అన్నప్పుడు, ఆమె పక్క వీధిలోనే ఉన్నది. మాట్రిమోనీ సైటులో చూసినందువల్ల వచ్చింది.

కానీ.

చల్లటి వర్షం,  అందమైన మెరుపులు, మరణం అనే పిడుగు, ఇది ఎందుకు?

అతనికి జవాబు దొరకలేదు.

"సారీ సార్" అన్న పిలుపు.

తిరిగాడు.

లక్ష్మీ నిలబడున్నది. "ఆలస్యం అయిపోయింది...వాళ్ళు ఆకలితో కాచుకోనుంటారు" అన్నది.

"ఎస్, లక్కీ " అన్నాడు. చక్రవర్తి ఆమెను ఎప్పుడూ 'లక్కీ' అనే పిలుస్తాడు. అలా పిలవటం అతనికి సంతోషంగా, ఈజీగానూ ఉన్నది.

లక్ష్మీ భర్త పవన్ కుమార్ ఏదైనా తప్పుగా అర్ధం చేసుకుంటాడో అని భయపడ్డాడు. కానీ అతను ఏమీ చెప్పలేదు. ఒక వేళ చక్రవర్తి నడుచుకునే విధం అతనికి నచ్చుండచ్చు. వాళ్ళ యొక్క క్లోజ్ కుటుంబ స్నేహితుడుగా అయిపోయాడు. మాటి మాటికీ వాళ్ళింట్లోనే భోజనం.

'అమ్మ వచ్చింది ' అనే పేరున్న ఆ పిల్లల అనాధ ఆశ్రమంలో పలు గొంతులు. పవన్ కుమార్ కూడా వచ్చాడు.

ముగ్గురూ కలిసి గబగబా పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి విందు వడ్డించారు.

ఆ రోజు లక్ష్మీ యొక్క పుట్టిన రోజు!

అంతా మంచిగా ముగిసింది.

బయటకు వచ్చిన తరువాత, చక్రవర్తి తన చేతిలో ఉన్న ఒక చిన్న బంగారు ఉంగరాన్ని తీసి పవన్ కుమార్ చేతికి ఇచ్చి "దీన్ని లక్కీ వేలుకు తొడగండి సార్" అన్నప్పుడు భయపడిపోయింది లక్ష్మీ.

"నో...నో...తీసుకోను..."

"ప్లీజ్... లక్కీ..."

"ఏమిటి చక్రవర్తి ఇది...ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉన్నారు...పోయిన వారం ఒక వెండి వినాయకుడు...అంతకు ముందు ఒక ట్యాబ్లెట్. దానికి ముందు వారం ఒక  పెద్ద కుక్క బొమ్మ...అన్నీ చాలా ఖరీదైనవి...నో...నో..."

"ప్లీజ్ లక్కీ...నాకు నచ్చింది...తొడగండి సార్"

పవన్ కుమార్ కల్లాకపటం లేని మనిషి.

"సార్ చెబుతున్నారు కదా...రా..." అని భార్యను పిలిచిన ఆయన, ఆమె వేలు పుచ్చుకుని ఉంగరం తొడిగారు.

తలతల మెరిసింది.

"థ్యాంక్స్ చక్రవర్తి..." అన్న లక్ష్మీ.

"ఇలా చూడండి చక్రవర్తి. ఇక మీదట బహుమతి ఏదీ ఇవ్వకూడదు. సరేనా.  స్నేహం గురించి ఒక అర్ధం చేసుకోవటానికే ఈ బహుమతులన్నీ ఒకరికొకరు ఇచ్చుకోవటం అవసరమే...అర్ధం చేసుకున్న తరువాత ఎందుకు ఈ బహుమతులంతా" అని నవ్వింది.

"పరవాలేదు లక్కీ. సారే ఓ.కే. చెప్పి వేలుకు తొడిగారే...నాకు ఇష్టమైన వాళ్లకు ఇలా బహుమతులు ఇవ్వడం నాకు అలవాటు"

మీ గురించి కూడా కొంత ఆలొచించండి చక్రవర్తి...భార్య లేదు. ఒంటరిగా హోటల్ అంటూ తింటున్నారు. మీ తల్లి-తండ్రులేమో గ్రామం నుండి  రానంటున్నారు...కొంచం సేవింగ్స్ చేసుకోండి"

"అన్నీ చూసుకుంటా లక్కీ. మీ స్నేహం నాకు వరం...మీరు ఆనందంగా  ఉండాలి...ఇంకేమీ చెప్పకండి"

పూర్ణాకి కూడా మొదట్లో ఆశ్చర్యంగానే ఉండేది. చక్రవర్తి చేష్ట చూసి.

షాపింగ్ వెళ్ళేటప్పుడు, ఇంటికి కావలసిన సరకులు కొనేటప్పుడు, ఏదైనా ఫాన్సీ బొమ్మలూ, గడియారం, చిన్న చాండిలీయర్ అని కొంటాడు.

"ఏమండీ వీటన్నిటినీ ఇంట్లో పెట్టటానికి చోటే లేదే..."

ఇవన్నీ మనకి కాదు

"మరి ఇంకెవరికి?"

"నాకు నచ్చిన వాళ్ళకి..."

"ఏం చెబుతున్నారు...?".........

"అవును పూర్ణా...! నాకు మంచి స్నేహుతులను సేకరించటం, అద్భుతమైన స్నేహాలను సెలెబ్రేట్ చేసుకోవటమూ చాలా ఇష్టం"

ఆమె ఏదైనా చెబుతుందని, చేతితో నుదిటి మీద కొట్టుకుంటుందని ఎదురు చూశాడు.

ఆమె అతనికి తగిన భార్యలాగా నవ్వుతుంది.

ఆ తరువాత అతనితో షాపింగ్ వెళ్ళేటప్పుడు ఏదైనా బార్బిక్యూ బొమ్మో, లేక పీంగానీ కప్పు సెట్టో చూస్తూ ఉంటే "ఇది ఎవరికి ఇద్దామని ఆలొచిస్తున్నారా?" అని అడగటం మొదలు పెట్టింది.

వీటన్నిటికంటే గొప్పగా, "మిమ్మల్ని తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది...ఇంత మంచి సుతిమెత్తని మనసు మీకి ఎప్పటికీ ఉండాలండీ..."

దాన్ని ఆమె అలా ఎందుకు చెప్పిందో తెలియలేదు. ఎక్కువ రోజులు బ్రతకనని ఆమెకు తెలిసిపోయిందో?

బాగానే ఉన్నది.

హఠాత్తుగా కడుపునొప్పి.

సరికాకపోవడంతో ఒక్కొక్క టెస్టూ చేస్తూ పరిశోధన చేస్తే చివరికి రిజల్ట్స్ వచ్చింది.

ఇంటెస్ టైన్ క్యాన్సర్.

అయిపోయింది.

అతని భుజం మీద పడిన మెత్తని చేతుల స్పర్ష తో తిరిగి చూశాడు.

లక్ష్మీనే.

అతను బహుమతిగా ఇచ్చిన ఉంగరం తలతలమని మెరుస్తోంది.

"సారీ చక్రవర్తి... పూర్ణా జ్ఞాపకం వచ్చేసిందో..."

మౌనంగా ఉండిపోయాడు.

ఆమెకూ, పవన్ కుమార్ కు పూర్ణా యొక్క గుణం గురించి, ఈ బహుమతుల విషయాలూ బాగా తెలుసు.

లక్ష్మీ ఒక సమూహ సేవకురాలు. పవన్ కుమార్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్.

చక్రవర్తి ఒక డిజైనర్ ఆర్టిస్ట్.

పవన్ కుమార్ ఆఫీసు ఇంటీరియర్ డెకోరేషన్ విషయంగా పరిచయమయ్యి , ఇప్పుడు కుటుంబ స్నేహితుడు అయ్యాడు. లక్ష్మీ వెళ్ళే అన్ని చోట్లకూ చక్రవర్తి నూ వెళతాడు. సినిమా, రాజకీయం, సంగీతం, ఆర్ట్ అంటూ అన్నిటి గురించి డిస్కస్ చేస్తారు.

కానీ ప్రతి ఒక్క విషయాన్నీ ఆమె పవన్ కుమార్ దగ్గర చెబుతుంది. దాచటం, అబద్దం చెప్పటం...లేని ఒక అద్భుతమైన స్నేహ చక్రం దోరకటం తలుచుకుని చక్రవర్తి పడ్డ సంతోషానికి హద్దేలేదు.

అనిపించినప్పుడంతా లక్ష్మీకి ఒక బహుమతి కొని ప్రెసంట్ చేస్తాడు.

"ఏమయ్యా చక్రవర్తి...నాకు ఎటువంటి బహుమతీ లేదా...? ఎప్పుడూ లక్ష్మీకేనా...?"

నవ్వుతూనే అడిగాడు.

"సార్...బాగా ఆలొచించి చూడండి....నాలుగు నెలలకు ముందు మీ పుట్టిన రోజు వచ్చింది...ఒక అందమైన ఇటాలియన్ పర్స్ ఇచ్చాను..."

"ఓ...అవును కదూ...సారీ...అయినాకానీ లక్ష్మీకే  ఎక్కువ..."

తగాదాకు లాగారు.

"సార్...ఆవిడ స్త్రీ సార్. మామూలుగా స్త్రీలకు బహుమతులు ఇవ్వటానికి స్కోప్ ఎక్కువ సార్...ఇంట్లోనే చూడండి...ఆడపిల్లగా ఉంటే లంగా, ఓణీ, స్కర్ట్, మిడి, చుఢీధార్,కలర్ బొట్లు, గోళ్ళ పాలీష్, లిప్స్ టిక్ ఇలా ఎన్నో. మగపిల్లవాడిగా ఉంటే ఒక ప్యాంటు, ష్ర్టుతో సరి..."

నవ్వాడు.

"అవును...మీరు చెప్పేదీ కరెక్టే" పవన్ కుమార్ ఆమోదించారు.

"చక్రవర్తి సార్" అంటూ హడావిడిగా వచ్చింది లక్ష్మీ.

ఒక ముఖ్యమైన కొటేషన్ కు టెండర్ రెడీ చేస్తున్నాడు అతను.

ల్యాప్ టాప్ కాంతివంతంగా ఉంది.

"వచ్చేవారం ఏమిటో తెలుసా...?"

"తెలుసే...నెక్స్ట్ వీక్"

"అయ్యో...ఇలా చెత్త జోకులు చెప్పి బోరు కొట్టకండి సార్. మా ఆయనకు బర్త్ డే..."

"అరే...అధరగొట్టేద్దాం. నేనేం చేయాలి..."

"ఆయన బిజినస్ విషయంగా డిల్లీ వెళ్తున్నారు...ఆయనతో పాటూ నన్ను రమ్మంటున్నారు...".

ఆమె కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది.

"ఓ...వెళ్ళి రండి...వెళ్ళిరండి..."

"మీ దగ్గర పర్మిషన్ తీసుకోవటానికి రాలేదు"

ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఎర్రటి గీతలు.

"మరి?"

"పుట్టిన రోజును కొంచం గ్రాండుగా సెలెబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరే క్యాటరింగ్, స్వాగతం, హాల్ అరేంజ్మెంట్స్ అంతా..."

"ఓ...విత్ ప్లజర్..."

"మీరు బహుమతలు కొనటంలో ఆరితేరిన వారు...అందుకని వచ్చేవాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ కొనుక్కు రావాలి..."

"డబుల్ ఓకే..."

ఆమె చెప్పి వెళ్ళిన వెంటనే అతను ఆలొచించటం మొదలుపెట్టాడు. చివరికి 'క్లిస్టర్ ఫ్లవర్స్' కొందాం అని నిర్ణయించుకుని, గెలెక్సీ స్టోర్స్ కు వెళ్ళి ఏడువందల పీసులకు ఆర్డర్ ఇచ్చి వెనక్కి తిరిగినప్పుడు,

షో కేసులో ఉన్న ఆ బొమ్మ కళ్ళల్లో పడింది.

చైనా పీంగానీ తో చేయబడిన అద్భుతమైన వీనస్ శిల.

అందమంటే అందం...అలాంటి ఒక అందం.

చూస్తూ నిలబడ్డాడు.

గబుక్కున మేల్కొన్నది అతని బహుమతి మనసు.

లక్ష్మీ!

ఆమెకే ఇది!

'రేయ్,పోయిన నెలే కదా ఆమెకు వెండితో చేసిన లవ్ బర్డ్స్ ప్రసెంట్ చేశావు. రెండు వారాలకు ముందు బంగారు ఉంగరం...ఇప్పుడు ఇదా? ఖచ్చితంగా ఒప్పుకోదురా...తప్పుగా అర్ధం చేసుకుని ఆమె భర్త నీ మీద చేయి చేసుకుంటాడేమో...!'

హెచ్చరించిన మనసును నవ్వుతూ నొక్కిపారేశాడు.

'నతింగ్ డూయింగ్. ఈ చక్రవర్తి అనుకున్నాడు, చెయ్య కుండా ఉండడు. ఆమె గురించీ తెలుసు, ఆమె భర్త గురించీ తెలుసు

నిర్ణయించుకున్నట్టే ఆ బొమ్మకు బిల్లు వేయమన్నాడు.

లక్ష్మీ ఇంటిని సమీపించాడు.

ఆమె ఖచ్చితంగా అతన్ని ఎదురు చూసి ఉండనే ఉండదు.

రేపు డిల్లీ బయలుదేరుతోంది. కనుక ఈ రోజే ఇచ్చేయాలి. మంచి విషయాలను వాయిదా వెయ్యకూడదు.

ట్రయల్ వేసి చూసుకున్నాడు.

ఆమె ఆశ్చర్యపోతుంది.

'ఎన్నిసార్లు చెప్పాను చక్రవర్తి. ఇలా కారణమే లేకుండా బహుమతి ఇవ్వకూడదని...'

'కారణం ఉంది. మీరు డిల్లీ వెళుతున్నారు. సేఫ్ గా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి...'

నవ్వుతుంది, వాడు వాడు అంటార్టికాకే వెళ్ళొచ్చి, శబ్ధమే లేకుండా కూర్చోనున్నాడు.

'వేలుకు తగిన వాపు లక్కీ...ఇదిగోండి. జాగ్రత్త...'

ఇల్లు వచ్చేసింది.

తలుపు కొట్టాలనుకున్నప్పుడు చిన్నగా తెరిచుంది.

కదలకుండా నిలబడ్డాడు.

లక్ష్మీనూ, ఆమె భర్త రిలాక్స్ గా కూర్చుని ఉండటాన్ని, గలగలమని నవ్వే శబ్ధంతో తెలుసుకోగలిగాడు.

తలుపు సందులో నుండి అతని పేరు వినబడటంతో ఆశ్చర్యపొయాడు.

"నాకూ ఆ అనుమానం ఉన్నదండీ...ఎందుకిలా బహుమతులుగా ఇస్తున్నాడు..."

'డు'అతని మనసును దెబ్బకొట్టింది.

"అదొక మేనియా లక్ష్మీ...బంధమూ కాదు, అభిమానమూ కాదు...దీంట్లో ఏదో ఖచ్చితమైన ఇంకో ఉద్దేశం ఉంది...ఆ ఉద్దేశమేమిటనేదే అర్ధం కావటం లేదు"

"ఉద్దేశం ఉండనివ్వండి...అతడి భార్య ఉండుంటే ఇలా ఉండనిచ్చేదా? దెబ్బ మీద దెబ్బ వేసేది కాదు"

ఆ మాటతో నిజాయతీ గుడ్డు చెదిరిపోయినట్టు నవ్వుల శబ్ధం.

చక్రవర్తి అలాగే శిలలా అయిపోయాడు. బహుమతిని గట్టిగా జారిపోకుండా పట్టుకుని వెనక్కి తిరిగాడు.

జీవితంలో మొట్టమొదటిసారిగా 'నెత్తిన పిడుగు పడితే ఎలా ఉంటుంది '  అని తెలిసింది అతనికి.

**************************************************సమాప్తం *******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మంచిదొక ఐడియా...(కథ)

ఏల్నాటి శని...(కథ)

పువ్వులో ఒక తుఫాన...(కథ)