రహస్యం…(కథ)
రహస్యం (కథ)
బంగార్రాజు--ఈశ్వరయ్య మంచి స్నేహితులు. వాళ్ళిద్దరి స్నేహం గట్టిపడి, లోతుగా వెళ్ళటంతో ఇరు కుటుంబ బంధువులూ ఒకరికొకరు స్నేహంగా ఉన్నారు.
ఈశ్వరయ్యకు వ్యాపారంలో పెద్ద అండగా నిలబడింది బంగార్రాజే. అప్పుడప్పుడు వచ్చి ఆలొచన చెప్పేవాడు.‘ఇది కొని పడేయరా, అది కొని పడేయరా...’ అని ఆసక్తి చూపించి, డబ్బుతోనూ, మనసుతోనూ ఎక్కువగా తోడుగా ఉండేవాడు. ఇవేవి మరిచిపోవటమనేది జరగదు.
గుర్తుపట్టలేని కొన్ని సమస్యలు ఇద్దరి మద్యా మొలచినై. ఆ సమస్యలకు సంబంధమే లేని కొందరు వచ్చి, నీళ్ళుపోసి పెంచి పారేసారు. చెప్పుడు మాటలకు తల ఊపి, ఇద్దరూ ఒకొర్ని ఒకరు కోపంతో చూసుకుని నిలబడ్డారు.
స్నేహం ముఖ్యంగా ఉండేటప్పుడు, డబ్బు పెద్దదిగా అనిపించదు. స్నేహం మొద్దుబారిపోయినప్పుడు, చిన్న విషయాలు కూడా పెద్దగా మాట్లాడబడి, ఒకరోజు షాపు ముందు ఒకరి మీద ఒకరు చేతులు చేసుకుని, పోట్లాడుకుని, కిందపడి మట్టిలో దొర్లుతున్న నిమిషంలో ఆ స్నేహానికి క్లోసింగ్ సెర్మనీ జరిగింది.
ఈశ్వరయ్య కుటుంబంలో జరిగిన ఒక సంఘటనను బంగార్రాజు అడ్డుకున్నాడు. ఆ సంఘటనను రహస్యంగా ఉంచమని సలహా ఇచ్చింది బంగార్రాజే.
స్నేహితుల ఇద్దరి మధ్యా గొడవ జరిగి స్నేహం చెడిపోయింది కాబట్టి వాళ్ళు స్నేహంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన రహస్యంగానే ఉంచబడిందా, లేదా అనేదే ఈ కథా సారాంశం.
*****************************************************************************************************
పని చేస్తున్న
సమయంలో ఇంటి
నుండి పిలుపు
వచ్చినప్పుడు చురుక్కున
కోపం వచ్చింది
ఈశ్వరయ్యకు. క్యాష్
కౌంటర్ ను
ఇంకొకరికి అప్పజెప్పి, సెల్
ఫోనును తీసుకుని
షాపు బయటకు
వచ్చాడు అతను.
వేస్తున్న ఎండకు
నుదుటి నుండి
నీళ్ళు కారి
కనుబొమ్మలను స్నానం
చేయించ, ఉప్పు, చింతపండు
మూటల గోనె
సంచి వాసన
ఇంకా అతని
శ్వాసను కష్టపెడుతున్నది.
“ఏమిటి
అంజలీ...? వ్యాపార
సమయంలో పిలిచి
ప్రాణం తీస్తున్నావు...?” ఘల్లుమని
విసుగుతో అడగగానే, అవతలివైపు
బంతాడక నిదానం
చూప, కొంచం
ఆశ్చర్యంగా ఉన్నది
అతనికి.
“అరే...!
ఎందుకు పిలుస్తాను...? ముఖ్యమైన
మాట చెప్పటానికే!
కాకినాడ నుండి
రాజేశ్వరరావు గారు
వచ్చారు”
నుదుటి మీద
తడిగా ఆలోచన
పరిగెత్త, అరచేత్తో
తుడుచుకున్నాడు.
“ఎందుకట...? వాడి
గురించి ఏదైనా
మాట్లాడారా...?”
“ఎవరికి
తెలుసు...? ఎప్పుడూలాగానే
మాట్లాడారు. మజ్జిగ
ఇచ్చి కూర్చోబెట్టాను.
మిమ్మల్ని
చూసే వెళ్తానని
చెప్పారు” స్వరాన్ని
తగ్గించి మాట్లాడినప్పుడే
అర్ధమయ్యింది.
“ఊ...!
సరి పెట్టేయి.
నేను పదినిమిషాల్లో
వచ్చేస్తాను. భోజనం
రెడీగా ఉందిగా...? వచ్చేటప్పుడు
నంచుకోవడానికి
ఏదైనా తీసుకు
వస్తాను. మటన్, చేప
ఏదైనా తీసుకురావాలా...?”
“గురువారం
నీచు తినరట.
వచ్చిన వెంటనే
చెప్పారు. ఉండేది
పెట్టమ్మా, పనికట్టుకుని
ఏదీ చెయ్యద్దు” అన్నారు.
అటువైపు తల
ఊపింది తెలియబోతుందా...? దాని
గురించి ఆలోచించకుండా, ఫోనును
జేబులో వేసుకున్నారు.
షాపులో జనం
ఎక్కువ అయ్యారు.
పని వాళ్ళతో
చెప్పి ‘టీవీఎస్’
బండిని స్టార్ట్
చేసుకుని ఎండలో
కలిసాడు.
మనసంతా ఏదేదో
ఆలొచనలు అలలలాగా
పైకిలేచి పిచ్చి
ఆటలు ఆడుతున్నాయి.
ఆలొచనలకు మధ్యే
అన్నపూర్ణా స్వీట్స్
షాపులోకి వెళ్ళి
పావుకిలో మైసూరు
పాక్, పావు
కిలో పకోడీ
కట్టించుకుని ఇంటికి
వచ్చినప్పుడు, ఆయన్ని
ఎలా ఎదుర్కోవాలి
అని మనసులో
ధర్మ సందేహం
ఏర్పడి మనసంతా
వ్యాపిస్తూ ఉన్నది.
సిట్ అవుట్
లో కూర్చోనున్న
రాజేశ్వరరావు, అతన్ని
చూసినప్పుడు అదే
పాత స్నేహం
మొహమంతా పొర్లిపారగా
లేచి వచ్చారు.
“ఈశ్వరయ్యా, ఎలా
ఉన్నావయ్యా...?” ఈశ్వరయ్య
కంటే ముందు
ఆయనే అతన్ని పలకరించారు.
అదే మహా
ఆనందం అనిపించంది
అతనికి.
“బాగున్నా
మావయ్యా. ఊర్లో
అక్కయ్య, పిల్లలు
ఎలా ఉన్నారు...?”
“బ్రహ్మాండంగా
ఉన్నారు” అన్న ఆయన్ని--ఆయన
భుజం మీద
చేతులు వేసి
లోపలకు తీసుకు
వెళ్ళాడు. కుర్చీని
ఆయనవైపుకు తిప్పి
ఉంచి, సహజంగా
మాట్లాడుతున్నట్టు
మాట్లాడుతున్నా, అతని మనసు
‘ఆయన
ఎందుకు వచ్చుంటాడు?’ అనే
ఆలొచనలోనే ఉండిపోయింది.
కాళ్ళూ, చేతులూ
కడుక్కుని లోపలకు
వచ్చిన సమయం, అంజలీ
వడియాలు వేయించి
గిన్నెలో సర్దుతూ
ఉన్నది. అర్జెంటుగా
స్టవ్వు ఆపి, భర్త
దగ్గరకు వచ్చింది.
“ఏదైనా
కోపంగా మాట్లాడారా...?” అని
అడిగింది, అత్యంత
రహస్య స్వరంతో.
“ఏం
నీ దగ్గర
ఏమైనా మాట్లాడారా...?”
“లేదు.
వచ్చిన వెంటనే
కుశల ప్రశ్నలు
వేశారు. కుశుమా
చదువు, ఉద్యోగం
గురించి అడిగారు.
అంతే. మాట్లాడకుండా
కూర్చున్నారు. నాకెందుకో
ఈయన బంగార్రాజు
పంచయతీ తీసుకు
వచ్చారేమో నని
అనిపిస్తోంది”
‘బంగార్రాజు
అన్నయ్యా!’...అనే
గౌరవ పూర్వమైన
పిలుపును మరిచిపోయింది
భార్య అనేది
బాగానే అర్ధమయ్యింది.
అవసరానికి మర్యాద
ఇచ్చే, రహస్య
మంచివారి
వల్ల, ఈ
లోకంలో ఏం
మార్పు వచ్చేస్తుంది
అనేది తెలియలేదు.
కోపం వచ్చిన
వెంటనే, మనుష్యులు
మర్యాద కోల్పొతారా
అనేదీ అర్ధం
కాలేదు.
“సరే, సరే
చూసుకుందాం. వెళ్ళి
మొదట అరిటాకు
వెయ్యి. చెప్పాల్సింది
చెప్పకుండా వెళ్ళిపొతారా.
దానికి ముందే
ఆలొచించి ఎందుకు
మన మనసులను
పాడుచేసుకోవటం” -- స్నానాల గదిలోకి
వెళ్ళి తలుపు
వేసుకోగానే ఈశ్వరయ్య
బుర్ర తనకు
తానే విశాలమైంది.
బంగార్రాజుకీ -- ఈశ్వరయ్యకూ
మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు
ఉండటం వలన
వాళ్ళిద్దరి
మధ్య చాలా
రోజుల స్నేహం
ఉండేది. వాళ్ళిద్దరి
స్నేహం గట్టిపడి, లోతుగా
వెళ్ళటంతో ఇరు
కుటుంబ బంధువులూ
ఒకరికొకరు స్నేహంగా
ఉన్నారు.
విజయవాడలో షాపు
చూసి వ్యాపారం
మొదలుపెట్టినప్పుడు, ఈశ్వరయ్యకు
పెద్ద అండగా
నిలబడింది బంగార్రాజే.
అప్పుడప్పుడు వచ్చి
ఆలొచన చెప్పేవాడు.
‘ఇది
కొని పడేయరా, అది
కొని పడేయరా...’ అని
ఆసక్తి చూపించి, డబ్బుతోనూ, మనసుతోనూ
ఎక్కువగా తోడుగా
ఉండేవాడు. ఇవేవి
మరిచిపోవటమనేది
జరగదు.
నలిగిపోయిన కాగితమూ
ఒక సమయంలో
కవిత్వం రాసేంత
కొత్త కాగితంగానే
ఉండుంటుంది కదా...?
గుర్తుపట్టలేని
కొన్ని సమస్యలు
ఇద్దరి మద్యా
మొలచినై. ఆ
సమస్యలకు సంబంధమే
లేని కొందరు
వచ్చి, నీళ్ళుపోసి
పెంచి పారేసారు.
చెప్పుడు మాటలకు
తల ఊపి, ఇద్దరూ
ఒకొర్ని ఒకరు
కోపంతో చూసుకుని
నిలబడ్డారు.
స్నేహం ముఖ్యంగా
ఉండేటప్పుడు, డబ్బు
పెద్దదిగా అనిపించదు.
స్నేహం మొద్దుబారిపోయినప్పుడు, చిన్న
విషయాలు కూడా
పెద్దగా మాట్లాడబడి, ఒకరోజు
షాపు ముందు
ఒకరి మీద
ఒకరు చేతులు
చేసుకుని, పోట్లాడుకుని, కిందపడి
మట్టిలో దొర్లుతున్న
నిమిషంలో ఆ
స్నేహానికి క్లోసింగ్
సెర్మనీ జరిగింది.
ఇద్దరి కుటుంబాలకు
మధ్య రాకపోకలు
తానుగా ఆగిపోయినై.
ఇంట్లోని ఆడవారు
గౌరవ మర్యాదలను
మరచి స్నేహానికి
ఒకమైలు దూరంగా ఉండేవారు.
మూడు సంవత్సరాల
తరువాత అక్కడ్నుంచి
ఇక్కడికి వచ్చిన
ఈశ్వరయ్య, బంగార్రాజు
యొక్క అక్కయ్య
భర్త రాజేశ్వరరావు
ఎందుకు తనని
చూడటానికి ఇక్కడికి
వచ్చారో అనే
ఆలొచనే ఈశ్వరయ్యను
ఏదో చేస్తోంది.
“నాకు
పెరుగు అన్నంలో
నంచుకోవటానికి
మైసూర్ పాక్
ఇష్టమని గుర్తుంచుకుని
కొనుక్కొచ్చావే
ఈశ్వరయ్యా” అని రాజేశ్వరరావు
అన్నప్పుడు, ఏమీ
మాట్లాడకుండా నవ్వుతూ
ఆయన్నే చూస్తూ
ఉండిపోయాడు ఈశ్వరయ్య.
వచ్చిన దగ్గర
నుండి బంగార్రాజు
గురించి ఒక్కమాట
కూడా విచారించలేదు
ఈశ్వరయ్య. ‘డబ్బుకు
ముఖ్యత్వం ఇచ్చి
స్నేహాన్ని తెంపుకున్న
బంగార్రాజు ఎలాపోతే
మనకేంటి’ అనే
ఆలొచనే ఈశ్వరయ్య
బుర్రను పూర్తిగా
ఆక్రమించుకోని
ఉన్నది.
“కుశుమా
పాప విషయం
గురించి మాట్లాడటానికే
ఇక్కడికి వచ్చాను” అని రాజేశ్వరరావు
అన్నప్పుడు ఈశ్వరయ్య
దంపతులు చూపులను
షార్ప్ చేసుకుని
ఒకర్నొకరు చూసుకున్నారు.
“మా
తమ్ముడు కొడుకు
ఏ.పి.ఆర్.ఏస్.టీ
లో అధికారిగా
ఉంటున్నాడు. ఇరవై
ఏడు ఏళ్ళ
వయసు అవుతోంది.
లక్షణంగా ఉంటాడు.
ఇంటికి ఒకడే
కొడుకు. ప్రభుత్వ
ఉద్యోగం. హైదరాబాద్
లో ఉన్నాడు.
అమ్మాయిని చూడమని
తమ్ముడు నా
దగ్గర చెప్పిన
వెంటనే, ఎందుకనో
కుశుమా పాప
ఆలొచనే నాకు
వచ్చింది”
గబుక్కున ఈశ్వరయ్య
మనసులో అనుమానం
మొలిచింది. దాన్ని
మొహంలో కనిపించకుండా
మౌనంగానే కూర్చున్నాడు
ఈశ్వరయ్య. కానీ, అతనికి
లోలోపల
ఏదో
తెలియని అలజడి, ఆందోళన
చోటుచేసుకుంది.
‘ఈయన
బంగార్రాజును చూసి
వచ్చుంటాడో...? అలాగైతే
రాజేశ్వరరావు ఎలా
దీనికి అంగీకరించి
ఉంటాడు...?’ చిల్లు
చేసుకుని లోపలకు
దూరే నత్తలాగా
ఆలొచన అతని
మెదడును రంద్రం
చేసింది.
“మంచి
విషయమే మావయ్యా.
ఈ విషయం
అందరికీ తెలుసా...? అందరూ
ఏం చెప్పారు...” అని ఈశ్వరయ్య
సీరియస్ గా అడిగేటప్పటికి
రాజేశ్వరరావు అతన్ని
విచిత్రంగా చూసాడు.
"పొగను
ఆపగలిగే మూత
ఎక్కడుంది ఈశ్వరయ్యా...? నిన్ను
చూసి మాట్లాడి
వస్తానని అందరి
దగ్గర చెప్పే
వచ్చాను” -- అని
అన్నప్పుడు ఈశ్వరయ్యకు
కొంచం కూడా
నమ్మకం కలగలేదు.
ఈ పెళ్ళి
గురించిన మాటలు
శుభంగా ముగిస్తాయా, లేదా
అనేది ఆ
దేవుడికే తెలుసు.
కానీ, ఈ
విషయాన్ని పెట్టుకుని
బంగార్రాజు తన
కోపాన్ని వేడి
చేసుకోవటానికి
వెయ్యు దార్లు
ఉన్నాయే.
పది సంవత్సరాలకు
ముందు. అప్పుడు
కుశుమా పదో
క్లాసు చదువుతున్నది.
ఆ వయసుకు
ఉండాల్సిన చురుకుదనం, కలలూ
ఎప్పుడూ కళ్ళల్లో
ఉంటుంది.
స్పేషల్ క్లాసు
అని చెప్పి
కుశుమా ఎప్పుడు
చూడూ బయటకు
వెళ్ళటాన్ని అప్పుడు
పెద్దగా పట్టించుకోలేదు.
ఒక రోజు
పొద్దున్నే ట్యూషన్
స్పేషల్ క్లాసు
కని చెప్పి
బయలుదేరి వెళ్ళింది
కుశుమా. ఒక
గంటసేపు అయ్యుంటుంది.
షేవింగ్ చేసుకోవటానికి, షేవింగ్
క్రీమ్ మొహమంతా
పూసుకుని, అద్దం
ముందు నిలబడి
మొహం చూసుకుంటున్నప్పుడు
సెల్ ఫోను
మోగింది.
ఫోనులో బంగార్రాజే.
ఒక చోటును
చెప్పి వెంటనే
బయలుదేరి రమ్మని
చెప్పాడు. ఏమైయుంటుందా
అని ఆలొచిస్తూ
వెళ్ళిన ఈశ్వరయ్య
అక్కడి దృశ్యాన్ని
చూసి ఆశ్చర్యపోయి
నిలబడ్డాడు.
స్కూలు స్పేషల్
క్లాసు ట్యూషన్లో
ఉండవలసిన కూతురు, యూనీఫారంలో, పుస్తకాల
సంచీని గుండెలకు
హత్తుకుని, కళ్ళల్లో
ఆందోళనతో అక్కడ
నిలబడుంటటాన్నిచూసిన
వెంటనే పూర్తిగా
విరిగిపోయాడు ఈశ్వరయ్య.
జరిగింది ఊహించుకోగలిగాడు.
కోపంతో కళ్ళు
ఎర్రబడ్డాయి.
“ఈశ్వరయ్యా నువ్వేమో
షాపే గతి
అని పడుంటావు.
చెల్లెమ్మ ఇల్లు, సీరియల్
అని తన
పనులు మాత్రమే
చూసుకుంటూ ఉంటుంది.
రెక్కలు మొలిచే
సమయంలోనే, పక్షుల
మీద మనం
ఎక్కువ శ్రద్ద
పెట్టాలి. ప్రేమ, దోమ
అనే మురికిని
చెప్పేసి పారిపోదలచుకున్న
నీ బిడ్డను, నేను
మాత్రం గమనించకుండా
పోయుంటే ఏం
జరిగుంటుంది...!”
ఆగ్రహంతో చేయెత్తి
ముందుకు కదిలిన
ఈశ్వరయ్యని, అలాగే
చెయ్యి పుచ్చుకుని
పక్కకు లాక్కుని
వచ్చాడు.
“ఎవరికీ
తెలియని విషయాన్ని, నీ
అరుపులతో ఊరంతటికీ
తెలిసేటట్టు చేయకు.
బెదిరించి, మందలించి, బుద్ది
చెప్పి ఉంచాను.
నువ్వూ, చెల్లెమ్మా
కూర్చుని మాట్లాడండి.
ఇక మీదట
బాగా శ్రద్దగా
ఉండండి” అని చెప్పి
పంపించాడు.
కూతుర్ను ఇంటికి
పిలుచుకు వచ్చి, ఏడ్చి
పెడబొబ్బులు పెట్టి, దారి
మళ్ళితే కన్నవారు
ఉరి వేసుకుని
చచ్చిపోతాం అని
బెదిరించి భయపెట్టారు.
కుశుమా అర్ధం
చేసుకుంది. వయసు
రాను రానూ
పరిపక్వత చెంది, ప్రేమ
ఆలొచనను వదిలేసి
ఈ రోజు
పెద్ద ఉద్యోగం
చేస్తోంది.
ఆ రోజు
బంగార్రాజు చేసిన
మంచి కార్యం
వలన, అతనిపై
ఇంకా విశ్వాసం
పెరిగింది. కానీ, పోట్లాట
వచ్చినప్పుడు, కోపంలో
నోటి నుండి
వచ్చిన మాటలు
ఇంకా ఈ
రోజుకీ మనసులో
మంటలు రేపుతూనే
ఉన్నాయి.
“ఈశ్వరయ్యా...” -- రాజేశ్వరరావు
పిలుపు అతన్ని
ఈ లోకానికి
లాక్కుని వచ్చింది.
“చెప్పండి
మావయ్యా?”
“ఏమిటి
మౌనంగా ఉన్నావు.
అబ్బాయికి నేను
గ్యారంటీ, కుశుమా
పాపతో మాట్లాడి
కబురు చెబితే, మంచి
రోజు చూసుకుని
పెళ్ళి చూపులకు
వస్తాం”
“దీని
గురించి బంగార్రాజు
దగ్గర మాట్లాడారా...?”
“మాట్లాడాను.
‘బంగారం
లాంటి అమ్మాయి.
దారాళంగా మాట్లాడండి’ అని
చెప్పాడు.
‘నాకూ, వాడికీ
మధ్య పెద్ద
గొడవే జరిగింది.
అందుకని ఎటువంటి
సంభాషణలకూ
నన్ను పిలవద్దు’ అని ముందుగానే
చెప్పాడు. మంచి
స్నేహితులుగానే
ఉండేవారు. మీకిద్దరికీ
పగుళ్ళు వచ్చింది.
మాకందరికీ బాధ
అనిపించింది. చెప్పుడు
మాటలే అన్నిటికీ
కారణం” అంటూ
బాధ పడ్డారు
రాజేశ్వరరావు.
“ఇంకేమీ
చెప్పలేదా...?” నమ్మకం
లేక అడిగాడు
ఈశ్వరయ్య.
“లేదే...అలా
ఏమన్నా ఉన్నదా...?” -- అడిగారు
కళ్ళు చిన్నవి
చేసుకుని.
తమాయించుకుని అంజలిని
కళ్లతోనే చూస్తూ
నిలబడ్డ ఈశ్వరయ్య ‘కుశుమాతో
మాట్లాడి పెళ్ళి
చూపులకు పిలుస్తాను’
అని చెప్పటంతో
రాజేశ్వరరావు బయలుదేరి
వెళ్ళారు.
ఈశ్వరయ్య మనసు
ఏదో చేస్తోంది.
మనసులో ఏదో జరుగుతోంది.
ఇప్పుడు అతని
పక్కన ఉన్న
న్యాయం అంతా
వరద నీరు
ఎండిపోయినట్టు
అయిపోవటంతో, బురద
లాగా నేర
భావన అతని
ఒళ్ళంతా పాకింది.
‘...గొడవ, విడిపోవటం
అని వచ్చిన
తరువాత కూడా ఆ రోజు మన
కూతురు చేసిన
ఘనకార్యాన్ని, రహస్యంగానే
ఉంచేడంటే, మనమే
మంచి స్నేహితుడ్ని
పోగొట్టుకున్నం
అనే అర్ధం.
అతను మనమీద
చూపింది స్వార్ధం
లేని స్నేహం, అభిమానం.
మనమే అతనితో
నిజంగా లేమూ
అని అర్ధం’ ఎప్పుడో చదివిన
వార్త మనసులో
భారం నింపగా, వేగంగా
సెల్ ఫోను
తీసుకుని, బంగార్రాజు
యొక్క పాత
ఫోటోను వెతికి
తీసి ఒకసారి
చూపులతోనే అతన్ని
హత్తుకున్నాడు ఈశ్వరయ్య.
***************************************************సమాప్తం******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి