రాత్రి 9.45…(కథ)..(కాలక్షేపం కోసం)

 

                                                                              రాత్రి 9.45                                                                                                                                                           (కథ-కాలక్షేపం కోసం)

గదిలో -- అతి భయంకరమైన నిశ్శబ్ధం!

చేతిలో ఉన్న చిన్న పెట్టెను, పసిపిల్లను కింద పడుకోబెట్టినంత మెల్లగా, జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టాడు అతను.

బాస్...మీరడిగిన బహుమతి

తన ఎదురుగా పెట్టబడిన అందమైన పెట్టెను, దాన్ని టేబుల్ మీద పెట్టిన అతన్ని నెమ్మదిగా చూశాడు, 'బాస్ అని పిలువబడ్డ అతను.

రేయ్...ఇప్పుడు టైము సాయంత్రం ఐదు-పది. సరిగ్గా రాత్రి తొమ్మిది ముప్పావుకు బాంబు పేలాలి. గోవర్ధన్ పెళ్ళి ఫంక్షన్ కు మన బహుమతి ఇదే

గోవర్ధన్.

బ్రతకటం చేతకాని కార్మీక సంఘం నాయకుడు. న్యాయమైన పోరాటాల వలన ఎంతోమంది విరోధులను వెతుకున్నతను.

రోజు అతనికి షష్టిపూర్తి పుట్టినరోజు సంబరం!

సింపుల్ గా తన ఇంటి దగ్గర హడావిడి లేకుండా శ్రేయోభిలాషుల బలవంతం మీద, అదే శ్రేయోభిలాషుల కోసం భోజన ఏర్పాట్లు చేసి శ్రేయోభిలాషులందర్నీ రమ్మని పిలిచాడు. 

బాస్ అని పిలువబడే అతని శ్రేయోభిలాషులు వచ్చారు. పెద్ద పూలమాల వేశారు

ఏమిటండీ? ఇంత పెద్ద పూలమాలకు ఖర్చు పెట్టిన డబ్బును అనాధ బాలుల  స్కూలుకు డొనేషన్ గా ఇచ్చుంటే కొంచం సహాయంగా ఉండేది కదా?”-- కఠినత్వం కలిసిన స్వరం.

టైమ్ బాంబు పెట్టె బహుమతిగా ఇవ్వబడింది.

నేను బహుమతులు తీసుకోను అని తెలుసు కదా? ఇప్పుడెందుకు ఇది. దీనికి ఖర్చు పెట్టిన డబ్బును కూడా డోనేషన్ గా ఇచ్చుంటే చాలా బాగుండేదిఅంటూ గోవర్ధన్ బహుమతి పెట్టెను తెరిచి చూడటానికి ప్రయత్నం చేశాడు.

బహుమతి ఇచ్చినతను భయపడ్డాడు.

ఇప్పుడొద్దు నాయకా! ఫంక్షన్ పూర్తి అయిన తరువాత విప్పి చూడండి "

లోపు ఇంకొకతను కరెక్టుగా సమయంలో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి జారుకున్నాడు.

భొజనం చేసి వెళ్ళండి

సరే నాయకా!

ముప్పై ఏళ్ళు తనతో కాపురం చేసిన ప్రియమైన భార్య, గర్వంతో ఆనందిస్తూ నిలబడుండగా, ఆమె పక్కన కొడుకు - కోడలు సంతోషంగా కబుర్లు చెబుతున్నారు. గోవర్ధన్ శ్రేయోభిలాషులు వేసిన పూలమాలలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. మనవడు విమల్ కొంచం దూరంలో తమ పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నాడు.

టైము రాత్రి 9.00.

బాస్ తన అసిస్టంట్లతో బయటున్న ఒక టీ కొట్టు వాకిటి ముందు కారు ఆపాడు.

మనవడు విమల్ బాస్ ఇచ్చిన అందమైన పెట్టెతో అటూ, ఇటూ పరిగెత్తేడు. గోవర్ధన్ మనవుడ్ని ఆపి పెట్టెను తీసుకున్నాడు. మనవుడు పట్టుదలగా పెట్టే కావాలని ఏడవడటంతో, బహుమతి పెట్టెను పక్కనున్న సూట్ కేసు మీద పెట్టాడు.

మనవుడి తల్లి ఏడుస్తున్న విమల్ ను దగ్గరకు తీసుకుని, ఒక బిస్కట్ ప్యాకట్ ఇచ్చి వాడ్ని సమాధాన పరిచింది.

రాత్రి 9.35.

నాయకా! మీరు హైదరబాద్ వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మన ఫ్యాక్టరీ లైసన్స్ విషయాన్ని గమనించాలి

వచ్చిన వెంటనే మొదటి పని అదే!

తిరిగి రాబోతాడుట. ఇంకో ఎనిమిది నిమిషాలలో తిరిగి రాలేని లోకానికి వెళ్ళబోతాడుబాస్ అని పిలువబడే అతని ఒక సహచరుడు, బహుమతి పెట్టెను ఇచ్చిన మరో సహచరుడి దగ్గర సంతోషంగా చెప్పాడు.

విమల్ -- కుక్కను కోపంగా చూస్తూ బిస్కట్ ప్యాకెట్టులో ఉన్న బిస్కట్లను తింటున్నాడు. వాడి ఎదురుకుండానే కూర్చుని, తనకు ఒక బిస్కెట్ ముక్క అయినా పెట్టడా అని ఎదురు చూస్తూ కూర్చుంది కుక్క.

రాత్రి 9.43.

రేయ్. బాంబు పేలటానికి ఇంకా రెండు నిమిషాలే ఉంది. రా బయటకు వెళ్ళిపోదాం

గోవర్ధన్ కు బహుమతి అందించిన వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. కారు బయలుదేరటానికి రెడీ అయ్యింది.

బాస్...మన శతృవు గోవర్ధన్ మన కళ్ళెదుటే చచ్చి పోవటం చూసి వెళ్దాం అన్నాడు ఒకతను.

వాళ్ళు కాచుకోనున్నారు.

రాత్రి 9.44 గంటల 30 సెకెండ్లు.

విమల్ కుక్కకు ఒక బిస్కెట్ ముక్క కూడా వేయకుండా అన్ని బిస్కెట్లను తినేసి ఖాలీ ప్యాకెట్టును విసిరేసాడు. అది వెళ్ళి బహుమతి పెట్టె మీద పడింది. అంతవరకూ తనకి ఒక బిస్కెట్ ముక్క అయినా పెడతాడనుకున్న కుక్కకు కోపం వచ్చింది. ఆదే కోపంతో పరిగెత్తుకు వెళ్ళిన కుక్క ఖాలీ బిస్కెట్ ప్యాకెట్ను నొట కరుచుకుంది. వేగంలో బహుమతి పెట్టెను కూడా నోట కరుచుకుని బయటకు పెరిగెత్తింది.

బాస్...బాస్! మనం బహుమతిగా ఇచ్చిన పెట్టెను కుక్క లాక్కుని వస్తోంది.....సహచరడు చెప్పి ముగించ -- బాస్ షాక్ తో కారు స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ కాలేదు.

ఎదురుగా వచ్చిన ఆటో ఒకటి కుక్కను ఢీ కొట్టింది -- బహుమతి పెట్టే జారిపడి కారు కిందకు వెళ్ళింది.

వాళ్ళు చేతి గడియారం చూశారు.

9.44-55 సెకెండ్లు.

రేయ్, దిగి పెరిగెత్తండి రా

వాళ్ళు హడావిడిగా కారులో నుండి దిగుతున్నప్పుడు.

ఢాం...

బాంబు పేలిన బలమైన మోత.

కారు, బాస్ సహచరులతో తాటి చెట్టంత పైకి ఎగిసి -- తరువాత ముక్కలై కింద పడింది.

**************************************************సమాప్తం*******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎందుకింత వేగం…(కథ)

టర్నింగ్ పాయింట్...(కథ)

వాగుడుకాయ...(కథ)