వనిత...(కథ)


                                                                               వనిత                                                                                                                                                          (కథ) 

దొరికిన విరామంలో తల్లికి ఫోన్ చేసి ఆ సంతోషకరమైన వివరం చెప్పింది పూర్ణిమా.

అంతా సేరేనే...అల్లుడు నిన్ను పంపుతారా అనేది చూసుకో. ఎందుకంటే, నువ్వు ఉద్యోగానికి వెళ్ళకూడదని ఆయన ఖచ్చితంగా ఉన్నారు. రేడియోలో న్యూస్ రీడర్ ఉద్యోగం ఆయన ఒప్పుకుంటారా? నా కెందుకో ఆయన వద్దని చెబుతారనే అనిపిస్తోంది” 

ఏంటమ్మా ఇలా చెబుతున్నావు...ఇది ఎవరికీ దొరకని అవకాశం. నా ప్రయత్నానికీ, నైపుణ్యానికీ దొరికిన అంగీకారం”

అదంతా నువ్వు నాకు కూతురుగా ఉన్నంత వరకే. ఇప్పుడు నువ్వు భార్గవ్ భార్యవు. ఆయనకు ఏది ఇష్టమో అదే నీ ఇష్టం అవాలి” 

అయితే నాకని ఏ ఇష్టమూ, కోరిక, ఆశ ఉండకూడదా? నీకే తెలుసు. వార్తలు చెప్పే వ్యక్తిగా అవ్వాలనేదే నా చాలా రోజుల ఆశ, కల. ఇప్పుడు నువ్వే ఇలా చెబుతున్నావేమ్మా”

ఒక మగాడి అంగీకారం లేకుండా, ఏ ఆడదీ తన, తెలివితేటలను బయట పెట్టలేదమ్మా. అర్ధం చేసుకో. అది నాన్నగానే ఉండనీ, తోడ పుట్టిన అన్నయ్యో, తమ్ముడో లేక భర్తగానే ఉండనీ. వాళ్ళందరినీ ఎదిరించి ఆ ఆడది విజయం సాధిస్తే ఈ సమాజం వాళ్ళని వేరే స్థూల దృష్టితోనే చూస్తుంది”

ఆయితే నేను నా కలలను జయించలేనా...? నేను ఇలా వంట గదిలో చిక్కుకుని మగ్గిపోవలసిందేనా?”

పూర్ణిమా వంటగదిలోనే మగ్గిపోయిందా లేక తన ఆశను నెరవేర్చుకుందా? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

***************************************************************************************************

ప్రొద్దున భార్గవ్  ను, పిల్లలనూ పంపించి, నా కని కొంత సమయాన్ని తీసుకుని సోఫాలో వాలాను. కారుతున్న చెమట ఉప్పు నీరు నా శరీరంలోనూ, మొహంలోనూ జిడ్డు ఏర్పరిచింది. చీర కొంగుతో ముఖాన్ని తుడుచుకుని నా సెల్ ఫోనుకు ప్రాణం ఇచ్చాను. నిన్న రాత్రి నుండి వచ్చిన మేసేజీలను అన్నిటినీ ఒక్కొక్కటిగా చూశాను.

ఒక కొత్త నెంబర్ నుండి వచ్చిన ఒక మేసేజ్ నా ఆత్రుతను ప్రేరేపించ, దాన్ని ఓపన్ చేశాను. నేను ఎదురు చూసినట్టే మేసేజ్ లోని వివరాలు నాకు సంతోషాన్ని ఇచ్చింది.

మీ యొక్క తెలుగు ఉచ్చారణ, స్వరం అద్భుతం. మా ఆకాశవాణి 199.6  బ్యాండ్విడ్త్ వార్తా విభాగానికి మీ స్వరం సెలెక్ట్ అయ్యింది. సొమవారం నాడు మీ  స్వరాన్ని పరిశోధనా రన్ కోసం మా యిక్క రేడియో స్టేషన్ కు మీరు రావాలి.  జీతం గురించిన ఇతర వివరాలను ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అని ఉన్నది. నేను  సంతోషంలో ఒక్క నిమిషం ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. ఏదో ఒక రోజు ఖాలీగా ఉన్నప్పుడు, ఉండనీ అనుకుని మొబైల్ ఫోనులో నేను వార్తలు చెబుతున్నట్టు ఆడియో రికార్డు చేసి దరఖాస్తు చేసినది, రోజు అది సెలెక్టు అయ్యింది. ఎవరికీ దొరకని అవకాశం నాకు దొరికినందు వలన నాకు గర్వంగా ఉన్నది. సంతోషమైన విషయాన్ని ఎవరితోనైనా పంచుకోవాలని అనిపించింది.

అదే సంతోషంతో అలాగే గ్రైండర్ లో మినపప్పు వేసేసి, దొరికిన విరామంలో తల్లికి ఫోన్ చేసి వివరం చెప్పాను.

అంతా సేరేనే...అల్లుడు నిన్ను పంపుతారా అనేది చూసుకో. ఎందుకంటే, నువ్వు ఉద్యోగానికి వెళ్ళకూడదని ఆయన ఖచ్చితంగా ఉన్నారు. రేడియోలో న్యూస్ రీడర్ ఉద్యోగం ఆయన ఒప్పుకుంటారా? నా కెందుకో ఆయన వద్దని చెబుతారనే అనిపిస్తోంది  

ఏంటమ్మా ఇలా చెబుతున్నావు...ఇది ఎవరికీ దొరకని అవకాశం. నా ప్రయత్నానికీ, నైపుణ్యానికీ దొరికిన అంగీకారం

అదంతా నువ్వు నాకు కూతురుగా ఉన్నంత వరకే. ఇప్పుడు నువ్వు భార్గవ్ భార్యవు. ఆయనకు ఏది ఇష్టమో అదే నీ ఇష్టం అవాలి  

అయితే నాకని ఇష్టమూ, కోరిక, ఆశ ఉండకూడదా? నీకే తెలుసు. వార్తలు చెప్పే వ్యక్తిగా అవ్వాలనేదే నా చాలా రోజుల ఆశ, కల. ఇప్పుడు నువ్వే ఇలా చెబుతున్నావేమ్మా

ఒక మగాడి అంగీకారం లేకుండా, ఆడదీ తన, తెలివితేటలను బయట పెట్టలేదమ్మా. అర్ధం చేసుకో. అది నాన్నగానే ఉండనీ, తోడ పుట్టిన అన్నయ్యో, తమ్ముడో లేక భర్తగానే ఉండనీ. వాళ్ళందరినీ ఎదిరించి ఆడది విజయం సాధిస్తే సమాజం వాళ్ళని వేరే స్థూల దృష్టితోనే చూస్తుంది 

ఆయితే నేను నా కలలను జయించలేనా...? నేను ఇలా వంట గదిలో చిక్కుకుని మగ్గిపోవలసిందేనా?

నా కలలను అర్ధం చేసుకున్న ఆవిడ, ఇప్పుడు ఏమీ మాట్లాడలేని వ్యక్తిగా ఉన్నది. నీ ఇష్టాన్ని అల్లుడికి అర్ధమయేటట్టు, అర్ధం చేసుకునేటట్టు చెప్పు. నువ్వు ఓర్పుగా, ప్రేమగా ఉండి ఆయన దగ్గర నీ తెలివితేటలు ఉపయోగించి సాధించు. తరువాత నువ్వే చూసుకో, ఆయనే నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు.  ఆయనకు ఇష్టం లేకపోతే గొడవుకు సిద్దంకాకు. కాస్త ఓర్పుగా మాట్లాడు. ఓర్పు, ఓర్పు అని ఎందుకు చెబుతున్నానో తెలుసా, ఓర్పుగా ఉన్నవారికి భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు

నిర్ణయం తీసుకున్నాను. భార్గవ్ విశ్రాంతంగా కూర్చున్న సమయంలో చిన్నగా నాకు వచ్చిన మెసేజ్ ను చూపించాను.

ఇలా చూడండి...నాకు న్యూస్ చెప్పే న్యూస్ రీడర్అవకాశం దొరికింది అన్నాను. నేను ఎదురు చూసినట్లే భార్గవ్ మేసేజ్ ను చూడటానికి నా మొబైల్ కూడా తీసుకోలేదు.

ఇదంతా వద్దు పూర్ణిమా. నీకు ఇది సరి రాదు. నువ్వు పిల్లలను మాత్రం పట్టించుకో అది చాలు ఒకే వాక్యంలో పులుస్టాప్ పెట్టేసారు. నేను దాన్ని కమాగా మార్చాలని అనుకున్నా.

సరే నండీ. కానీ ఇది నా చాలా రోజుల కల. మీకు గానీ, పిల్లలకు గానీ ఎటువంటి ఇబ్బందీ రాకుండా, అన్నీ చేసి పెట్టేసి నాకు దొరికే ఖాలీ సమయంలో నేను వెళ్తాను

అదెలా కుదురుతుంది? అదంతా జరిగే విషయం కాదు! నువ్వు ఉద్యోగానికి వెళ్ళి మనకి జరగబోయేది ఏమీ లేదు! వెళ్ళు. విషయం గురించి ఆలొచించటం మానేసి మిగిలిన పనులు చూడు

అమ్మ చెప్పినట్టు గొడవకు నిలబడలేదు. వంటగది లోకి వెళ్ళిపోయాను. రెండు రోజులు గడిచింది. ఏమీ చెయ్యలేని దానిలాగా అయిపోయి గూటిలోని పక్షిలాగా ఉండిపోయాను.

రోజు, రాత్రి డిన్నర్ ముగించుకుని రెస్టు కొసం కూర్చున్న సమయంలో నా కూతురు మేనకా, “నాన్నా, స్కూల్లో చేస్ నేర్పిస్తారట. చేరాలనుకునే వారు చేరచ్చు అని మిస్ చెప్పింది. నాకు చేస్ నేర్చుకోవాలని ఉంది. నేను చేరనా?” అని అడిగింది.

ఫీజు ఎంతట?”

నెలకు వెయ్యి రూపాయలు నాన్నా... అన్నది.

నేను అడ్డుపడి ఏమిటీ...వెయ్యి రూపాయలా? ఒక సంవత్సరం ఫీజును చేర్చి పెడితే పావు కాసు నగ కొనుక్కోవచ్చు. నాన్న వల్ల కాదు పరుపు మీద దుప్పటి సరిచేస్తూనే చెప్పాను.

ప్లీజమ్మా...నా ఫ్రెండ్స్ అందరూ చేరారు. గోపీ కూడా చేరేడమ్మా చిన్నగా సనగటం మొదలు పెట్టింది.

గోపీ మగ పిల్లాడు. చాంపియన్ అయితే రేపు ఉద్యోగం దొరుకుతుంది. నువ్వు చాంపియన్ అయ్యి ఏం చెయ్యబోతావు? నాలాగా బాగా వంట చేయటం నేర్చుకో. అది చాలు నేను అర్ధంతో మాట్లాడింది భార్గవ్ కు బాగా అర్ధమయ్యి ఉంటుంది. తలెత్తి నన్ను చూడటానికి మనసురాక మేనకా దగ్గర ముద్దుగా మాట్లాడాడు.

ఏం...నా మేనకా బుజ్జీ కూడా రేపు చాంపియన్ అయ్యి ఉద్యోగానికి వెళుతుంది...ఆమె సొంత కాళ్ల మీద నిలబడుతుంది... కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు.

దాన్ని ఉద్యోగానికి పంపటం ఇష్టం లేని మీలాంటి మనసున్న భర్త దొరికితే?”

దైర్యంగా భర్త కళ్ళలోకి చూసి అడిగాను. ఆడపిల్లను కన్న తండ్రి అయినా, తన కూతుర్ని మహారాణిలాగానే చూస్తాడు. కానీ అది భార్య అని ఎదిగిపోతే ఆమెకున్న మహారాణి అనే పిలుపు పోతుంది. మూర్ఖురాలిగా, పనిచేసే పని మనిషిగానే భార్య ఉండాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇది విధంగా న్యాయం? ఒక వేల భార్య ఉద్యోగానికి వెళ్లి సంపాదించినా తనకు బానిసగానే అనిగిమనిగి ఉండాలని అనుకోవటం విధంగా న్యాయం? ఇది ఉత్త మొండి పట్టుదల అన్నాను.

నేను మాటాడిన దానికి ఎటువంటి ఎదురు సమాధానం చెప్పక మేనకా బుజ్జికి చెస్ క్లాసులు ఎప్పుడు ప్రారంభం అన్నాడు మహారాణిలాగా ముద్దాడటాన్ని మానకుండా.

రేపు నాన్నా

ఒకే...చెస్ క్లాసులో చేరిపో. అయితే బాగా ఆడటం నేర్చుకుని పోటీలలో మొదటి బహుమతి తెచ్చుకోవాలి సరేనా?”

సరే నాన్నా... సంతోషం పట్టలేక తండ్రి బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది.

 లేచి మౌనంగా వంట గదికి వెళ్ళటానికి పక్కకు తిరిగిన నా చేతిని పుచ్చుకుని లాగారు.

రోజు నువ్వు రేడియో స్టేషన్ కు వెళ్ళాలి?”

****************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)