ఆశ...(మినీ కథ)

 

                                                                              ఆశ                                                                                                                                                                        (మినీ కథ)

మానవుడు పుట్టుకతో ఆశాజీవి. ప్రపంచంలో అనేక మంది భౌతికమైన ఆశాపాశాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కథలోని ఒక వ్యక్తి దేనికోసం ఆశపడ్డాడో తెలుసుకుంటే మీరు నవ్వు ఆపుకోలేరు.

**************************************************************************************************

ఆఫీసులోపలకు వచ్చిన రాఘవ శర్మ గారు చుట్టూతా చూశారు. అన్ని కుర్చీలూ ఖాలీగానే ఉన్నాయి.

ఎక్కువ కుతూహలంతో తొందరగా వచ్చాశమా?’ -- చేతి మనికట్టును తిప్పి టైము చూశారు. ఉదయం 9.50 అయ్యింది. ఇంతలో జెర్మియా సుల్తానా లోపలకు వచ్చింది.

గుడ్ మార్నింగ్ సార్!

వెరి గుడ్ మార్నింగ్ జెర్మియా! అని ప్రతి విష్ చేశారు.

ఆమె తన సీటులో కూర్చుని పనిలో మునిగిపోయింది.

రాఘవ శర్మ గారు ఆరాటంతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.

ఎన్ని రోజుల కల. రోజు ఎలాగైనా నెరవేరిపోవాలి.మధ్యాహ్నం లంచ్ టైములో తన ఆశను ఆమెతో చెప్పేయాలి. మిగిలిన అసిస్టంట్ లందరూ సెలవులో ఉండటం మంచిదైపోయింది!

సూపరింటెండెంట్రోజూ ఇంటికి వెళ్ళే భోజనం చేసి వస్తారు. ప్యూనుకు ఏదైనా పని చెప్పి వాడ్ని బయటకు పంపిస్తే చాలు. అప్పుడు ఆఫీసులో నేనూ, జెర్మియా మాత్రమే ఒంటరిగా ఉంటాము!’  మనసులో సంతోషం పొంగింది.

జెర్మియా సుల్తానా  ఆఫీసుకు వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది. ఆమె వచ్చిన రోజు నుండే ఆయన్ని ఆశ చాలా ట్రబుల్ చేస్తోంది. వయసు యాభై దాటిన కూడా, మనసును కంట్రోల్ చేయటం కుదరలేదు.

రాఘవ శర్మ గారి భార్య ఒక సరైన గయ్యాలి. తన ఆశను, వీక్ నెస్ ను చెబితే...ఆమె ఏం చేస్తుందో ఆయన ఊహించుకోలేకపోయారు.

ముఖాన ఉమ్మేస్తుందో? కోపం వచ్చి అరిచి ఊరందరినీ పిలుస్తుందో? లేక చెంప మీద ఒకటిస్తుందో? విడాకుల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎలాగైనా పోనీ...ఇదిగో ఇంకో కొద్ది నిమిషాలలో  జెర్మియాతో ఒంటరిగా మాట్లాడే సమయం వస్తోంది.

ఆమె దగ్గర ఏమని చెప్పాలి? నా ఆశకు ఆమె లొంగుతుందా? రోజూ వద్దు. అప్పుడప్పుడు ఒంటరిగా సమయం, సంధర్భం  దొరికినప్పుడు మాత్రమే....ఊహూ, అదికూడా వద్దు. రోజు ఒకసారి మాత్రమే...అందులోనూ బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేలోపు!’--ఆయనకొస్తున్న ఆలొచనలే ఆయన్ని అవస్థ  పెడుతున్నాయి..

ఇదిగో సూపరింటెండెంట్ బయలుదేరారు. ప్యూనును బయటకు పంపించేసాము. జెర్మియా కూడా వేరే గదిలోకి వెళ్ళిపోయింది. రాఘవ శర్మ గారు మెల్లగా కుర్చీలో నుండి లేచారు. నడుచుకుంటూ జెర్మియా వెళ్ళిన గదిలోకి దూరారు.

ఆమె వెనక్కి తిరిగి చూసింది...గబుక్కున తలుపులు మూశేసి, గొళ్ళెం పెట్టారు.

ఆమె లేచి నిలబడింది.కళ్ళల్లో భయం!

సార్...-- ఆమెకు చెమటలు పట్టినై.

ఇంతవరకు ఆయన ఎవరి దగ్గరా ఇలా నడుచుకోలేదు.

ధైర్యాన్ని తెచ్చుకుని ఆమె దగ్గరగా జరిగారు.

ఆమె కళ్ళు భయపడటంతో దిగులుగా చూసింది. గొంతు అడ్డుపడింది.

హఠాత్తుగా ఆయనలో ఒక ఐడియా’!

ఆమెను అడగటం చేస్తూ ఉండటం కంటే...తిన్నగా కార్యంలోకి దిగిపోదాం. అరిచినా కూడా వదలనే కూడదు. మిగిలిన వాళ్ళు వచ్చేలోపు కార్యం ముగించుకుని కాళ్ళ మీద పడిపోవలసిందే!

నిర్ణయానికి వచ్చిన వెంటనే యాక్షన్లోకి దిగిపోయారు. ఆమె ముందు తెరిచిపెట్టున్న లంచ్ బాక్స్ ను  అమాంతం లాకున్నారు. అందులో ఉన్న చేపల పులుసు అన్నం,   కోడి గుడ్డూ తొందర తొందరగా తిన్నారు. కారం గాటుగా ఉండటంతో కళ్ళల్లో నీళ్ళు కారినై. చప్పరించుకుంటూ రుచిని బాగా అనుభవించి తిన్నారు. మంచి నీళ్ళు తాగారు.

షాక్ తో కర్రలాగా నిలబడిపోయున్న జెర్మియా దగ్గర--

జెర్మియా...నువ్వు రోజూ నాన్-వెజ్జేతింటున్నావని విన్నాను. నీ దగ్గర అడగాలంటే సిగ్గుగానూ, భయంగానూ ఉంది. ఇక ఎప్పుడూ ఇలా నడుచుకోను. బయట తెలిస్తే నా పరువు పోతుంది. దయచేసి ఎవరి దగ్గరా చెప్పద్దు...ప్లీజ్ అన్న ఆయన కళ్ళల్లొ బ్రతిమిలాటతో చేతులు వణుక తన ఆశ నెరవేరిందనే తృప్తితో గది నుండి వేగంగా బయటకు వచ్చారు

*************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సంస్కారం...(కథ)

తీర్పు...(కథ)

ఆడపిల్ల…(కథ)