స్పష్టత...(కథ)


                                                                             స్పష్టత                                                                                                                                                         (కథ)

"ఇలా ఎవరి దగ్గర చెప్పకుండా వచ్చేయటం పిచ్చివాళ్ళు చేసేపని...ఏమయ్యా...మీ కూతుర్లు దేనికోసం ఆ ఇంటిని అడిగారు? హాస్పిటల్ కట్టటానికే కదా? ఒక హాస్పిటల్ వస్తే ఎంతమందికి అది మంచి చేస్తుంది...ఉపయోగకరంగా ఉంటుంది..."

అయినా కానీ జీవానందం వల్ల ఒప్పుకోబుద్ది కాలేదు.

"లేదు...ఏది ఏమైనా ఆ ఇల్లు జానకీ ఆశపడి కట్టిన ఇల్లు. దాన్నిపోయి పగలకొడతామంటున్నది..."  

"మూర్ఖంగా మాట్లాడకు...ఇల్లు ఇల్లూ అని చెబుతున్నావే, రేపే ఒక పెద్ద వరదో, లేక భూకంపమో వచ్చి ఆ ఇల్లు పడిపోతే ఏం చేస్తావు? ఏమీ చెయ్యలేవు కదా. కానీ ఇప్పుడు నీ ఇల్లు ఒక మంచి కార్యానికి ఉపయోగపడబోతోంది...దాన్ని తలుచుకు సంతోషపడరా"

*********************************************************************************************************************

చీకటి పడుతున్న సమయం శంఖు తీర్థం మెట్లపై ఆలోచిస్తూ కూర్చున్నాడు జీవానందం. గుంపులు గుంపులుగా మనుషులు హడావిడిగా మెట్లలో దిగి రెడిగా ఉన్న యంత్రం కూర్చోబడ్డ దోరణితో కూర్చున్నారు...ఇంకా కొద్దిసేపట్లో గంగా హారతి మొదలవుతుంది. ఆ దృశ్యాన్ని చూడటానికి వేయి కళ్ళు కావాలి అంటూ పలువురు శిలలాగా నిలబడి ఉండటాన్ని జీవానందం చూశారు. దీని గురించి ఇంతకు ముందు విని ఉన్నారు.

"సార్... ఏమిటీ ఇక్కడ కూర్చోనున్నారు? హారతి చూడటానికి రావటం లేదా?"

కుటుంబ సమేతంగా మెట్లు దిగుతున్నఆయన మొదటి మెట్టుపైన కూర్చోనున్న జీవానందాన్ని అడిగారు. ఆయన కూడా జీవానందం బస చేస్తున్న మఠంలోనే ఉంటున్నారు.

"వస్తాను...మీరు వెళ్ళండి"

నోటి మాటగా చెప్పినా, జీవానందం మనసులో వేరే ఆలోచన మారుమోగుతోంది.

'ఇంకా కొద్ది సేపట్లో నేను గంగతో ఐక్యమై పోతాను...ఆ తరువాత నిత్య హారతే కదా?'

ఎదురుగా గంగ కొంచం తక్కువ వేగంతోనే ప్రవహిస్తోంది. చీకటి ఎక్కను, ఎక్కను వేగం ఎక్కువ అవుతుంది కదా? ఎక్కువ అయితే మంచిది...త్వరగా సంగమం అయిపోవచ్చు.

గంగలో చెత్త తేలుతూ వెళుతుంది...గుడ్డలు జరుగుతాయి...పువ్వులు మునిగి తేలుతాయి. కొన్ని సమయాలలో శవాలు కూడా తేలుతాయి...ఇవన్నీ జీవానందం ముందే విన్న వివరాలు...కానీ ఇప్పుడు అన్నీ మారి పరిశుభ్రంగా కనబడింది. ఒక వేల ఆయన లాంటి  వాళ్ళు సంగమిస్తున్నప్పుడు మొహం చిట్లించుకోకుండా, ప్రశాంతమైన మొహంతో ఐక్యం కావాల అనుకునే గంగ పరిశుభ్రం చేసుకుందో? ఆయనకు విచిత్రంగా అనిపించింది.

జన సమూహం తగ్గిపోవాలి...అటూ, ఇటూ చూశారు. మెట్ల చివర్లో ఎవరికీ కనబడని దాగే చోటు ఒకటుంది. లేచి ఆ చోటుకు వెళ్ళి దాగి కూర్చున్నాడు. ఇక ఎవరి కంటికీ ఈయన కనబడరు...ప్రశాంతంగా కాచుకోవచ్చు.

కాచుకోవటం మనసును వెనక్కి తీసుకు వెళ్ళింది.

జానకీకి ఎందుకంత తొందర?

ఆయన్ని ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోవటానికి ఆవిడికి మనసెలా వచ్చింది?

జానకీ ఉన్నంతవరకు అన్నీ సక్రమంగానే జరిగేయి కదా. ఇలాంటి పరిస్థితిని ఆయన కలలో కూడా ఊహించలేదే!

ఇద్దరు కూతుర్లు...ఇద్దరికీ మంచి చోట్లలో పెళ్ళి చేసిచ్చిన తరువాత జీవానందం మరియు జానకీ మాత్రమే...ఏ.జీ.ఎస్. ఆఫీసులో పెద్ద పదవిలోనుండి రిటయర్ అయిన ఆయనకి చెప్పుకో గలిగే పెన్షన్ వస్తోంది. డబ్బుకు కష్టం లేదు. సొంతంగా 10 సెంట్లలో కృష్ణా నగర్ లో సపరేట్ ఇల్లు. ఇప్పుడు సమస్య ఆ ఇంటి గురించే.

జానకీని పెళ్ళిచేసుకున్న తరువాతే జీవానందానికి జీవితంలో ఎదిగే దారి కనబడ్డది...సాధారణ గుమాస్తాగా ఉన్న జీవానందం, జానకీ ఇచ్చిన ప్రొశ్చాహంతో ప్రమోషన్ పరీక్షలు రాసి ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ పెద్ద పదవికి వచ్చి ఇంతవరకు చూడనటువంటి కాంతిని చూశాడు... ఇద్దరు కూతుర్లనూ బాగా చదివించాడు. ఇద్దరూ డాక్టర్లు అయ్యారు...వచ్చిన అల్లుడ్లు కూడా డాక్టర్లే.     

జానకీ ఉన్నంతవరుకు అదొక గలగలమంటూ, సంతోషంగా ఉండే కుటుంబం.

కారుమబ్బులు కమ్ముకున్న ఒక ప్రొద్దుటిపూట నిద్రలో నుండి మేల్కోక జానకీ హఠాత్తుగా సైలంట్ అయిన తరువాత కొంచం కొంచంగా సమస్యలు మొదలైనై.

"నాన్నా...కాలం చాలా పాడైపోయి ఉంది...ఇంతపెద్ద ఇంట్లో మీరు ఒంటరిగా ఉండటం రిస్క్"

ఒకరోజు సాయంత్ర సమయం పెద్ద కూతురు మొదలుపెట్టింది. జీవానందం అర్ధంకాక ఆమెనే చూశాడు.

"అక్కయ్య చెప్పేది కరెక్టే నాన్నా...ఇప్పుడు కాలం బాగా చెడిపోయి ఉంది...టీవీలలోనూ, పేపర్లలోనూ ఎన్ని వార్తలు వింటున్నాము. ఒంటరిగా ఉంటే ముసలివారిపై దాడి చేసి...హత్య, దోపిడి..."

చిన్న కూతురు కొంచం ధూపం వేసింది.

కొద్ది నిమిషాల తరువాత జీవానందం ఇద్దర్నీ తలెత్తి చూశాడు.

"ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు?"

ఇప్పుడు పెద్ద కూతురు తిన్నగా విషయానికి వచ్చింది.

"ఇప్పుడు మన ఇల్లు ఉన్న చోట ఒక హాస్పిటల్ కట్టేద్దాం నాన్నా...మీరేమీ డబ్బు ఇవ్వక్కర్లేదు. అదంతా మేము చూసుకుంటాము. ఈ చోటు మాత్రమే మాకు కావాలి"

జీవానందం గుండె గుభేలుమంది. ఈ ఇంటిని పడగోట్టటమా? ఆయన వరకు ఈ ఇల్లు పడగొడితే జానకీతో ఆయన జీవించిన జీవిత జ్ఞాపకాలను విరకొట్టి పారేయటం కదా అవుతుంది.

ఇల్లు కట్టాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు, చోటు వెతకటం ప్రారంభించి, అడయారులో కృష్ణా నగర్ లో ఈ స్థలాన్ని బ్రోకర్ మూలం తెలుసుకున్నాడు. ఈ చోటును చూసిన వెంటనే జానకీకి చాలా నచ్చింది.

"ఈ చోటు నేను అనుకున్నట్టే ఉంది. ఇక్కడొక ఇల్లు కట్టాలి. పెద్ద హాలు. పెద్ద వంటగది. వేరుగా ఒక పూజ రూము, ఆ తరువాత నాలుగు బెడ్ రూములు..."

"నాలుగు బెడ్ రూములా? ఎందుకు జానకీ?"

"ఒకటి మనకి...మన కూతుర్లు ఇద్దరూ వస్తే వాళ్ళకూ ఒక్కొక్క బెడ్ రూము, ఆ తరువాత ఎవరైనా రిలేషన్స్ వస్తే వాళ్ళకు ఒక రూము"

జానకీ ఇష్టపడినట్లే ఇల్లు కట్టి ముగించారు జీవానందం. ఆ ఇంటి ఒక్కొక్క ఇటికలోనూ  జానకీ యొక్క శ్వాస ఉన్నట్టు నమ్మారు...ఆమె లేకపోయినా జీవానందం దాన్ని  ఫీలవగలిగారు. మొదట్లో ఇల్లాలుగా ఉన్నది ఇప్పుడు జానకీ ఉండే గుడిలాగానే ఆయనకు అనిపించింది.

ఈ గుడిని పడగొట్టటమా?

"ఏం నాన్నా...ఏదీ చెప్పనంటున్నావు?" పెద్ద కూతురు జీవానందం ఆలొచనలను చెదరగొట్టింది.

"ఇంకా ఈ ఇంట్లో మీ అమ్మ ఉన్నదనే నమ్ముతున్నాను...ఇది ఆమె ఆశపడి కట్టిన ఇల్లు. నా కళ్ల ముందే పడగొట్టటం నేను సహించుకోలేను..."

"ఏమిటి నాన్నా ఇది...ఇదంతా పాతకాలపు సెంటిమెంట్...అమ్మ మన మనసులో ఉంది...అంతే...మీకు మేడపైన ఒక సపరేట్ అపార్టుమెంట్ కట్టిస్తాము"

"లేదమ్మా...నా వల్ల దాన్ని అంగీకరించుకో లేకపోతున్నాను. నా వరకు అమ్మ ఇంకా ఇక్కడే ఉంది...అందువలన నేను ఈ ఇంటిని పడగొట్టటానికి ఒప్పుకోను"

చిన్న కూతురుకి ఓర్పు నసించింది.

"నాన్నా...ఇంకా ఎన్ని రోజులకు ఇలా మాట్లాడుతూనే ఉండబోతారు? మాకు ఈ ఇంటిని ఇవ్వటం ఇష్టం లేకపోతే ఓపన్ గా చెప్పేయండి...అనవసరంగా అమ్మను ఇందులోకి లాగి సెంటిమెంట్ డ్రామా ఆడకండి"

జీవానందం చాలా ఆశ్చర్యపోయారు.

"ఇది డ్రామా కాదమ్మా...నా ఫీలింగ్...నా కాలం ఉన్నంతవరకు ఈ ఇల్లు ఇలాగే ఉండనివ్వండి...ఆ తరువాత మీరు ఏం చేసుకున్నా నాకు పరవాలేదు...ఎందుకంటే అది చూడటానికి నేను ఉండను కదా"

కానీ జీవానందం మాటలకు విలువ లేకుండా పోయింది...మొదట కూతుర్లు...తరువాత  అల్లుడ్లు...ఆ తరువాత అందరూ కలిసి బలవంతం చేయ...ఒక ఘట్టంలో విరక్తి కలిగి సంతకం పెట్టి ఆ చోటును జీవానందం కూతుర్లకు రాసిచ్చాశారు.

కానీ, సంతకం పెట్టిన తరుణం నుండి ఆయన ప్రాణం పోయినట్టు ఫీలయ్యారు.

వెంటనే హడావిడిగా ఇద్దరు కూతుర్లూ హాస్పిటల్ కట్టే పని మొదలుపెట్టారు. అది చూసిన జీవానందం నడిచే శవంలాగా అయిపోయాడు.

ఆ సమయంలోనే ఆ వార్త ఆయన కంటికి కనబడింది.

ఒక మహిళ జీవితంలో ఏర్పడ్డ బాధలు, శోకాలనూ తట్టుకోలేక కాశీ కి ప్రయాణించి అక్కడ గంగలో తనని సంగమించు కుందట.

వెంటనే జీవానందం కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నడుస్తున్న శవంలాగా  ఉండటం కంటే, ఎవరి దగ్గర చెప్పకుండా కాశీకి వెళ్ళి ఎవరు, ఏమిటీ అనేది తెలుసుకునే లోపు గంగలో ఐక్యమైపోవాలి.

నిర్ణయించుకున్న వెంటనే ఎవరి దగ్గర చెప్పకుండా కాశీకి బయలుదేరి వచ్చారు.

ఇదిగో...ఇంకాసేపట్లో...గంగ ఆయన్ని తనలో కలుపుకుంటుంది.

ఆ తరువాత ఆయన మనసును ఒత్తిడిలో ఉంచుతున్న భారానికి నిరంతర తీర్పు దొరుకిపోతుంది.

బాగా చీకటిపడి లైట్ల వెళుతురు ప్రకాశవంతంగా ఉన్నాయి. గంగా హారతి ముగిసి స్వాములు తిరిగి వెళుతున్నారు. జన సమూహం కూడా మెల్లగా మెట్లెక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇంకా కొద్దిసేపట్లో ఆ చోటు నిర్మానుష్యంగా ఉంటుంది. అదే ఆయన గంగలో సంగమించ సరైన తరుణం.

హఠాత్తుగా భుజం మీద చేయి పడింది.

భయంతో జీవానందం వెనక్కి తిరిగారు.

ఆయన స్నేహితుడు సుబ్బారావ్...ఇద్దరికీ పలు సంవత్సరాల పరిచయం...మనసు విప్పి మాట్లాడుకునేంత స్నేహం.

" సుబ్బారావ్...నువ్వేమిటి ఇక్కడ..."

అయోమయంగా జీవానందం అడగ, సుబ్బారావ్ ఆయనకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు.

"కుటుంబంతో సహా కలిసి కాశీయాత్ర వచ్చాను... గంగా హారతికి వెళ్లేటప్పుడు నువ్వు మెట్లమీద కూర్చోనుండటం చూశాను. కానీ, బోటులో ఎక్కటానికి అర్జెంటుగా పిలుచుకు వెళ్లారు...హారతి ముగిసి తిరిగి బోటులో వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరో ఒంటరిగా కూర్చోనుండటం కనబడింది. లైట్ల వెళుతురులో నీలాగా ఉన్నది. అందుకే నువ్వేనా అని చూడటానికి వచ్చాను. అవును, ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు?"

జీవానందం కొంచం సంశయించాడు...అస్తమించే ముందు మనసులోని భారాన్ని ఎవరి  దగ్గరైనా దింపేస్తే మంచిదనిపించింది...ఒక నిర్ణయం తీసుకున్నట్టు తాను గంగలో సంగమించబోతాను అనే విషయం తప్ప మిగిలిన విషయాలన్నీ చెప్పి బాధపడ్డారు.

"నువ్వే చెప్పు... జానకీ నిరంతరంగా ఉండే చోటు...దాన్ని పగలకొడతాం అని చెబితే నాకు ఎలా ఉంటుంది...అందుకే ప్రశాంతతను వెతుక్కుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చాను"

ఆయన చెప్పింది వింటున్న సుబ్బారావ్,

"ఇలా ఎవరి దగ్గర చెప్పకుండా వచ్చేయటం పిచ్చివాళ్ళు చేసేపని...ఏమయ్యా...మీ కూతుర్లు దేనికోసం ఆ ఇంటిని అడిగారు? హాస్పిటల్ కట్టటానికే కదా? ఒక హాస్పిటల్ వస్తే ఎంతమందికి అది మంచి చేస్తుంది...ఉపయోగకరంగా ఉంటుంది..."

అయినా కానీ జీవానందం వల్ల ఒప్పుకోబుద్ది కాలేదు.

"లేదు...ఏది ఏమైనా ఆ ఇల్లు జానకీ ఆశపడి కట్టిన ఇల్లు. దాన్నిపోయి పగలకొడతామంటున్నది..."  

"మూర్ఖంగా మాట్లాడకు...ఇల్లు ఇల్లూ అని చెబుతున్నావే, రేపే ఒక పెద్ద వరదో, లేక భూకంపమో వచ్చి ఆ ఇల్లు పడిపోతే ఏం చేస్తావు? ఏమీ చెయ్యలేవు కదా. కానీ ఇప్పుడు నీ ఇల్లు ఒక మంచి కార్యానికి ఉపయోగపడబోతోంది...దాన్ని తలుచుకు సంతోషపడరా"

"ఇదంతా చెప్పటానికి సులభం సుబ్బారావ్...కానీ చెయ్యటం..."

చెయ్యటం కూడా సులభమే...నన్నే తీసుకో...మా అమ్మా-నాన్న లు జీవించిన వారసత్వపు ఇల్లు...ఏమయ్యింది? పిల్లలు ఆశపడ్డారు కదా అని అది ఇప్పుడు అపార్టుమెంటుగా మారింది...కానీ నీ కూతుర్లు నీ ఇంటిని హాస్పిటల్ గా మార్చాలని అనుకుంటున్నారు. చాలా మంచి ఉద్దేశం...ఒకటి చెయ్యి, వాళ్ళు కట్టబోయే హాస్పిటల్ కు నీ జానకీ పేరు పెట్టమను. నీ దగ్గరున్న డబ్బుతో నువ్వొక ట్రస్ట్ ప్రారంభించి, అదే హాస్పిటల్లో పెదలకు ఉచిత వైద్యం అందేటట్టు ఏర్పాటు చెయ్యి. ఇలా చేస్తే నీ జానకీకి చాలా సంతోషంగా ఉంటుంది...పలు ప్రాణాలను కాపాడబోయే ఆ చోటు అందరికీ ఒక గుడిలాగానే కనబడుతుంది...కాబట్టి అనవసరంగా మనసును క్షోభ పెట్టుకోకు"

జీవానందం మౌనంగా ఆలోచించారు.

"జీవానందా...కాశీకి వస్తే గయా వెళ్ళి దేన్నైనా వదిలేయాలి అంటారు. నువ్వు నీ మనసులో ఉన్న సంచలనాన్ని వదిలేసి ఒక కొత్త మనిషిగా హైదరాబాదుకు వెళ్ళేదారి చూడు...చెప్పాల్సింది చెప్పాను...ఆ తరువాత నీ ఇష్టం"

సుబ్బారావ్ లేచి వెళ్ళారు.

జీవానందం కాసేపు గంగనే చూస్తూ ఉండిపోయాడు.

గంగలాగానే ఆయన మనసులోనూ క్లియర్ ఫీలింగ్.

కొత్త ఉత్సాహంతో జీవానందం మెట్లమీద నుండి లేచి బయలుదేరారు.

*****************************************************సమాప్తం*************************************** 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

హక్కు...(కథ)