మానవ వృక్షాలు...(కథ)
మానవ వృక్షాలు (కథ)
70% టేకు ఫర్నిచర్ అక్రమంగా పండించిన కలపతో తయారు చేయబడిందని దీని అర్థం.అయితే టేకు ఫర్నిచర్ కోసం డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటే, చాలా ముక్కలు నిజంగా చట్టవిరుద్ధం. అదనంగా, చట్టవిరుద్ధమైన కలపను తరచుగా అపరిపక్వ టేకు చెట్ల నుండి తయారు చేస్తారు, ఇవి తక్కువ రక్షిత నూనెలు మరియు నీటి శాతం ఎక్కువగా ఉంటాయి.
అతిగా టేకు చెట్లను కత్తిరించడం వల్ల , టేకు ఇప్పుడు దాదాపు అంతరించిపోతున్నట్లుగా వర్గీకరించబడింది. ఈ అధిక దోపిడీ ఫలితంగా అటవీ నిర్మూలన జరిగింది, దీని ఫలితంగా ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో భారీ వరదలు సంభవించి వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. పర్యావరణానికి జరిగే నష్టం లెక్కించలేనిది.
ఈ కథలో చట్ట విరోధంగా కొనబడిన టేకు వలన ఒక మంచి మనిషి నష్టపోతాడు. తమ స్వార్ధంకోసం చెట్లను దొంగతనంగా నరికి వ్యాపారం చేస్తున్నవారిని మానవ వృక్షాలుగా చెప్పబడింది. మిగితాది కథ చదివి తెలుసుకోండి.
***************************************************************************************************
చంద్రుడు, కొబ్బరి
ముక్కలాగా కనబడుతున్నాడు.
నక్షత్రాలు,
చిందిన వెండి
ముక్కలలాగా కనబడుతున్నాయి. అక్కడక్కడ
నల్లటి మేఘాలు
కరివేపాకు, కొత్తిమేర
కట్టలలాగా దర్శనమిచ్చినై.
ఆకాశం కళ్ళకు
రుచికలిపించే మాసాలాలాగా
ఉన్నది.
రాత్రి పది
దాటింది. గోపీకృష్ణకు
నిద్ర రాలేదు.
ఆరు నెలల
గర్భిణీ భార్య
కాంచనా అతని
పక్కనే నిద్రపోతోంది.
‘రేపు
చిన్నపిల్లలకు
నడక అలవాటు
కావటం కోసం
పిల్లలు నడిపించే
మూడు చక్రాల
చెక్కబండి తయారు
చేయాలి. ఉయ్యాల, చిన్న
చిన్న బొమ్మలూ
అన్నీ చెక్కతోనే
చేసి ఉంచుకోవాలి.
ప్లాస్టిక్ బొమ్మలు
కొనకూడదు’ అని
ఆలొచించాడు. తనకి
మొట్టమొదటిసారిగా
డాక్టర్ బంగళా ఇంటికి
చెక్కపని కాంట్రాక్ట్
రావటం గురించే
రాత్రీ-పగలూ
అతనికి ఆలొచన.
ప్రభుత్వ ఆసుపత్రి
డాక్టర్ రామమోహన్
కడుతున్న కొత్త
బంగళాకు చెక్కపని
కాంట్రాక్ట్ తీసుకున్నాడు
గోపీకృష్ణ. తలుపులు, గుమ్మాలూ, కిటికీలు, వెంటీ
లేటర్లు
మాత్రమే కాకుండా
డైనింగ్ టేబుల్, కుర్చీలూ, స్టడీ
టేబుల్, సోఫాలు, డ్రస్సింగ్
టేబుల్, కబోర్డులు
అంటూ ఇంటికి
కావలసిన అన్ని
చెక్క వస్తువులను
గోపీకృష్ణే చేసి
ఇచ్చేటట్టు ఒప్పందం.
ఈ ఒప్పందం
తీసుకోవటానికి
చాలా ఎక్కువ
పోటీ ఉన్నది.
ఎందుకంటే అది
లక్షల్లో లాభం
తెచ్చిపెట్టే పని.
డాక్టర్ దగ్గర
కాంపౌండర్ గా
పనిచేస్తున్న రమణ
తన బావమరిదిని
డాక్టర్ కు
రెకమెండ్ చేసాడు.
ఇతర డాక్టర్
స్నేహితులు ‘లోకల్
లో ఏ
కార్పెంటరూ సరిలేడు.
బయట సిటీలో
నుండి కార్పెంటర్లను
తీసుకురండి’ అన్నారు.
కానీ డాక్టర్
కు గోపీకృష్ణే
నచ్చాడు. ఒకసారి
చెక్క పనిముట్టు
జారి కాలుమీద
పడి, కాలి
వేళ్ళు సగానికి
దెబ్బతిని
రక్తం కారుతుంటే
ఈ డాక్టర్
దగ్గరకు వచ్చి
ట్రీట్మెంట్ తీసుకున్నాడు
గోపీకృష్ణ. కట్టు
కట్టించుకుని, ఇంజెక్షన్
చేయించుకుని, మందులు
రాయించుకున్నాడు.
గాయం పూర్తిగా
తగ్గేంతవరకు పదిరోజులకుపైనే
ఆయన దాగర
ట్రీట్మెంటుకు
వెళ్ళాడు. దాంతో
అతనికి డాక్టర్
తో బాగా
పరిచయం అయ్యింది.
ఆ పరిచయం, అదే
ఊర్లో ‘టేకు
కలప’ షాపు
పెట్టుకున్న గోపీకృష్ణ
మామగారి
పలుకుబడి కూడా
కలిసి కాంట్రాక్ట్
దొరకటానికి ఒక
దారి వహించింది.
ఎటువంటి చెడు
అలవాట్లూ లేని
న్యాయమైన కార్పెంటర్
పనిమంతుడైన అతన్ని
కలప వ్యాపారం
పెట్టుకున్న ఆయనే
అతనికి పిల్లనిచ్చాడు.
తనతో కలిసి
పని చేయటానికి, తనకు
సహాయంగా ఉండటానికి
నలుగురు దిన
కూలీ కార్పెంటర్లను పనికి
పెట్టుకున్నాడు.
పేరు చెడిపోకుండా
ఉండటానికి ఎక్కువ
లాభం మీద
ఆశ పెట్టుకోకుండా
మంచి టేకు
చెక్కలను చూసి, చూసి
ఎన్నుకున్నాడు.
అతనికి ఈ
బంగళానే మొదటి
కాంట్రాక్ట్. ఇంతకు
ముందు వరకు
గోపీకృష్ణ మరో
కాంట్రాక్టర్ దగ్గర
దిన కూలీ
కార్పెంటరుగా పనిచేస్తూ
ఉండేవాడు.
ఎంట్రన్స్ గుమ్మం, తలుపులు
తయారుచేయటంలోనే
తన పనితనాన్ని
చూపి డాక్టర్
కుటుంబాన్ని ఆశ్చర్యపరిచి, సంతోషపెట్టాడు.
స్త్రీల ఉంగరాల
డిజైన్ చెక్కినట్టు, తలుపులకు, గుమ్మానికీ
డిజైన్ చెక్కాడు.
ఉప్పుకాగితంతో
నున్నగా చేసి
వార్నీష్ రాసి
బంగారంలాగా మెరిసిపోయేటట్టు
తయారుచేసి నిలబెట్టాడు.
డాక్టర్ తనని
కలవటానికి వచ్చిన
ప్రతి వ్యక్తి
దగ్గర గోపీకృష్ణ
గురించి పొగడి, పొగడి
మాట్లాడటం
చేసాడు. గోపీకృష్ణ
కు గర్వంగా
అనిపించింది.
పని త్వరగా
ముగించాలనే ఒకే
పట్టుదలతో పగలు
ఏడు గంటలకే
పని మొదలుపెట్టి
-- రాత్రి తొమ్మిందింటికి
ఇంటికి వచ్చేవాడు.
బిడ్డ కడుపులో
పడిన దగ్గర
నుండే తనకు
కాంట్రాక్ట్ దొరికిందని
మాటి మాటికీ
అనుకుంటాడు.
ఆ రోజు
ఒక కిటికీ
తయారుచేసి, కుర్రాడ్ని
పిలిచి ఉప్పు
కాగితంతో ఆ
కిటికీ చెక్కలను
బాగా నున్నగా
చేయమని చెప్పి, తాను
ఇంకొక కిటికీకి
ముఖం కనబడేటట్టు
వార్నీష్ రాస్తున్నప్పుడు....
ఒక పోలీసు
కానిస్టేబుల్ వచ్చాడు.
“ఇక్కడ
ఎవరు కార్పెంటర్
గోపీకృష్ణ...ఇన్స్పెక్టర్
పిలుచుకు రమ్మన్నారు.
రా” అన్నాడు.
గోపీకృష్ణకు షాక్
కొట్టినట్టు అయ్యింది.
తరువాత సర్దుకున్నాడు.
‘ఇన్స్పెక్టర్
బంగళా కట్టబోతారు.
కొత్త కాంట్రాక్ట్
దొరుకుతుంది’ అని
అనుకుని బయలుదేరాడు.
ఇన్స్పెక్టర్
చెప్పిన విషయం
విని అధిరిపడ్డాడు.
“రావుగారి
చెరువు దగ్గరున్న
అడవిలో ఉన్న టేకు
చెట్లను ఎవరో
రాత్రికి రాత్రి
నరికి తీసుకు
వెళుతున్నట్టు
ఎక్కువ కంప్లైంట్స్
వచ్చినై. నీ
మీదే మాకు
అనుమానంగా ఉంది” అన్నాడు ఇన్స్పెక్టర్.
“కంప్లైంట్
చెట్లు నరికి
కోసుకుని తీసుకు
వెళుతునట్టు మాత్రమే
వచ్చింది. నువ్వు
నరికి
కోసుకు వెళుతున్నట్టు
ఎవరూ కంప్లైంట్
చేయలేదు. కానీ, మాకు
నీ మీద
అనుమానంగా ఉంది.
ఎందుకంటే చెట్లను
రంపంతో కోసినట్లు
బాగా తెలుస్తున్నాయి.
రంపం ఎవరి
దగ్గర ఉంటుంది.
కార్పెంటర్ దగ్గర
ఉంటుంది. దానికి
తోడు ఈ
ఏరియాలో చెక్కపని
కాంట్రాక్టులన్నీ
నువ్వే తీసుకుని, అత్యంత
ఉన్నతమైన గ్రాండ్
టేకు కలపని
వాడుతున్నావని
తెలిసింది! కాబట్టి
చెట్లను నరికి, కలపను
తీసుకువెళ్లేది
నీ పనే” అని
చెప్పి ఇన్స్పెక్టర్
గోపీకృష్ణను లాకప్ లో
తోశాడు.
విషయం తెలుసుకున్న
అతని భార్య
సుమిత్రా, కొంతమంది
పెద్ద మనుషుల
సహాయంతో పోలీస్
స్టేషన్ కు
వచ్చి వాదించింది.
ఒక లోకల్
రాజకీయవేత్త, న్యాయవాది
గోపీకృష్ణ నిజాయతీకి
సర్టిఫికేట్ ఇచ్చి
పట్టుబట్టాడు. మొత్తానికి
పోలీస్ స్టేషన్
నుండి బయటకు
వచ్చాడు గోపీకృష్ణ.
కానీ, నిర్ధోషిగా
ఉండి పోలీసు
స్టేషన్ కు
వెళ్ళి రావలసిన
పరిస్థితి రావటం
అతన్ని కుంగతీసింది.
వీధుల్లో నడవటానికి
అవమానంగా ఉన్నాది.
మనసు పుండై
ఉంది. లోలోపల
ఏడ్చాడు. దుఃఖంతోనే
ఇంటికి వెళ్ళాడు.
మనసు కొంచం
శాంతించటానికి
మూడు రోజులు
అయ్యింది. మూడు
రోజులూ పనికి
వెళ్ళలేదు. ఇంట్లోనే
తనని బంధించుకున్నాడు.
మరుసటి రోజు
పనికి వెళ్ళాలని
అనుకున్నాడు. పుట్టబోయే
బిడ్డకు నడక
నేర్పే మూడు
చక్రాల బండి
చేసి తీసుకురావాలని
అనుకున్నాడు. ఆ
రోజు సాయంత్రం
డాక్టర్ రామమోహన్
ఇంటికి వచ్చాడు.
ఆయన్ని స్వాగతించి, కూర్చోమన్నాడు.
“క్షమించాలి
సార్. మనసు
బాగుండకపోవటంతో
మూడు రోజులుగా
పనికి రాలేకపోయాను.
రేపట్నుంచి వస్తాను
సార్” అన్నాడు.
డాక్టర్ కొంచంసేపు
మౌనంగా ఉన్నారు.
తరువాత “గోపీ
నీతో మాట్లాడాలి.
కొంచం నాతో
వస్తావా. అలా
రోడ్డు దాకా
వెళ్ళొద్దాం” అని పిలిచారు.
“రండి” ఆంటూనే ఆయనతో
వెళ్ళాడు.
కొద్దిసేపు ఇద్దరూ
మాట్లాడకుండా
నడిచారు.
“గోపీ
నేను చెప్పబోయే
విషయాన్ని తప్పుగా
తీసుకోకుండా అర్ధం
చేసుకోవాలి” అంటూ డాక్టర్
మొదలుపెట్టారు.
“నువ్వు
తప్పు చేసిన
వ్యక్తివో, కాదో
నాకు తెలియదు.
కానీ, నీకు
చెడ్డపేరు వచ్చేసింది.
నిన్ను పెట్టుకుని
నేను పని
ముగిస్తే ఊర్లో
నాకు చెడ్డపేరు
వస్తుంది...నేను
చెప్పేది నీకు
అర్ధమవుతోంది అనుకుంటా...పోలీసువాళ్ళు
అవసరం లేకుండా
నా ఇంటి
పనులను వాసన
పడతారు”
గోపీకృష్ణ నిప్పులో
వేయించినట్టు తల్లడిల్లాడు.
పోలీసులు చేతులతో
కొట్టారు. డాక్టర్
మాటలతో కొట్టారు.
“నీకు
తెలుసు. రేటు
తక్కువగా వేస్తారని
చెక్కంతా బిల్లు
లేకుండా కొని
పడేశాను. రేపేదైనా
సమస్య వస్తే...చివరికి
నా దగ్గరకు
వచ్చి నేను
బిల్లులు లేకుండా
కలప కొన్న
విషయాన్ని బయటకు
లాగుతారేమో. ఎందుకంటే
నిన్ను పట్టుకున్న
పోలీసులు నన్ను
పట్టుకుంటే ఏమవతుంది?”
చెప్పుకుంటూ నడిచారు.
“నేనేమీ
పెద్దగా చెప్పక్కర్లేదు
అనుకుంటా. నువ్వే
అర్ధం చేసుకుంటావు
అనుకుంటా”
ప్యాంటు జేబులో
నుండి పర్స్
తీసి పాతికవేల
రూపాయలు అతని
ముందు జాపారు.
“లెక్క
ఏమిటో...తరువాత
చూసుకుందాం. మొదట
ఇది ఉంచుకో.
నా మాటకు
అడ్డు చెప్పకు.
నేను వేరే
కార్పెంటర్ను పెట్టుకుని
పని పూర్తి
చేసుకుంటాను” అని చెప్పి
“వస్తాను” అంటూ బయలుదేరారు.
విషయం తెలుసుకున్న
కాంచనా బాధలో
మునిగిపోయింది.
నాలుగు రోజులుగా
ఇద్దరూ సరిగ్గా
తిండి తినకుండా
ఉన్నారు. కాంచనాకు
తల తిరగటం
మొదలుపెట్టింది.
చిన్నగా గుండెనొప్పి
మొదలయ్యింది. ఏడుపును
ఆపుకుంది. తాను
ఏడిస్తే, అది
చూసి భర్త
కూడా ఏడుస్తాడని
ఏడుపును ఆపుకుంది.
శొకంగా చెరోమూలా
కూర్చున్నారు. సడన్
గా కాంచనాకి
పొత్తి కడుపు
నొప్పి పుట్టింది.
భరించలేని నొప్పితో
వంకర్లు పోయింది.
“అయ్యో...అయ్యో” అని అరిచింది.
అంతకముందే కుంగిపోయున్న
గోపీకృష్ణ మరింత
కుంగి పోయాడు.
వేగంగా పరిగెత్తుకువెళ్ళి
ఆటో ఒకటి
తీసుకు వచ్చాడు.
ఆసుపత్రికి తీసుకు
వెళ్లాడు.
దెబ్బ తగిలిన
మనసుపైనే మరో దెబ్బ.
కాంచనా యొక్క
ఆరునెలల గర్భం
ఆసుపత్రిలో అబార్షన్
అయ్యింది.
పిచ్చి పట్టిన
దానిలాగా అయిపోయింది.
ఇక జీవితం
ఇంతే అనుకున్నాడు.
గోపీకృష్ణ మామగారు, అత్తగారూ, అందరూ
వచ్చారు.
కాంచనా ఆసుపత్రిలో
రెండు రోజులు
ఉన్నది. ఇంటికి
తీసుకు వచ్చినప్పుడు
సగంగా తగ్గిపోయింది.
ఎముకల గూడులాగా
తెలిసింది. ఇరవై
సంవత్సరాలుగా తగ్గని
అందం, యవ్వనం
ఒక వారం
రోజుల్లో వాడిపోయింది.
శరీరంలాగానే, మనసు
కూడా ప్రాణంతో
అతుక్కుని పెనవేసుకుని
ఉంటాయి. శరీర
గాయమూ, మనసు
గాయమూ ప్రాణానికి
గాయమైనట్లు నొప్పి
పుడుతుంది.
ఇల్లు కళ
తప్పింది. ఒకరి
మోహం ఒకరు
చూసుకోలేకపోయారు.అన్నిట్లోనూ
బాధ మిగిలింది.
వచ్చిన వాళ్ళందరూ
బయలుదేరి వెళ్ళిపోయారు.
వెళ్ళేటప్పుడు
మామగారు చెప్పారు
“అల్లుడూ
నా గిడ్డంగిలో
వర్కుషాపు పెట్టుకో
అని చెప్పగలను.
కానీ, ఊర్లో
అందరూ తప్పుగా
అనుకుంటారు. దొంగ
కలపను అమ్ముతున్నానని
గొడవ చేస్తారు.
పోలీసులు నా
షాపు మీద
రైడ్ చెయొచ్చు.
మీరు వేరే
ఊరు వెళ్ళి
బ్రతకండి. మీ
చేతిలో ప్రతిభ
ఉంది...” అంటూ మాటలు
సాగదీశారు.
కాంచనాకు కోపం
వచ్చింది. “ఛీ.
ఆపు నీ
వాగుడు...నువ్వూ
ఒక తండ్రివేనా.
నీ షాపులో
వర్కుషాపు పెట్టుకుంటామని
మేమేన్నా నిన్ను
బ్రతిమిలాడామా? మేమూ
బ్రతకగలం. ఓహో
అని కాకపోయినా
మా వరకు
బాగానే ఉండగలం
-- చెట్టు పెట్టిన
వాడు నీళ్ళుపోయడా?” బలహీనమైన
శరీరంతో అరిచింది.
గోపీకృష్ణ మామగారు
తలవంచుకుని వెళ్ళిపోయారు.
ఇల్లు నిశ్శబ్ధం
అయ్యింది.
భర్త వొడిలో
తల పెట్టుకుని
ఏడ్చింది.
“మనుషులు
ఎంత మోసంగా
ఉన్నారు. పచ్చటి
చెట్లను కొట్టి
పడేస్తున్నారే.
అదేలాగా మనుషులను
కూడా కొట్టి
పడేస్తున్నారే...చెడ్డ
టైము రావచ్చు...అందుకని
ఇలాగా?” సనిగింది.
గోపీకృష్ణ చాలాసేపు
మాట్లాడ కుండానే
ఉన్నాడు.
ఆలొచించాడు. దీర్ఘంగా
ఆలోచించాడు. ఒక
నిర్ణయానికి వచ్చాడు.
“కాంచనా
మనం ఎక్కడకైనా
వెళ్ళిపోదామా?” అన్నాడు.
“వద్దండీ” గబుక్కున
చెప్పింది.
“మనం
ఎక్కడికైనా వెళ్ళిపోతే
రావుగారి చెరువు
దగ్గరున్న అడవిలోని
టేకు చెట్లను
మీరే దొంగతనం
చేసారని చెప్పటం
నిజమైపోతుంది. వద్దండి.
నిజం ఒకరోజు
బయటపడుతుంది. మనసు
కుదట పడేంతవరకు
ఒక నాలుగు
రోజులు సైలంటుగా
ఉందాం. మనసు
తేరుకుంటుంది. మీరు
కొన్ని రోజులు
కాంట్రాక్ట్ పనులు
తీసుకోకండి. ఇంతకు
ముందులాగా రోజు
కూలీ పనికి
వెళ్ళండి. కొట్టేస్తున్నారని
భయపడి ఏ
చెట్టు అయినా
బయట ఊర్లకు
వెళుతుందా? మాట్లాడటానికి
నోరు, నడవటానికి
కాలూ, చూడటానికి
కళ్ళు, ఆలొచించటానికి
మేధస్సు ఉన్న
మనం భయపడకూడదండీ...ఈ
ఊర్లోనే ఎదురీత
వెయ్యాలి. వంద
సంవత్సరాల వయసున్న
చెట్లన్నీ ఏ
బద్రతా లేకుండా
ప్రాణాలతో లేవా? కంటికి
కనబడని ఏదో
ఒక శక్తి
అందరినీ కాపాడుతుంది” దృఢంగా, నమ్మకం
వచ్చేటట్టు మాట్లాడింది.
అతను ఇంకేమీ
మాట్లాడలేదు.
ఒక వారం
గడిచింది.
పక్కింటి ఆయన
“గోపీ” అని పిలుచుకుంటూ
వచ్చారు. “చెరువు
పక్కనున్న టేకు
చెట్లను దొంగతనం
చేస్తున్న మనిషి
దొరికిపోయాడు” అన్నారు. ఆయనే
తిరిగి
మాట్లాడారు.
“రాత్రి
చెట్టు నరుకుతున్నప్పుడే, నరుకుతున్న
అతని మీదే
చెట్టు వంగిపోయిందట.
నడుం ఎముక
విరిగి సగం
ప్రాణంతో ఉన్నాడట.
పోలీసులు వెళ్ళి
పట్టుకున్నారు”
వింటుంటేనే మనసులో
తెలియని ఆనందం
పొంగి పొర్లింది.
డాక్టర్ రామమోహన్
చెమటలు కక్కుకుంటూ
వచ్చాడు.
“గోపీ...సారీ
గోపీ... బయట ఊరి
నుండి ఒక
కార్పెంటర్ ను
తీసుకువచ్చాను.
పాతికవేల రూపాయలు
అడ్వాన్స్ తీసుకుని
వెళ్లాడు. తిరిగి
ఇంతవరకు రానేలేదు.
కోపగించుకోకు గోపీ.
సారీ గోపీ”
డాక్టర్ బాధ
పడుతున్నారు.
గోపీకృష్ణ, కాంచనా
డాక్టర్ను జాలిగా
చూశారు.
****************************************************సమాప్తం***************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి