ముక్కుపొడి మనుషులు...(కథ)
ముక్కుపొడి మనుషులు (కథ)
అమ్మాయలను నమ్మించి మోసం చేసి కిడ్నాప్ చేసి మృగంలాగా మానబంగం చేసే నయవంచకులు మాత్రమే కాదు ‘స్త్రీత్వాన్ని గౌరవిస్తున్నాను! అందాన్నే ఎంజాయ్ చేశాను! ఇదొక పెద్ద నేరమా?’ అని పిచ్చి వాగుడు వాగుతూ, పలు స్త్రీలను ధర్మ సంకటంతో వంకర్లు తిప్పించే భూతం లాంటి వారికీ, పక్కనున్న వాళ్ళకు అలర్జీ ఏర్పరిచే ఇలాంటి ముక్కుపొడి మనుషులకూ వెంట వెంటనే శిక్ష పడాలి!
వాళ్ళు చట్టం దగ్గర నుండి తప్పించుకున్నా భగవంతుడి దగ్గర నుండి తప్పించుకోలేరు.
అలాంటి ఒక పెద్ద మనిషికి ఇక్కడ భగవంతుడు శిక్ష ఎలా వేశాడో ఈ కథ చదివి తెలుసుకోండి.
*********************************
“కస్తూరీ!
ఈ వారం
ప్రింటు చేయవలసిన
ప్రకటలన్నీ కరెక్టుగా
నోట్ చేసుకున్నావా? ఎవర్నీ
వదిలేయలేదుగా?...అందరూ
వాళ్ళ ప్రకటనల
కోసం వేల
లెక్కలో డబ్బు
కట్టారు...ఏదైనా
మిస్ అయ్యిందా...అందరూ
మన ఆఫీసు
ముందు నిలబడి
పూనకం వచ్చినట్టు
ఊగిపోతారు...అది
చాలదనే విధంగా
మన ఆఫీసు
భూతం తన
వాటాకు నాట్యమాడుతుంది...ఆ
తరువాత పారిపోనూ
లేము...దాక్కోనూ
లేము...”
“అంతా
చాలా కేర్
ఫుల్ గా
నోట్ చేసుకున్నాను
ఉదయ్! ఒకటికి, రెండుసార్లు
చెక్ చేసేసాను...ఎందుకైనా
మంచిది నువ్వూ
ఒకసారి చెక్
చేసేయ్...”
ఉదయ్ అడిగినదానికి
ఆవలిస్తూ సమాధానం
చెప్పింది కస్తూరీ.
“ఏమైంది? చాలా
డల్ గా
ఉన్నావు! టయర్డుగా
ఉందా?”
“లేదు ఉదయ్...పిల్లకు
ఒంట్లో బాగుండలేదు...హై
ఫీవర్...రాత్రంతా
ఒకటే ఏడుపు...పాపం...నా
వొళ్ళోనే పెట్టుకున్నాను...ఒక
రోజు లీవు
పెడదామంటే...కుదరదుగా?”
“అరెరే...ఇప్పుడు
పిల్లతో ఇంట్లో
ఎవరున్నారు?”
“రామ్!
లీవు పెట్టేసి
చూసుకుంటున్నారు!”
“సరే!
ఇది నేను
చెక్ చేసి
పంపుతాను! నువ్వు
బయలుదేరు!” అన్న ఉదయ్, కస్తూరీ
యొక్క కంప్యూటర్
స్క్రీన్ను తన
పక్కకు తిప్పుకున్నాడు.
“కానీ
భూతం...”
“నేను
చూసుకుంటా!”
“థ్యాంక్స్
ఉదయ్!” ఆమె బయలుదేరటానికి
రెడీ అయ్యింది!
వాళ్ళు కూర్చున్న
గది తలుపుల
మీద మెల్లగా
కొట్టి ఆఫీసు
ప్యూన్ చలపతి
వచ్చాడు!
“అక్కా...మిమ్మల్ని
పెద్దసారు తీసుకురమ్మన్నారు...” అంటూ కస్తూరీను
చూస్తూ చెప్పాడు
చలపతి!
“ఏయ్...ఇలా
మాట్లాడ వద్దని
నీకు ఎన్నిసార్లు
చెప్పాను...తెలుగులో
కరెక్టుగా మాట్లాడు...”
“ఆయ్...ఇది
కూడా తెలుగే...సరి...సరి...నాతో
మాట్లాడి టైము
వేస్టు చేయకండి...పెద్దసారు
నన్నే తిడతారు...త్వరగా
వెళ్ళండి...” అని చెబుతూ
అతను బయటకు
వెళ్లాడు!
“ఇప్పుడెందుకు
ఈ మనిషి
నన్ను పిలుస్తున్నాడు...కోపంగా
వస్తోంది...” అని పళ్ళు
కొరుక్కుంటూ చెప్పింది
కస్తూరీ.
“సరే...సరే...కోపగించుకోకు.
ఆ ప్రకటనల
లిస్టు గురించే
అడుగుతాడు...అది
రెడీ చేశావుగా...ఇంకేం...”
“అర్ధం
చేసుకోకుండా మాట్లాడకు
ఉదయ్...వాడు
దానికా పిలుస్తున్నాడు... దానికోసమే అయితే
ఇంటర్ కామ్
లో మాట్లాడొచ్చుగా… వాడుత్త
జొల్లు పార్టీ...” అంటూ చిటపట
లాడింది!
“రిలాక్స్ కస్తూరీ...నువ్వు
ముందు వెళ్ళు...రెండు
నిమిషాల తరువాత
నేను లోపలకు
వస్తాను...” అని ఉదయ్
చెప్పగానే,
“ఛీ... ఛీ...” అంటూ ఇష్టం
లేక పోయినా, విసుగుతో
లేచి వెళ్ళింది
కస్తూరీ!
అది, భారతదేశం
యొక్క ప్రసిద్ద
న్యూస్ పేపర్
కోసం ప్రకటనులు
సేకరించే చిన్న
కంపెనీ అది!
ఆ కంపెనీ
యజమాని పంచభూతం
ఒక స్ట్రిక్టు
వ్యక్తి అనే
ముసుగులో దాక్కున్న
ఒక స్త్రీ బలహీనుడు!
మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు
చాలా భవ్యంగానూ
-- నిజాయితీగానూ ఉండే
వ్యక్తిగా చూపించుకుంటాడు.
స్త్రీల దగ్గర
టన్నుల కొద్ది
చొంగ కార్చే
ముసలి!
మహిళలు అతని
మీద నేరం
మోపినా కూడా
ఎవరూ నమ్మనే
నమ్మరు! అంత
గొప్పగా నటించగల
తెలివి ఉన్న
ముసలి నక్క!
అది అతని
సొంత కంపెనీ
కాబట్టి అతని
వలన అతనికి
ఇష్టం వచ్చినట్టు
నడుచుకోవటం కుదురుతోంది!
ఆ ఆఫీసులో
కస్తూరీ కాకుండా
ఆఫీసు పనిమనిషి
పార్వతీతో చేర్చి
ఇంకో ఒక
మహిళ, ఉదయ్
మాత్రమే కాకుండా
ఆఫీసు బాయ్ చలపతి తో
కలిపి ఇంకో
ముగ్గురు మగవారు
ఉద్యోగం చేస్తున్నారు.
ప్రారంభంలో కస్తూరీ
ఆ పంచభూతం
గురించి చెప్పినప్పుడు
ఉదయ్ నమ్మలేదు!
కానీ, ఒకరోజు
ఆయన జొల్లు
కార్చే మాటలు
ఉదయ్ వినడం
జరిగినప్పుడు అతను
ఆ
ముసలినక్క కపట
ధోరణి గురించి
తెలుసుకున్నాడు!
ఆ రోజు
నుండి ఆ
ముసలి నక్క
ఏ మహిళా
ఉద్యోగిని తన
గదికి రమ్మని
పిలిచినా, వాళ్ళు
వెళ్ళిన రెండు
నిమిషాల తరువాత
పంచభూతం గదిలోకి
వెళ్ళి ఆయన
ముందు నిలబడతాడు
ఉదయ్!
ఏదో ఒక
పనికోసం ముసలి
నక్క గదిలోకి
వెళ్ళిన ఉదయ్
ఆ మహిళా
ఉద్యోగులు బయటకు
వచ్చేంతవరకు అక్కడే
నిలబడతాడు!
గత ఆరు
నెలలుగా ఆ
ఆఫీసులో జరుగుతున్న
తంతు అది!
కస్తూరీ జీన్స్
ప్యాంటూ, షర్టు
టాప్ వేసుకోనున్నది!
కొంచం లావుగా
ఉన్నా అందంగానే
ఉండేది! మనసులో
చిటపట లాడుతూనే
లోపలకు వెళ్ళింది.
“మే
ఐ కమిన్
సార్?” అద్దాల
తలుపును ఒకసారి
వేళ్ళతోకొట్టి, లోపలకు
వచ్చినామెను, తన
గ్రద్ద కళ్ళతో
కొలతలు తీసింది
ఆ భూతం!
“యా...కమిన్...
కసీ...”
“సార్!
నేను చాలాసార్లు
చెప్పాను...నన్ను కసీ అని
పిలవద్దని...” పళ్ళు
కొరుక్కుంటూ చెప్పింది!
“కూర్చో...కూర్చో...ప్లీజ్
బీ సీటెడ్...”
“ఇట్స్
ఓకే...” అని నిలబడే
సమాధానం చెప్పింది.
“సరే...ఆడ్
లిస్టు రెడియా?” మొహాన్ని
ఒకలాగా పెట్టుకుని
అడిగాడు పంచభూతం.
“ఆల్
మోస్ట్ రెడీ... ఉదయ్ చివరగా
ఒకసారి చెక్
చేస్తున్నాడు! అది
పూర్తైన తరువాత మీకు
మైల్ పంపుతాడు
సార్!” అని ఆమె
సాగదీయగా,
“తరువాత
కసీ...”
కసీ అని
తన భర్త
తనని ముద్దుగా
పిలిచే పేరుతో, ఆ
పేరును పంచభూతం
నోటి ద్వారా
విన్న కస్తూరీకి
ఒళ్ళంతా మండింది! భూతం
తలమీద ఏదైనా
పడేసి, అతని
తలని పగలగొట్టాలనే
కోపం వచ్చింది!
కానీ, ఏదీ
చెయ్యలేక పళ్ళు
కొరుక్కుంటూ మౌనంగా
ఉన్నది.
“ఈ
టాప్ లో
నువ్వు అందంగా
ఉన్నావు...” భూతం కళ్ళు
కస్తూరీని అడుగు
అడుగూ కొలత
వేస్తున్నది.
“ఇంకా
ఏదైనా డీటైల్
కావాలా సార్...” కసి అంచుల్లో
ఉన్నది కస్తూరీ!
అప్పుడు ఆఫీసు
పనిమనిషి పార్వతీ
చీపురుతో గదిలోకి
వచ్చింది!
ఆమె పైకెత్తి
దోపుకున్న చీర
ద్వారా తెలుస్తున్న
ఆమె నడుమునూ, కాళ్ళనూ
చూసిన భూతం,
“పార్వతీ...ఈ
చీర కాటనా, నైలెక్సా...” అని అడుగుతూనే, ఇప్పుడు
కస్తూరీని వదిలి
పార్వతీని కొలత
వేస్తూ ఉన్నది!
“హూ...హూ...” అంటూ తనలో
తానే ఏదో
గొణుక్కుంది.
పార్వతీ చీపురు
కట్టను పైకెత్తి
పట్టుకుని దాని
వెనుక భాగాన్ని
తన అరచేతిలో
రెండుసార్లు గట్టిగా
కొడుతూ పంచభూతాన్ని
కోపంగా చూసింది!
“మే
ఐ కమిన్
సార్!” అడుగుతూ లోపలకు
వచ్చాడు ఉదయ్.
ఉదయ్ లోపలకు
రావడాన్ని గమనించిన
పంచభూతం గబుక్కున
తన యొక్క
ముఖ భావాలను
మార్చుకున్నారు.
“యా... ఉదయ్! ఏమిటి
విషయం?”
“సార్!
ఐ రిసీవిడ్
ఎ కాల్
ఫ్రం ఏబిసి
ప్రమోటర్స్! వాళ్ళకు
వచ్చే ఆదివారం
ఫస్ట్ పేజీ
ఆడ్ కావాలట!”
“ఓ...దట్స్
గ్రేట్!” అంటూ మొదలుపెట్టిన
ఆయన, కస్తూరీని
రెప్ప వాల్చకుండా
చూసి,
“మిస్
కస్తూరీ! మీరు
త్వరగా ఆ
లిస్టు చెక్
చేసి నాకు
మైలు పంపండి!” అని చెప్పారు.
అక్కడే నిలబడ్డ
ఉదయ్ పార్వతీని
చూసి, “పార్వతీ!
ఈ గదిలో
తుడిచింది చాలు.
బయట రిసెప్చన్
లో నీళ్ళు
ఒలికినై...అది
మొదట తుడిచేయండి.
క్లయింట్ ఒకాయన
ఇప్పుడు వస్తానని
చెప్పారు...” అన్నాడు.
కస్తూరీ ఒకసారి
ఉదయ్ వైపు
చూసింది. ఉదయ్
కళ్ళ సైగతోనే
కస్తూరీని బయటకు
వెళ్ళిపొమ్మని
చెప్పాడు.
“సరే
సార్! ఇప్పుడే
తుడుస్తాను!” అంటూ పార్వతీ
బయటకు నడవసాగింది.
ఉదయ్ కనుసైగతో
కస్తూరీ పార్వతీ
వెనుకే ఆ
గది వదలి
వెళ్ళింది.
“పార్వతీ
ఒక్క నిమిషం” అన్నారు పంచభూతం.
పార్వతీ ఆగి
వెనక్కి తిరిగి
ఆయన్ను చూసింది.
“చూడు
పార్వతీ... అలాగే
పాలు కాచి
పెట్టుకో...క్లయింట్
వచ్చినప్పుడు, నేను
కబురు
చేసినప్పుడు స్ట్రాంగ్
టీ వేసి
తీసుకురావాలి...” అన్నాడు పంచభూతం.
“హూ...ఈ
బ్రతుకు బ్రతికే
కన్నా ఆత్మహత్య
చేసుకోవటం బెటర్.
థూ...” అంటూ పంచభూతాన్ని
చూసి వినబడేటట్టే
చెప్పి వెళ్ళింది
పార్వతీ!
మనసులో చిటపటలాడుతున్నా, ముఖాన్ని
మామూలుగా పెట్టుకున్నాడు
పంచభూతం!
“ఉదయ్!
ఆ పార్వతీ
ఏం చెప్పింది!”
“ఎవరినో
ఆత్మహత్య చేసుకుని
చచ్చిపొమ్మని చెప్పింది
సార్...” అన్నాడు అమాయకంగా.
“ఉదయ్...బీ
సీరియస్...ఏబీసీ
ప్రమోటర్స్ ఏం
చెప్పారని అడుగుతున్నా!” విసుగ్గా
అడిగారు పంచభూతం.
“యా...వెల్...వాళ్ళు...వాళ్ళకు
వచ్చే ఆదివారం
ఇష్యూలో ఫ్రంట్
పేజీ ఆడ్
కావాలట...”
“ఇది
వచ్చిన వెంటనే
చెప్పేసారు కదా!
అది కాకుండా
ఇంకేం చెప్పారు!”
“వేరే
ఏమీ చెప్పలేదు
సార్! మన
ఆఫీసుకు దారి
అడిగారు! చెప్పాను!
ఇంకో అరగంటలో
వస్తానన్నారు!”
“గుడ్...ఈ
రోజు మధ్యాహ్నం
పన్నెండు లోపు
వస్తేనే, వచ్చే
ఆదివారం ఇష్యూలో
ఆడ్ వస్తుందని
చెప్పారు కదా?”
“అవును
సార్...చెప్పాను!
వాళ్ళు దానిలోపే
వచ్చేస్తామని చెప్పారు...”
“గుడ్!
గుడ్! మీరు
మీటింగుకు కావలసిన
ఏర్పాట్లు చేయండి...” పంచభూతానికి
కుషీగా అనిపించింది.
‘ఇలాంటి
ఒక సంధర్భం
కోసమే కాచుకోనున్నాను!
వచ్చే వాళ్ళను
అలాగే ట్రాప్
చేయాలి...ఇలాంటి
ఫ్రంట్ పేజీ
ఆడ్ మటి
మాటికీ మన
ఏజెన్సీ ద్వారా
వస్తే, మన
ఏజెన్సీని టీవీ
యాడ్ ఇచ్చేంత
పెద్ద కంపెనీగా
పెంచేయవచ్చు! ’ అని
అనుకుని ఈ
క్లయింటు మీటింగును
విజయవంతంగా జరిపి
ముగించటానికి కావలసిన
వాటిని తీసి
పెట్టుకోవటం ప్రారంభించాడు
పంచభూతం!
‘భూతం...ఈ
రోజు నువ్వు
కతం రా...!’ అని
అనుకున్న ఉదయ్
తనలో తాను
నవ్వుకుంటూ
ఆ గదిని
వదిలి బయటకు
వచ్చాడు!
“ఏం
తమ్ముడూ...రిసెప్షన్లో
ఎక్కడా నీళ్ళు
వొలకలేదే...”
“అక్కా...అది
రిసెప్షన్లో కాదు...అక్కడ...లోపల...” అన్నది కస్తూరీ.
“లోపలా...లోపల
ఎక్కడమ్మా...”
“భూతమే
కదా మనల్ని
చూసి అంత
జొల్లు కారుస్తున్నాడు? అది
నువ్వు చూడలేదా? అది
నీకు తెలుసుకదా? అక్కడే
నీళ్ళు ఎక్కువగా
ఉన్నాయి. వెళ్ళి
తుడు...” అంటూ వేళాకోళంగా
చెప్పింది కస్తూరీ!
“అవునమ్మా...ఒక
రోజు కాకపోతే
మరో రోజు
ఆయన్ని ఆ
తడిలో కిందకు
తోసేసి తొక్కుతా...లేవలేనంతగా
తొక్కుతా. వెన్నుపూస
మీదే తొక్కుతా...అప్పుడుగానీ
వాడికి బుద్ది
రాదు...” అన్నది పార్వతీ!
ఉదయ్, కస్తూరీ
నవ్వుకున్నారు!
అప్పుడే చలపతి
అక్కడికి వచ్చాడు!
“అక్కా... పార్వతక్కా...”
“ఏమిట్రా...ఎందుకలా
వేలం పాట
పాడుతున్నావు...”
“పెద్ద
సారు నువ్వు
పాలు కాచావా
అని అడిగిరమ్మన్నారు...”
“ఎవరు? ఆ
పెద్ద చించా...”
“అయ్యో...నువ్వు
ఎందుకు ఎప్పుడూ
పెద్ద సారును
తిడుతూనే ఉంటావు...”
“నువ్వు
కావలంటే ఆయనకు
డప్పు వాయించరా.
నా దగ్గర
వద్దు...” అని కోపంగా
మాట్లాడిన పార్వతీ
అక్కడ్నుంచి గబగబా
బయటకు వెళ్ళింది!
కస్టమర్ల టీ పార్టీకి ఏదో
కొనుక్కు రమ్మని
చెప్పి చలపతిని
షాపుకు పంపించాడు
ఉదయ్!
“ఉదయ్!
నిజంగానే ఏబిసి
ప్రమోటర్స్ దగ్గర
నుండి ఫ్రంట్
పేజీ ఆడ్
అడిగి ఫోన్
వచ్చిందా?”
“అవునమ్మా...ఫోను
వచ్చింది...”
“గుడ్!”
“ఏమిటి
గుడ్డు...ఫోను
వచ్చింది...కానీ
ఏబిసి ప్రమోటర్స్
దగ్గర నుండి
కాదు...కామాక్షీనగర్
హోమ్ మినిస్టర్
ఆఫీసు నుండి...”
“ఏం
చెప్పింది...మిసస్
భూతం?”
“ఇంకో
అరగంటలో వస్తారట!”
“ఉదయ్....దీన్ని
సరిగ్గా యూస్
చేసుకుని ఈరోజు
భూతాన్ని బాగా
ఇరికించాలి...త్వరగా
ఏదైనా ప్లాను
చెయ్యి...” అన్నది కస్తూరీ!
ఉదయ్ కస్తూరీ
చెవిలో ఏదో
చెప్పగా...
కస్తూరీ తన
కళ్ళను పెద్దవి
చేసి అతన్ని
చూసి ఆశ్చర్యంగా
చూసిందీ.
“ఎలా
ఉదయ్....”
“అది
అలాగే!” ఉదయ్ తన
చొక్కా కాలర్ను
పైకెత్తి దర్జాగా
చూపించాడు.
కస్తూరీ నవ్వు
మొహంతోనే ఉదయ్
కి షేక్
హ్యాండ్ ఇచ్చింది.
“నడుపు...నడుపు...”
“అవును!
‘దొంగకు
తేలు కుట్టినట్టు’ అని
అంటూంటారే! అదేలాగా!
ఇక మీదట
భూతం పిలక
నా చేతిలో....” అని చెప్పి
నవ్వాడు ఉదయ్!
ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే
పంచభూతం భార్య
అన్నపూర్ణ ఆఫీసు
లోపలకు వచ్చింది.
ఉదయ్,
అన్నపూర్ణ గారిని
అభిమానంతో స్వాగతించి, మర్యాద
చేయటమే కాకుండా, కస్తూరీని
కూడా ఆమెకు
పరిచయం చేశాడు!
ఆడవాళ్ళిద్దరూ
మాట్లాడుకుంటున్నప్పుడు
ఉదయ్ పంచభూతం
గదికి వెళ్లాడు.
“మే
ఐ కమిన్
సార్?”
“యస్
ఉదయ్! క్లయింట్
వచ్చాశారా?”
“అవును
సార్! వాళ్ళు
వచ్చాశారు! లోపలకు
పంపనా?”
“పంపు...పంపు...బై
ద వే!
వచ్చింది లేడీనా? లేక...” అంటూ పంచభూతం
సాగదీయ--
“లేడీనే
సార్!” మనసులో నవ్వుకుంటూ
చెప్పాడు.
“గుడ్...గుడ్...లేడీస్
కే మనం
చెప్పేది బాగా
అర్ధం అవుతుంది...ఓకే...ఈజ్
ఎవిరితింగ్ రెడీ
ఫర్ ద
మీటింగ్!”
“యస్!
ఇట్ ఈజ్
రెడీ సార్!
ఐ విల్
సెండ్ హర్
సార్!” అంటూనే ఉదయ్
బయటకు వెళ్ళగా, పంచభూతం
మనసు లోపల
గెంతులేశాడు!
‘వచ్చిన
స్త్రీని నా
మాటలతోనే ఉక్కిరి
బిక్కిరి చెయ్యాలి...ఆమె, నేను
ఎందుకు ఈ
కంపెనీలో ఉద్యోగం
చెయ్యకుండా పోయానే
అనుకునేటట్టు మాట్లాడాలి...’
ఇలాగంతా అనుకుంటున్నప్పుడు, గది
తలుపు మీద
టక్, టక్
మని ఎవరో
కొట్టగా, పంచభూతం
తన తిరిగే
కుర్చీని తిప్పి, గది
వాకిలికి తన
వీపును చూపిస్తూ
కూర్చుని.
“యస్!
కమిన్!” అని పిలిచాడు.
గది తలుపు
తీస్తున్న శబ్ధం, గదిలోకి
ఒక స్త్రీ
వచ్చే శబ్ధమూ
వినబడ---
“రండి...రండి...” అని పిలుస్తూనే
తన తిరుగుడు
కుర్చీని స్టైలుగా
తిప్పి తిరిగి
వచ్చిన స్త్రీని
తల ఎత్తి
చూడ అక్కడ
ఆఫీసు పనిమనిషి
పార్వతీ నిలబడింది.
పంచభూతం ఆమె
వైపుకు తిరిగిన
వెంటనే.
“ఎందుకు
నన్ను పిలిచారు...” అని అడిగింది.
“ఏయ్...యూ
స్టుపిడ్ లేడీ...నువ్వెందుకు
లోపలకు వచ్చావు”
“అయ్యా...మీరు
నన్ను పిలిచారని
ఇప్పుడే చలపతి
చెప్పాడు...అందుకే
నేను లోపలకు
వచ్చాను...”
పంచభూతం గబుక్కున
ఇంటర్ కామ్
తీసి ఉదయ్
ని పిలిచాడు.
"సార్!
ఆవిడ ఏదో
ముఖ్యమైన ఫోను
వచ్చిందని పోర్టికోలో
నిలబడి మాట్లాడుతోంది
సార్!”
“ఓ...ఓకే...ఓకే...” అని ఉదయ్
తో చెప్పి
తనని రిలాక్స్
చేసుకున్న పంచభూతం, టెన్షన్
తగ్గటంతో ఇప్పుడు
అతని ముందు
నిలబడ్డ పార్వతీని
చూడటం మొదలుపెట్టాడు!
“మే
ఐ కమిన్!” బయట నుండి
స్వరం వినబడింది.
“యా..కమిన్!” పంచభూతం జవాబు
ఇచ్చాడు. క్లయంటే
వస్తోంది అనుకున్నాడు
పంచభూతం. కానీ, లోపలకు
వచ్చింది కస్తూరీ!
పంచభూతానికి నిరుత్సాహంగా
ఉన్నా, కళ్ళార్పకుండా
ఆమెను చూడటం
ఆపలేదు!
“ఏమిటి
కస్తూరీ...”
“ఆడ్
లిస్ట్ చెక్
చేసి మీకు
మైలు పంపించాను!
నేను బయలుదేరతాను
సార్! నా
పిల్లకు ఒంట్లో
బాగుండలేదు...”
“ఓ...ఓకే...కానీ
కస్తూరీ...నువ్వు
ఒక బిడ్డకు
తల్లిలాగా కనబడటంలేదు...నువ్వుగా
చెబితేనే తెలుస్తుంది.
అంత బాగున్నావు...”
“షటప్!
యూ అగ్లీ
బీస్ట్...” అని కోపంగా
అరిచింది కస్తూరీ!
“కరెక్టుగా
ఆ సమయంలో
ఉదయ్ లోపలకు
రాగా, పంచభూతం
చటుక్కున సరిగ్గా
కూర్చున్నాడు!”
“ఏమైంది
కస్తూరీ?”
కస్తూరీ అనుచుకున్న
కోపంతో నిలబడ, పార్వతీ
జరిగింది చెప్పింది!
“లేదు...ఆమె
అబద్దం చెబుతోంది!
నేను పోయి...నేను
స్త్రీలను ఎంతో
గౌరవిస్తాను...ఛ...ఏమ్మా
పార్వతీ...ఎందుకమ్మా
ఇంత అన్యాయంగా
నాపై నేరం
మోపుతావు...”
“ఎవరు...ఎవరు
స్త్రీలకు గౌరవమిచ్చేది...మీరా...?” అంటూ
అడుగుతూ లోపలకు
వచ్చింది అన్నపూర్ణ!
“హై... పూర్ణా! నువ్వు
ఎందుకు ఇక్కడికి? రా...రా...రా...”
“ఏమిటీ? రా...రా...రా...!
ఎందుకిలా టెలిగ్రాం
కొడుతున్నారు. ఏమిటీ!
మీ వక్ర
బుద్ది గురించి
నాకు తెలిసిపోయిందని
చూస్తున్నారా...”
“అయ్యో...లేదు...లేదు
పూర్ణా! ఈ
అమ్మాయి అబద్దం
చెబుతోంది...”
“అబద్దం
కాదు మిస్టర్.
భూతం! ఇది
చూడండి...” అని చెప్పి
అన్నపూర్ణ తన
సెల్ ఫోనును
ఆయన దగ్గర
చూప, అందులో
ఆ గదిలో
జరిగే విషయాలన్నిటినీ
లైవ్ గా
చూపిస్తోంది!
“ఏమిటి
చూస్తున్నారు...ఏమిట్రా...ఇదెలా
సాధ్యపడింది?
అని ఆలోచిస్తున్నా రా?...క్లయింట్
ఒకరు ఫోను
చేసేరని చెప్పి
ఉదయ్ లోపలకు
వచ్చి వెళ్ళేడే, అప్పుడే
అతను ఇక్కడ
ఒక సీక్రెట్
కెమేరాను ఫిక్స్
చేసి, అందులో
రికార్డు అవుతున్న
వన్నీ నాకు
వచ్చేలాగా సిస్టం
సెట్ చేశాడు!
ఒకే ఒక
బటన్! ఈ
ఒక్క బటన్
నొక్కితే, ఇది
ప్రపంచమంతా టెలికాస్ట్
అయిపోతుంది! అర్ధం
కాలేదా...ఫేస్
బుక్ లో
లైవ్ గా
ప్రచారం చేసేస్తాను...” అని అన్నపూర్ణ
తన భర్తను
బెదిరించింది!
“ఏమిటే...ఇక్కడకొచ్చి
ఆటలాడుతున్నావు...వీడు
ఈ ఆఫీసులో
పనిచేస్తేనేగా, నీకు
డప్పు
వాయిస్తాడు... ఇప్పుడే వాడి
ఉద్యోగాన్ని పీకేస్తాను...” అని పంచభూతం
అరిచాడు.
ఉదయ్, అన్నపూర్ణ
నోరారా నవ్వారు!
ఏమీ అర్ధం
కాని పంచభూతం
వాళ్ళిద్దర్నీ
ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు, తలుపు
తోసుకుంటూ లోపలకు
వచ్చింది ఒక
యంగ్ యువతి.
“డాడీ...” అంటూ పిలుస్తూ
బొమ్మలాగా ఆ
యువతి లోపలకు
వచ్చింది!
వచ్చిన యువతి
గదిలోపల చాలామంది
నిలబడుండటం చూసి, ఉదయ్
ని గమనించగానే
సిగ్గుతో నవ్వుతూ
తల్లి అన్నపూర్ణ
దగ్గరకు వెళ్ళి
నిలబడింది!
ఉదయ్ ఆమెను
చూసి అందంగా
నవ్వాడు.
పంచభూతానికి ఆ
ఏ.సీ
రూములో కూడా
చెమటలు పట్టినై!
“మమ్మీ!
డాడీ దగ్గర
చెప్పేశావా” బొమ్మ అన్నపూర్ణని
అడిగింది.
“మీ
నాన్న ఒప్పుకున్నారు
రా!” అని చెప్పింది
అన్నపూర్ణ.
“ఓ...థ్యాంక్యూ
డాడీ...థ్యాంక్యూ
సో మచ్...నాకు
తెలుసు...మీరు
ఒప్పుకుంటారని...”
అని చెప్పుకుంటా
పరిగెత్తుకు వెళ్ళి
తండ్రి బుగ్గల
మీద గట్టిగా
ముద్దు పెట్టింది!
“ఐషూ...ఇక
మీదట నువ్వు
మీ డాడీకంతా
ముద్దు పెట్టకూడదు...అల్లుడికే
ఇవ్వాలి...వెళ్ళు...అల్లుడు
నీతో మాట్లాడటం
కోసం చాలా
సేపటి నుండి
వైయిట్ చేస్తున్నరు
తెలుసా...పో...” అని తన
కూతురు దగ్గర
చెప్పిన అన్నపూర్ణ, ఉదయ్
ని చూసి, “వెళ్ళండి
అల్లుడూ! వెళ్ళి
నా కూతురుతో
మాట్లాడి రండి...” అన్నది.
ఉదయ్ గంభీరంగా
నడిచి వచ్చి
పంచభూతం దగ్గర
నిలబడున్న ఐశ్వర్యాని
చై పుచ్చుకుని
తీసుకు వెళ్ళాడు!
అన్నపూర్ణ నూ, కస్తూరీ
నూ, చప్పట్లు
కొట్ట, అది
చూసి పార్వతీ
కూడా చప్పట్లు
కొట్టింది!
తన కూతురు
ఐశ్వర్య ఉదయ్
తో చేతులు
జోడించుకుని నడిచి
వెళ్లటాన్ని ఆశ్చర్యంతో
చూసాడు పంచభూతం!
అందరూ వెళ్ళిపోయిన
తరువాత తన
భార్యను చూసి
అరిచాడు ఆయన.
“ఏమే...అందరూ
కలిసి డ్రామా
ఆడుతున్నారా...నేను
ఒప్పుకోను...ఈ
పెళ్ళికి నేను
ఒప్పుకోను...”
“మీరు
ఒప్పుకోకపోతే ఇదిగో
ఈ వీడియోను
మన కూతురు
ఐశ్వర్యకు వాట్స్
అప్ చేసేస్తాను!
పరవాలేదా...” అన్నపూర్ణ
నిర్లక్ష్యంగా
అడిగింది.
తన కోపాన్ని
ఎలా అనుచుకోవాలో
తెలియక అరిచాడు
పంచభూతం.
“అయితే...అయితే...ఆ
ఉదయ్ గాడిని
ఉద్యోగం నుండి
పీకేస్తాను....” అని వెర్రిగా
అరిచారు.
“ఇక
మీదట మీ
వల్ల అది
కూడా కుదరదు...ఎందుకంటే...ఈ
ఏజెన్సీని ఉదయ్
పేరుకు మారిపోయింది!
ఇది మీ
కూతురి ఏర్పాటు!
ఇక మీదట
మీరు ఇక్కడ
పనిచేయటం, చెయ్యకపోవటం
కూడా...అల్లుడి
చేతిలోనే ఉంది...” కూల్ గా
చెప్పింది అన్నపూర్ణ.
పళ్ళు పీకిన
పాములాగా అయిపోయానని
అనిపించింది ఆయనకు!
“ఎందుకు
ఆంటీ, అంకుల్ను
ఇంతగా భయపెడుతున్నారు...”
“నేను
భయపెట్టటం లేదు.
నిజం చెబుతున్నాను....అది
సరే అల్లుడూ, ఐషూ
ఎక్కడ...?”
“ఆమె
కస్తూరీతో మాట్లాడుతోంది!” అని అన్నపూర్ణ
దగ్గర చెప్పి
పంచభూతం వైపు
చూశాడు ఉదయ్.
“సారీ
సార్! మీ
అమ్మాయి, నేనూ
ఆరు నెలలుగా
ప్రేమించుకుంటున్నాము!
ఈమె మీ
ఆమ్మాయి అని
నాకు మొదట్లో
తెలియదు! కానీ
తరువాత తెలుసుకున్నాను!
మీ అమ్మాయి
ఎప్పుడూ మీ
గురించి చాలా
గొప్పగా చెబుతుంది!
‘మా
నాన్న ఇలా...మా
నాన్న అలా’ అంటూ...కానీ, మీరేమో
ఇలా...అలా
నడుచుకుంటున్నది
ఆమెకు తెలియదు.
అందుకని మిమ్మల్ని
మార్చాలనీ నేనూ, అతయ్యా
వేసిన ప్లాను
ఇది. మీ
అమ్మాయి మీ
గురించి గొప్పగా
అనుకునేటట్టు, మిగిలిన
ఆడపిల్లలనూ మీరు
మీ అమ్మాయిలాగా
చూడాలి! అందరికీ
ఇబ్బందిగా...ఒక
అలర్జీగా మీరు
ఉన్నారని మీ
అమ్మాయికి తెలిస్తే
ఆమె ఎంత
బాధపడుతుందో కొంచం
ఆలొచించి చూడండి!” అన్నాడు.
“తరువాత, నేను
ఈ ఏజెన్సీని
నాపేరుకు రాసిమ్మని
నేనేమీ అడగలేదు!
మీ అమ్మాయే
నాన్నకు రెస్టు
కావాలి, కాబట్టి
ఆయన కంపెనీకి
నమ్మకం గల
వ్యక్తి కావాలి.
అలా నమ్మకంగా
ఉండగల వ్యక్తి
మీకంటే ఇంకెవరున్నారు
అంటూ కంపెనీని తన పేరు నుండి నా పేరుకు మార్చింది. మీ
అమ్మాయిని
మీ కంటే
ఎక్కువగా ప్రేమిస్తున్నాను!
నా ప్రాణం
కంటే జాగ్రత్తగా
చూసుకుంటాను! ఇది
మాత్రం నేను
ఖచ్చితంగా చెప్పగలను!
ఆ తరువాత
మీ ఇష్టం!” అన్నాడు ఉదయ్!
“అల్లుడు
ఏం చెప్పారో
విన్నారు కదా...ఇకమీదటైనా
ఒక ఆడపిల్ల
తండ్రిగా ప్రవర్తించండి!” అని అన్నపూర్ణ
చెప్పింది విని
కోపంగా లేచిన
పంచభూతం భార్య
ముందుకు వచ్చి
నిలబడ్డాడు.
“ఏయ్...ఆపవే...పెద్దగా
చెప్పొచ్చావు. నాకే
బుద్ది చెబుతున్నావు...నన్నేమన్నా
రౌడీ అనుకున్నావా...నేను
ఏ తప్పూ
చేయలేదు...అందాన్ని
ఎంజాయ్ చేశాను...అంతే...దీనికి
పోయి ఏమిటో
నేనొక స్త్రీ
లోలుడనేలాగా బిల్డ్
అప్ చేస్తున్నావు...” అని కోపంగా
అరుస్తూనే అన్నపూర్ణని
తోసేయగా, ఆమె దగ్గరున్న కుర్చీకి కొట్టుకుని
కిందపడబోయింది!
ఆమె కింద పడిపోకుండా ఉదయ్ ఆమెను
పట్టుకోవటంతో కుర్చీ అతని కాలు మీద పడింది! అతను తన
కాలును విదిలించున్నాడు.
ఉదయ్ తన
కూతుర్ని ప్రేమించటమే
ఆయనకు నచ్చలేదు...!
అందువల్ల అతనిపైన
ఎనలేని కోపంతో
ఉన్న పంచభూతం, ఉదయ్
తన భార్య
చేతిని పట్టుకుని
ఆమె కింద
పడిపోకుండా పట్టుకున్నాడనే
ఆగ్రహంతో, ఉదయ్
చొక్కా పుచ్చుకున్నాడు!
“నా
దగ్గర చేతులు
కట్టుకుని జీతం
తీసుకునే నువ్వంతా
నాకు బుద్ది
చెప్పేంత పెద్ద
మనిషి అయ్యావా...వెళ్ళరా
బయటకు...వెళ్ళరా
రాస్కల్...నువ్వు
నాకు అల్లుడివా...ఎవరింటి
అమ్మాయిని ఎవరు
పెళ్ళి చేసుకునేది.
నీకేం అర్హత
ఉందిరా నా
కూతుర్ని పెళ్ళి
చేసుకోవటానికి..” అని ఉదయ్
ని తిడుతూ
అతన్ని కొట్టటానికి
చేతులెత్తాడు!
పంచభూతం అలా
నడుచుకుంటాడని
ఎదురుచూసో ఏమో
ఉదయ్ అతని
దగ్గర నుండి
తనని కాపాడుకోవటానికి
పక్కకు జరిగాడు!
ఉదయ్ అలా
పక్కకు జరుగుతాడని
ఎదురు చూడని
పంచభూతం బ్యాలెన్స్
తప్పి
ఊగిసలాడాడు! తనని
తాను సరిచేసుకోవటానికి, దగ్గరున్న
టేబుల్ ను
పట్టుకోవటానికి
వెళ్ళగా, కింద
పడున్న కుర్చీని
కొట్టుకుని, టేబుల్
అంచును కొట్టుకుని
కింద పడిపోయాడు!
టేబుల్ యొక్క
షార్ప్ అంచు
ఆయన తలలో
లోతుగా గాయం
ఏర్పరచింది! ఆయన
స్ప్రుహ కోల్పోయాడు.
ఆంబులాన్స్ ను
రప్పించి పంచభూతాన్ని
హాస్పిటల్లో చేర్చారు.
ఎమర్జన్సీ వార్డులో
ఆయనకు చికిత్స
చేసిన డాక్టర్
పంచభూతానికి తలలో
లోతుగా దెబ్బ
తగిలిందని, అది
కళ్ళకు వెళ్ళే
చూపుల నరాలను
బాగా డేమేజ్
చేసిందని, ఆయన
ప్రాణానికి ఎలాంటి
ఆపద లేదని, కానీ
ఆయన చూపు
కోల్పోయేడని తెలిపారు.
అమ్మాయలను నమ్మించి
మోసం చేసి
కిడ్నాప్ చేసి
మృగంలాగా మానబంగం
చేసే నయవంచకులు
మాత్రమే కాదు
‘స్త్రీత్వాన్ని
గౌరవిస్తున్నాను!
అందాన్నే ఎంజాయ్
చేశాను! ఇదొక
పెద్ద నేరమా?’ అని
పిచ్చి వాగుడు
వాగుతూ, పలు
స్త్రీలను ధర్మ
సంకటంతో వంకర్లు
తిప్పించే పంచభూతం
లాంటి వారికీ, పక్కనున్న
వాళ్ళకు అలర్జీ
ఏర్పరిచే ఇలాంటి ముక్కుపొడి
మనుషులకూ వెంట
వెంటనే శిక్ష
పడాలి!
చివరి బొట్టు!
ఆరు నెలల
తరువాత, అన్నపూర్ణ
కలను నిజం
చేసేలాగా ఆమె
కూతుర్ని పెళ్ళి
చేసుకుని, ఆ
కంపెనీకే ఉదయ్
ఏం.డి
అయిపోయేడు!
ఇక ఆ కంపెనీలో పార్వతీకో, కస్తూరీకో, లేక మిగిలిన ఏ స్త్రీకైనా ఆమె ఆడతనానికి ఎటువంటి ఆటంకమూ రాదు! ఉదయ్ రానివ్వడు!
*************************************************సమాప్తం********************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి